అక్షరాలోచన

వెయ్యి కోట్ల వెర్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మా సచివాలయమా
అధికారుల నిలయమా
వాస్తవమో కాదో తెలియని
వాస్తే నీకు శాపమైంది
మార్పులతో చేర్పులతో
దిష్టిబొమ్మ రూపమొచ్చింది
పదవి దక్కగానే
పండితోత్తములు చెప్పారని
గోడలు కూల్చకుండా
ద్వారాలు మార్చకుండా
అధికార పీఠమెక్కిన
అమాత్యులెవరమ్మా!
అధికారం చేజారకుండా
తరతరాలు తమ వద్దే ఉండాలని
పూజలు యజ్ఞయాగాలు
స్వామీజీలకు బాబాలకు
సాష్టాంగ ప్రణామాలు చేయని
ముఖ్య నాయకులెవరమ్మా!
ప్రజాస్వామ్య యుగంలో
రాచరికం మోజులు
కారణజన్ములమనే భ్రమలు
ఊరుకోనీయని కీర్తికాంక్షతో
ఉరుకులాట పనులు
చంపాలనుకున్న కుక్కకు
పిచ్చిముద్ర వేసినట్లు
పదవీ గండం భయంతో
భూత్‌బంగ్లా చేస్తున్నారు నిన్ను
నిజామును పొగిడి తుగ్లక్‌తో పోటీ పడి
నిక్షేపంగా ఉన్న నీ అధికార కేంద్రాన్ని
‘బైసన్ పోలో’ బాట పట్టించడం
ప్రజాధనంతో పాచికలాడడం.

వేముల ప్రభాకర్ 9533120533