అక్షర

వైవిధ్యభరిత కథానందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానందనం
(కథల సంకలం)

**** *** *** ****

సంకలం: డా.్భవన్
సాహితీమిత్ర సౌరభాలు
15-21-12/3,
నియర్ ఉమెన్స్ కాలేజీ
అనకాపల్లి -531 002
వెల: రూ.400

డా.్భవన్ సంకలనం చేసిన ఇరవై మంది కథకులు అయిదయిదు కథల - వెరసి వంద కథల, వైవిధ్యభరిత కథాసంకలనం ‘కథానందనం’. గతంలో పదిమంది రచయితల కథలతో ‘తెలుగు కథనం’ వెలువరించిన వారే ఇప్పుడు పది మంది రచయిత్రులు, పదుగురు రచయితల కథలతో ఈ ప్రయోగానికి తలపడ్డారు. సోమరాజు సుశీల, వాసా ప్రభావతి, వడలి రాధాకృష్ణ వంటి ప్రముఖులతోపాటు ఎండ్లూరి మానస, వడ్లమన్నాటి గంగాధర్ వంటి నవతరం రచయితల కథలున్న ఈ సంకలనంలో తొమ్మిదిమంది దాకా విశాఖవాసులే. జి.రంగబాబుగారు విశాఖ జిల్లా అనకాపల్లి రచయిత.
ఒక్కొక్కరివి అయిదు కథలు ప్రచురిస్తూ వంద కథలకూ ప్రముఖ చిత్రకారులు ‘బాలి’గారి బొమ్మలు సంతరింపజేశారు. అన్నట్లు సంకలనంలో (అ)ద్వితీయంగా చిత్రకారునిగానే కాక కథకునిగా చూపే బాలి రాసిన అయిదు కథలున్నాయి. సంకలనకర్త డా.ఎం.వి.జె.్భవనేశ్వరరావు కథలు కూడా వున్నాయి. ఈ వంద కథల నందనానికి ముందు మాటలు అందగింపజేసింది కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రధాన కార్యదర్శి డా.కృత్తివెంటి శ్రీనివాసరావు, నేషనల్ బుక్‌ట్రస్ట్ తెలుగు సహాయ సంపాదకులు డా.పత్తిపాక మోహన్, ప్రముఖ రచయిత్రి శ్రీమతి కుప్పిలి పద్మగారలు. ఇంతకీ ఈ బృహత్సంకలనానికి ఆర్థిక వనరులు సహకార ప్రాతిపదిక మీద ఇందులోని రచయితలు, రచయిత్రులే సమకూర్చుకుని ఉండవచ్చు. ఎందుకంటే ఓ వంద కథల సంకలనం తానే భువన్‌గారు వేయదలుచుకుంటే ఎంచుకున్న కథకులు వేరే అయ్యుండాలంటే అలాంటి ఆర్థిక మతలబులు వుండక తప్పదు.
వీరందరూ గొప్ప కథకులు కాకపోవచ్చు. కానీ మంచి కథకులు. మానవ సంబంధాలే ప్రధానంగా వీరందరి కథావస్తువులు. తెలుగు కుటుంబాల మూడు తరాల జీవన వైవిధ్యాలు ఈ కథల్లో తొంగి చూస్తున్నాయి. పత్తిపాక మోహన్ వీటిని నూరు కథల హోరు అన్నాడు. ఆయన రచయితల కథల గురించి ప్రస్తావిస్తే కుప్పిలి పద్మ రచయిత్రుల కథల గురించి ఆకాశంలో సగం.. ఈ కథానందనం అంటూ వివరించారు. స్ర్తిల జీవితాల్లోని అనేక పార్శ్వాలని ఈ కథల్లో చూడవచ్చునంటూ ‘కథయినా, కవిత్వమైనా, నవలైనా మనకి ఆసక్తిని, ఆశ్చర్యాన్ని రసజ్ఞతని మేల్కొల్పాలి. కథకులకి తమకు విషయాల పట్ల ఉన్న పూర్తి అవగాహనను ఎంతవరకు కథలో ఉపయోగించుకోవాలో తెలియాలి. రాస్తున్న అంశం మీద అవగాహనతో