అక్షర

రాళ్లపల్లి సంగీత సాహిత్య పరిమళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాళ్లపల్లి సాహిత్య, సంగీత వ్యాసాలు
-రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ
వెల: రూ.200
పేజీలు: 368
ప్రతులకు: ఎమెస్కో ప్రచురణలు

** ** ** ** ** **

రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు తొలితరం విమర్శకులలో సుప్రసిద్ధులు. సంగీత, సాహిత్యాలలో సమ విద్వత్తు కలిగిన అతి కొద్దిమందిలో ఒకరు. అయితే ఇంతవరకు పుస్తక రూపంలో రాని ఆయన సాహిత్య సంగీత వ్యాసాలన్నింటిని సేకరించి, పుస్తకంగా తీసుకురావడం అభినందనీయం.
వాల్మీకి అసాధారణ ప్రతిభకు కావ్యరచన యందును, గాన రచన యందును ఆనందానుభవము ఒకే విధమైనది. రెండింటిని పరస్పరోపకారముగా, సమానముగా అది నిర్వహించిందని చెబుతారు. ఆంధ్ర మహాభారతములోని మూడు పర్వాలను నన్నయ రాయలేదనీ, రాజరాజ నరేంద్రుడే రాశాడన్న డా.చిలుకూరి నారాయణ రావుగారు లేవనెత్తిన వాదాన్ని రాళ్లపల్లి వారు శాస్ర్తియంగా, తర్కబద్ధంగా ఖండించారు. ఎర్రన ‘నృసింహ పురాణ పాఠశోధన’ వ్యాసంలో నృసింహ పురాణం ప్రథమాశ్వాసంలోని 35 పద్య గద్యాలకు పాఠాంతరాలు సూచించారు. పాఠాంతరాల్ని సూచించేటప్పుడు కవి చిత్తవృత్తిని అవగాహన చేసుకోవాలనీ, కావ్య సంప్రదాయాల్ని అనుసరించాలనీ, అర్ధౌచిత్రాన్ని గమనించాలని రాళ్లపల్లి వారు సూచిస్తారు. ఎర్రన కవిత్వంలో పాత్ర చిత్రణా సుభగత్వం, రసపోషణ, ఔచిత్య నిర్వహణ, శైలీ రామణీయకాలు పుష్కలంగా వున్నాయనీ, సోమన కవితలో అనావశ్యకత అలంకారాల పేర్పు, సమాసాల కూర్పు, భావార్థాల నిగూఢత నిండి వున్నాయని చెబుతూ ‘ఆంధ్ర వాఙ్మయమున నాచన సోమనాథుని కీయదగిన స్థానము’ ఏవో విపులంగా చర్చించడం ఆకట్టుకుంటుంది. ‘రాయలనాటి తెలుగు సాహిత్యం’లో రాళ్లపల్లి వారు ఆ కాలంనాటి రాజకీయ, సాంఘిక, ధార్మిక, సాంస్కృతిక నేపథ్యంలో సృజింపబడ్డ తెలుగు కవిత్వాన్ని సునిశితంగా విశే్లషించారు. అప్మావజల వారి ‘తెలుగు మఱుగులు’ అన్న పాఠ పరిష్కరణ విధానాన్ని ప్రశంసిస్తూ, రాళ్లపల్లి వారు ప్రాచీన తెలుగు కావ్యాల పాఠ పరిష్కరణ చేసేటప్పుడు భాషా స్వరూపము, కవి ప్రయోగ విశేషము, కవి హృదయము, ప్రకరణ మందలి సందర్భ శుద్ధి మొదలగు వానిని గమనించి చక్కబరచారని సూచిస్తారు. వారి ప్రేరణతో రాళ్లపల్లి వారు నన్నయగారి భారత ప్రయోగములను ముద్రిత పాఠములో వున్న పొరపాట్లను సవరింపగా, వాటిని విమర్శించే వారిని ఖండిస్తూ రాసిన వ్యాసం కూడా ఇందులో వున్నది. నిడదవోలు వేంకట రామారావు గారు రాసిన ‘ననె్నచోడ కవి శైవ సంప్రదాయము’లో రాళ్లపల్లి వారిని రెండుమార్లు విమర్శింపగా, వాటిని ఖండిస్తూ తన వాదాన్ని వినిపించే వ్యాసాన్ని కూడా ఇందులో చేర్చారు. ఉజ్జ్వలమై, సర్వంకుషమైన ప్రతిభ, అసాధారణమైన తర్క కౌశలం, ఎదుటి వారిని నోరు మూయించే వాగ్మత, వశీకరించే హాస్య చాతుర్యం, గంభీరమైన రసభావానుభవ శక్తి - ఇవి ‘కట్టమంచి వారి వైలక్షణ్యం’ అని తెలియజేస్తారు. తాళ్లపాక అన్నమాచార్యోత్సవములో అధ్యక్షోపన్యాసం చేస్తూ, అన్నమయ్య సంగీత ప్రచారానికి మొదట సంగీత సభ లేర్పడినవి. అలాగే వారి సాహిత్యాన్ని విమర్శించడానికి సాహిత్య సభలు కూడా ఏర్పాటు చేయవలసిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు. ‘అన్నమాచార్యుల పద కవిత’లో మనలను సంక్రమించి పరవశపరిచే భావజాలం, భాషతీరు, అనుభవాల లోతు, వైవిధ్యం -ఇంకే పదకవి రచనలోనూ కానరాదని స్పష్టీకరించారు. స్ర్తి స్వభావంలోని వైవిధ్యాన్నీ, అందచందాల్ని క్షేత్రయ్య వలె సుకుమారంగా, లోతుగా పరిశీలించి చెప్పిన పద కర్తలు లేరని ఒక వ్యాసంలో, సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గాన ప్రతిభను ఇంకో వ్యాసంలో తెలియజేశారు.
