అక్షర

విద్యార్థులకు సైకాలజీ అవసరమా?(పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-డా.ఎం.వి.ఆర్.కృష్ణాజీ
వెల: రూ.100/-
ప్రతులకు: రచయిత
కేరాఫ్ గురజాడ స్కూల్,
విజయనగరం - 535 003
9440193517

** ** ** **

సైకాలజీ అంటే మానసిక లేదా మనస్తత్వ శాస్త్రం. ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ చూసినట్లయితే మెదడును అర్థం చేసుకునే శాస్త్రం. మెదడు ద్వారా మన ప్రవర్తనను ప్రభావితం చేసే శాస్త్రం. సైకాలజీకు సైకియాట్రీకి తేడా ఉంది. సైకియాట్రీ అంటే మానసిక రోగాలకు సంబంధించిన చికిత్స. 20వ శతాబ్దంలో సైకాలజీ అంటే జీవ రోగాలకు సంబంధించిన ప్రవర్తనకు చెందిన శాస్త్రంగా దీన్ని అభివర్ణించారు. ప్రవర్తన అంటే జీవితంలో చేసే అన్ని పనులను ప్రభావితం చేసేది. నడకనూ, ఈతనూ, నాట్యాన్నీ, ఆలోచననూ, మాట్లాడ్డాన్నీ, ఊహించడాన్నీ, ఆనందించడాన్నీ, బాధపడడాన్నీ, కోపం ప్రదర్శించడాన్నీ.. మనం తెలిసి చేసిన పనులలో, తెలియక చేసిన పనులలో కూడా ప్రవర్తన కనిపిస్తుంది. సైకాలజీ భౌతిక శాస్త్రం, జీవ శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్ష శాస్త్రం మొదలగు సబ్జెక్టులలాగా అంత అభివృద్ధి చెందినది కాదని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ మనో విజ్ఞాన శాస్త్రంలో అనేక రకాలైన ఆవిష్కరణలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సైకాలజీ గురించి వివరంగా చిన్నతనం నుండే అవగాహన ఏర్పరచుకుంటే భవిష్యత్‌లో మీ ప్రవర్తనలను అదుపులో ఉంచుకునే శక్తిసామర్థ్యాలను పొందవచ్చునన్న విషయాన్ని ఈ పుస్తకం తెలియజేశారు రచయిత.