అక్షరాలోచన

జ్ఞాపకం చిహ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇవ్వాళ కొన్న వస్తువు
రేపటికి పాతదై
మూడో రోజు
దాని స్థానంలో
మరొకటి ఆక్రమిస్తున్న రోజుల్లో
మారుతున్న అభిరుచుల్తో
కొత్త అందాలు అద్దుకున్న గదులలో
ఎప్పటిదో ఒక పాత వాసన!
చిన్నతనం నుండి చూస్తున్నా
దాని వయసెంతో నాకూ తెలియదు.

ఇంటి రహస్యాల్ని ఎన్నిటిని
తన కడుపులో దాచుకుందో
ఎన్ని పుస్తకాల్ని
అస్తారబతంగా భద్రపరిచిందో
ఎన్ని విలువైన దస్త్రాలకు
రహస్య పేటికో అది!
నాకు వారసత్వంగా సంక్రమించింది
ఆ పాత కావడి పెట్టె!

అద్దాల బీరువాలు
అందమైన షోకేసులు
కొత్తగా ఇంటికి ఎన్ని చేరినా
దాని ప్రత్యేకత దానిది
ఇప్పటికీ అది
దాచుకోటానికి పెట్టె అవుతుంది
కూర్చోటానికి ఎత్తుపీట అవుతుంది
అపురూపమైన ఒక జ్ఞాపక చిహ్నం అవుతుంది!

నూతలపాటి వెంకటరత్నశర్మ 9866376050