రాస్తున్నారా, అవగాహనా రాహిత్యంతో రాస్తున్నారా అన్నది పాఠకులు గుర్తిస్తారు. వారికి నచ్చిన కథలని పదిలపర్చుకుంటారు. ఇదంతా చెప్పటం సమకాలీన తెలుగు కథ అనేక పార్శ్వాలుగా ఉంటుంది. అలానే ఈ కథానందనం ఇందులోని రచయిత్రుల నేపథ్యాలు వేరు. వారి వయసులూ వేరు. వారి భావజాలం వేరు. వైఖరులు వేరు. వాటి మీదే వారి కథా వస్తువులు ఆధారపడి ఉంటాయి’ అని విశదీకరించారు.
ఒక్కొక్క రచయిత(త్రి) అయిదు కథలనూ సమీక్షిస్తూ ఒకరి సమీక్షను కూడా ఆ కథకుల విభాగం చివర చేర్చడం మరో ప్రయోగం. అలా ఇరవై మంది కథా సమీక్షకుల విశే్లషణలను కూడా ఈ సంకలనంలో చూడగలం. బాలి రాసిన అమ్మన్న సిస్టర్స్ కథను కోలపల్లి ఈశ్వర్, తురగా జయశ్యామల గారి రమ్యస్మృతి డార్జిలింగ్ టూర్ కథను డా.పెళ్లకూరు జయప్రద, వాసా ప్రభావతిగారి కథలను పోడూరి కృష్ణకుమారి ప్రశంసించారు. వి.ప్రతిమ శానాపతి (ఏడిద) ప్రసన్న లక్ష్మి కథలను గురించి చెబుతూ అక్కడక్కడా కొంత అసహజత్వం మనకు కన్పించినప్పటికీ మొత్తం మీద స్ర్తిల చైతన్యమూ, అభ్యుదయకరమైన ఆలోచనలు ఈ కథలకు మూలసూత్రమని చెప్పుకోవచ్చన్న మాట యధార్థం. రాగతి రమ కథలను మరో వర్థిష్ణు రచయిత్రి కనె్నగంటి అనసూయ విశే్లషిస్తూ కథా నిర్మాణ పద్ధతులు తెలుసుకుని కథలు వ్రాసేవారే గొప్ప కథలు వ్రాస్తారు అనుకోవటం పొరపాటు. రాయగల కళ వుండి, సామాజిక సమస్యల పట్ల అవగాహన కలవారెవరైనా కథలు వ్రాయగలరు అనే దానికి నిదర్శనం ఆ కథలు అని తేల్చేసారు. వడలి రాధాకృష్ణ కథలను శరత్‌చంద్ర, భువన్‌గారి కథానికలను వేదగిరి రాంబాబు విశే్లషించారు. వరుసబెట్టి కథానికలు చదువుకుంటూ పోతే, అవి అలా చదివించేస్తే సరికాదనీ ఒక్కో కథానికను చదవడం పూర్తవగానే మనసులో ఆలోచనలు ముసురుకుని, మనలోకి తొంగిచూసి బేరీజు వేసుకునేలా వుండాలని అంటూ ‘శాశ్వత విలువలైన మానవతా విలువల్ని పెంచే కథానికలకన్నా ప్రస్తుతం కావలసిన కథానికలు లేవు’ అంటాడు వేదగిరి రాంబాబు.
కథానందనం వంటి బృహత్సంకలనం వేస్తున్నప్పుడు అత్యంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమీక్షార్థం అందుకున్న సంకలనంలో 194, 195, 198, 199, 202, 203, 206, 207 పేజీలు వట్టి తెల్లకాగితాలుగా దర్శనమిచ్చాయి. అందువల్ల గంగాధర్ వడ్లమన్నాటి, కమలారాంజీ న్యాయపతి కథలు పూర్తిగా చదవలేక అన్యాయమై పోయాయి. మొత్తం సంకలనంలో మానస ఎండ్లూరి, ఉమామహేశ్వరరావు నారంశెట్టి మున్ముందు మరింతగా అలరించగల ఆశావహ కథకులుగా గోచరిస్తున్నారు. ఏమయినా కథానందనం కు ఓ పెద్ద వందనం.

-సుధామ