‘కవితా’ రచనకు సంస్కృతాంధ్ర భాషా పాటవం, ఛందో వ్యాకరణ జ్ఞానం, ఔచిత్యం, సారళ్యం నాలుగు అంశాలు ముఖ్యమని తేల్చి చెబుతారు. అప్పకవి కవిత్వం అలంకార ప్రధానమే కాని రసప్రధానం కాదంటే రాళ్లపల్లి వారు అలంకారాలు రసపోషణకు దోహదం చేయాలే కాని, ఆధిపత్యం చేయకూడదంటారు. అప్పకవి కవిత్వానికి జీవకళ అయిన ధ్వనిని పట్టించుకోక పోవటాన్ని నిరసిస్తారు. లాక్షణిక సంప్రదాయాల్ని తుచ తప్పకుండా అనుకరిస్తే కవులు భావనా బలం, స్వతంత్రతను కోల్పోతారని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చుతారు. రాళ్లపల్లి వారు ‘నా గురువులు’ అనే వ్యాసంలో తమకు సాహిత్య సంగీత పాఠాలు నేర్పిన గురువుల్ని ఎంతో భక్తిశ్రద్ధలతో స్మరించుకున్నారు. మూసలో ఇరుక్కుపోయిన నాటక రంగానికి ప్రేక్షకులు దూరమయ్యారనీ, అదే వినోదాన్ని అందించే సినిమాల వైపు ఆకర్షితులయ్యారనీ, నాటక రంగంలో పని చేసినవారే సినిమాలలోకి ప్రవేశించి, దానిని కూడా భ్రష్టు పట్టించే అవకాశమున్నదని అభిప్రాయపడినారు. ఇదంతా వ్యాపార పోటీ తప్ప కళోద్ధరణకు తావులేదని అంటారు. వెయ్యేండ్ల తెలుగు సాహిత్య చరిత్రను కన్నడ పాఠకుల కోసం, కన్నడంలో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం ఉంది. ఇందులో ఆదికవి నుండి ఆంగ్ల సాహిత్య ప్రభావం వరకు తెలుగు సాహిత్యంలో వచ్చిన మార్పులను, దానికి కారణాలను క్లుప్తంగా, ఆసక్తిగా తెలియజేశారు. మరొక కన్నడ అనువాద వ్యాంలో ఆధునికాంధ్ర సాహిత్యంలో వస్తున్న మార్పులపై రాళ్లపల్లి వారి నిరసనను, అసంతృప్తిని గమనించవచ్చు. అలాగే ‘కన్నడ జానపద సాహిత్యం’పై తెలుగులో రాసిన చిన్న వ్యాసం ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
సంగీతానికి సంబంధించిన వ్యాసాలలో రాళ్లపల్లి వారు సంగీతపు మూలాల్ని అనే్వషిస్తూ, నాలుగు రకాల సంగీత వాయిద్యాల గురించి వివరిస్తూ, సంగీతానికి ఆంధ్రులు చేసిన సేవను, కృషిని తెలియజేశారు. ‘సంగీత సాహిత్యాల అక్షర రమ్యత’ వ్యాసంలో సంగీతానికి రమ్యాక్షరాలు శ్రావ్యతను, సౌకుమార్యాన్ని సంతరించి పెడతాయని చెబుతారు. హిందుస్తానీ సంగీతం శ్రోత రంజకమైతే, కర్ణాటక సంగీతం చిత్తరంజక మంటారు. హిందుస్తానీ సంగీతంలో కనబడినంత ప్రయోగశీలత కర్ణాటక సంగీతంలో కనబడదంటారు. అలాగని కర్ణాటక సంగీతంలో హిందుస్తానీ రాగాల్ని వాడటం, చమక్కులు ప్రదర్శించడం మంచిది కాదని రాళ్లపల్లి వారు ‘కర్ణాటక గానశైలి పవిత్రత’ను కాపాడమంటారు. ‘ఆంధ్ర గాయక జనసభ’ వ్యాసంలో, మనలో నానాటికీ తగ్గిపోతున్న సంగీత ప్రేమ పట్ల నిర్వేదం ప్రకటిస్తారు. తమిళ గాయకులు కొందరు కచేరీలలో తమిళ కీర్తనలకే ప్రాధాన్యమివ్వాలనీ, తెలుగు కీర్తనల్ని పాడకూడదని చేసుకున్న నిర్ణయాల్ని ఖండిస్తూ ‘స్వభాషాభిమానమునకు సంగీతముతో ఏమి గొడవ’ అనే వ్యాసం రాశారు. వైణిక శిఖామణి శేషణ్ణగారు సుకుమారమైన వాదనకు పేరు మోస్తే, బిడారం కృష్ణప్పగారి గాత్రణ గురు గాంభీర్యానికి వాసికెక్కిందనీ, వీరిద్దరి బాణీలు అనుకరణ సాధ్యాలు కావని ‘నిన్నటి సంగీతం - ఇరువురు సంగీత కోవిదులు’లో తెలియజేస్తారు. సంగీత సాహిత్యాలకు సంబంధించిన విషయాలపై రాళ్లపల్లి వారు తమ అభిప్రాయాల్ని స్పష్టంగా, నిర్భయంగా, నిస్సంకోచంగా తెలియజేసిన తీరు పాఠకులను ఆలోచింపజేస్తుంది.

-కె.పి.అశోక్‌కుమార్