అక్షర

పరిచయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారు చేనేత
భవిష్యత్తు ఉజ్వలం
వెల: రూ.100/-
ప్రతులకు: సంఘమిత్ర పబ్లికేషన్స్
ఫ్లాట్ నెం.402, రామ్‌శ్రీ ఎలైట్,
అల్త్ఫా నగర్, బైరామల్‌గూడ బస్టాప్ దగ్గర, ఎల్.బి.నగర్
హైదరాబాద్-74.. 9348009227
---

భారతీయ చరిత్ర సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక చేనేత వస్త్రాలు. ప్రపంచ నాగరికతలతోపాటు భారతీయ చేనేత పరిశ్రమ ఘనకీర్తిని సంపాదించింది. అరిలియన్ ప్రభువు కాలంలో బంగారంతో సమానమైన ధరకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయటం గమనిస్తే మన దేశ ప్రాచీన చేనేత వస్త్రాల నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో చెప్పవచ్చు. 13వ శతాబ్దంలో మన దేశానికి వచ్చిన పర్యాటకులు ప్రపంచంలో మరెక్కడా ఇంతటి సుందరమైన వస్త్రాలు తయారుకావని కొనియాడారు. 16వ శతాబ్దంలో బంగ్లాదేశ్ సందర్శించిన వార్తమా, రాల్ఫ్‌పిచ్, డక్కా మజ్లిన్‌ల సొగసు, సున్నితత్వం, పనితనం మెచ్చి సాయంకాలపు మంచుతోనూ వాయువుతోనూ, ప్రవహించు నీటితోనూ మన దేశపు మజ్లిన్ వస్త్రాలను పోల్చారు. దీనినిబట్టి భారతీయ వస్త్ర కళాకారులు దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసి, అనువంశిక వృత్తి కళా నైపుణ్యాలను ఖండాంతరాలలో నిలబెట్టి దేశానికి ఖ్యాతిని సముపార్జించారు. చేనేత వస్త్రాలకు విపరీతమైన డిమాండ్ ఒకవైపు, పనిలేని నేత కార్మికుల పరిస్థితి మరోవైపు, ఈ వైరుధ్యాలను సమన్వయం చేసి చేనేత కార్మికుల జీవనోపాధులు పెంపొందించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. చేనేత పరిశ్రమ తాలూకు చరిత్రను ఈ పుస్తకం ద్వారా తెలియజేశారు.