అక్షరాలోచన

ఊపిరి దారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నా, నేను స్వరకర్తలుగా
పియానోస్ వాయిస్తున్నట్టు
ఎదురెదురు మగ్గాలపై నేత పాట అల్లుతాం

అమ్మ
మా సంగీతానికి గొంతు కలిపినట్టు
గిరగిరా గిరగిరా రాట్నం తిప్పుతుంది

వస్త్రాలు నేసే వాళ్లమే అయినా
అరచేతిలో పుట్టుమచ్చ వున్నట్టు
ఎన్ని వస్త్రాలు నేసినా
ఒక్కటీ కట్టలేని అదృష్టం ఉన్నోళ్లం.

అమ్మ ఎనే్నళ్లుగా ఆశ పడుతున్నదో
ఎన్ని రోజులుగా కల గంటున్నదో,
నాన్నని ఆరుగజాల కోరిక అడగాలని
అనుకుంటూ
ఎనె్నన్ని కండెలు తిప్పిందో.

నాన్న చెవి దగ్గర ఆకాశవాణీ
ఘంటసాల గానం వినిపిస్తూ వుంటే
నాగస్వరం వింటున్న నాగులా
నాన్న ఆనందంతో ఊగిపోతున్నపుడు,
అమ్మ అమాయకం గాకపోతే
పూలమాల అల్లినట్టు సుకుమారంగా,
మెత్తగా అడగాలి గానీ,
కండెల వరుస దండ గుచ్చిన సూదిలా
‘నాకో చీర నెయ్యి’ అని పొడిచింది.

నాన్న గుండెల పిడుగు పడ్డది,
వౌనం సమాధానం అయ్యింది.

నాన్న నేసే పట్టుచీరే కావాలంటూ
వంటింటి విప్లవం వర్థిల్లుతున్నది
అలక రాగం ఎత్తుకుని
రాట్నం సమ్మె చేస్తున్నది.

కండెపోగు లేక
ఆగిపోయిన మగ్గం

మెతుకు దూరమవుతున్న
ఆకలి వస్త్రం నేస్తున్నది

పగలూ రాత్రీ వొళ్లొంచి నేసిన చీర
దళారులున్న బజారులో
గిట్టుబాటు ధర నలిగిపోయి
ముసురుకున్న
పూట గడవని కష్టకాలంలో,

‘చీర నెయ్యి కట్టుకుంటానూ’ అంటే
తెలిసి తెలిసి
పిల్లల ఆకలి చూపులు
సీతాకోక చిలుకలుగా ఎగరేయలేను అని

వొంట్లో వొణుకు పుట్టిన నాన్న
అమ్మ చేతులే పట్టుకున్నాడో
పాదాలే ముట్టుకున్నాడో
ఎలా బతిమిలాడుకున్నాడో ఏమో
వంటిల్లు కుదురుగా ఉన్నది.
తిరగనన్న రాట్నం తిరుగుతూ ఉన్నది.

పోగుపోగులో అల్లుకుంటున్న
చీర కట్టు సంస్కృతికి
ఊపిరి దారం అందుతున్నది.

గజ్జెల రామకృష్ణ 8977412795