అక్షర

సమస్యల(తో)రణం (పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్యల(తో)రణం
-బచ్చు రాంబాబు
ప్రతులకు: రచయిత
ఇం.నెం.203, బ్లాక్-3 ప్రజయ్ సిటీ అపార్ట్‌మెంట్స్
మియాపూర్, హైదరాబాద్-49 8977312510

*** *****

ఆకాశవాణి, దూరదర్శన్‌లు నిన్న మొన్నటిదాకా సమస్యాపూరణ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించాయి. ఔత్సాహికులైన పద్య రచయితలూ, రచయిత్రులూ అమితోత్సాహంతో అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. అలా పాల్గొన్నవారు తమ తమ పూరణ పద్యాలను చాలామంది పుస్తకాలుగా ప్రచురించి పద్య ప్రియులకు విందులు చేశారు. కాసింత ఆలస్యంగా ఇప్పుడు రాంబాబుగారు కూడా వారి సరసన చేరుతున్నారు.
వర్ణనలు, దత్తపదాలు, సమస్యలకు అప్పట్లో తాను చేసిన పూరణ పద్యాలలో కొన్నింటిని ఎంపిక చేసి ఇలా అందిస్తున్నారు. ఇవి చాలా గొప్ప పద్యాలు అని కాదు గానీ, అపురూపమైన మన పద్యప్రక్రియకు తానూ ఒక తులసీదళం వేశానన్న సంతృప్తి చెదిరిపోకుండా చూసుకునే బులబాటమిది. అవధాన విద్యలో సమస్యా పూరణము దత్తపది, వర్ణన అనునవి ముఖ్యమైనవి. ఈ మూడింటిని ఆకాశవాణివారు, పత్రికల వారు, దూరదర్శన్ వారు నిర్వహించుట కద్దు. ఆయా సందర్భాలలో పై సంస్థలు ఇచ్చిన సమస్యలకు అర్థవంతముగా పూరించిన బచ్చు రాంబాబుగారు వాటన్నింటిని ఒకచోట చేర్చి అందించారు. సమస్యాపూరణమునకు సమయస్ఫూర్తి కావలసి ఉంటుంది. సమస్యలను సమర్థవంతంగా పూరించుటతో పాటు భాష భావము చక్కగా కుదురుకున్నచో ఆ పూరణము రసవంతంగా ఉంటుంది.