అక్షర

నక్షత్ర జల్లులు.. పన్నీటి చినుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నక్షత్ర జల్లులు’
-తక్కెడశిల జాని బాషా చరణ్
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో

** **** ****

పద్యమంటే పరవశించని తెలుగు వారుండరంటే అతిశయోక్తి కాదు. తేట తెనుగు పద్యాలను ఆస్వాదించని ఆంధ్రులుండరు. సాధారణంగా పద్యాలను ఛందోబద్దంగా నియమానుసారం రాస్తారు. కానీ ఏ విధమైన ఛందస్సు లేకుండా నాలుగు చిన్న పాదాలలో అమితమైన అర్థాలను నీతిని ఇమిడ్చి తక్కెడశిల జాని బాషా చరణ్ రాసిన ఈ ‘నక్షత్ర జల్లులు’ నిజంగా పన్నీటి జల్లుల్లా ఉన్నాయి. ఛందస్సు లేకుండా చక్కని పదాలతో మెరిసి కురిసిన పన్నీటి చినుకులు.. ఈ నక్షత్ర జల్లులు.
‘నక్షత్ర జల్లులు’ పదబంధ సొబగులతో భావ శరాలను సంధించిన అమృతపు గుళికలతో కనువిందు చేస్తోంది.
తామసిన్ త్రోలు చిరాగ్ని నుండ నగ్నిపర్వతమేల?
కన్ను నలుసున్ దీయ చినుకుండ సాగరమేల?
ఆడంబరముసేయు కార్యము దుష్ఫలితమిచ్చు గదా
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా!!
చీకటిగా ఉన్న ప్రదేశంలో చిరు అగ్ని వెలుగిస్తుంది. అగ్నిపర్వతం అవసరం లేదు. అలాగే కంటిలోని నలుసును తీయడానికి చుక్కనీరు చాలు. సముద్రంలో ఉన్న నీరంతా అవసరం లేదంటూ చెబుతూ.. ఏదైనా చిన్న విషయాన్ని కొండంతలుగా చేసి తాను భయపడి ఇతరులను భయపెట్టరాదనే సందేశం చక్కగా ప్రస్ఫుటితవౌతోంది..!
నిజమే కదా కొంతమంది గోరంతలు కొండంతలు చేసుకుని బాధ పడుతుంటారు. అది అనవసరమేగా!
మరొక పన్నీటి చినుకు-
నీచుని నీడన బ్రతుకుటకన్న మిన్నాగు పడగ నీడ మేలున్
నీచుడు క్షణక్షణమున్ హాని చేయున్
నాగు నొక్క కాటుకున్ చంపెన్ కదా
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా!!
నీచుడి నీడ కంటే పాము నీడలో బ్రతకడం మంచిదని, నీచుడు అనుక్షణం నరకాన్ని చూపిస్తాడని, పాము ఒకేసారి కాటు వేస్తుందని అర్థం. అందుకే నీచుల సావాసం పనికిరాదని పాము విషం కంటే భయంకరమైనదని చెప్పడం జరిగింది. మనకు కవి అంతరార్థంలో వేమన తొంగి చూస్తున్నట్లనిపిస్తుంది.
మరొక నక్షత్ర జల్లులో-
పరమ శివుడినే ప్రశ్నిస్తున్నాడు కవి..
త్రినేత్ర ధారివి త్రిశూల ధారివి నీవే గదా
త్రిలోకాధిపతివి నీవే గదా నెన్నున్నా
నమ్మ ప్రేమను నోచుకోలేదు గదా ఓ ఖట్వాంగీ
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా!!
మూడు కన్నులు కలవాడివి, త్రిశూలమును ధరించిన వాడివి, ముల్లోకాలకు అధిపతి నీవే గదా.. ఎన్ని ఉన్న అమ్మ ప్రేమకు నోచుకోలేదు కదా ఓ ఖట్వాంగీ.. ఓ శివుడా! ఇందులో కవి అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటుతున్నాడు.
ఇంకొక పన్నీటి జల్లు-
వెర్రి వేపి జోలికిన్! సూక్తికిన్ సూక్తి నిచ్చు
గృహమేధి జోలికిన్!! జేతుల్ కాచకన్ బట్టిన..!
పిత్తవ్యాధు జోలికిన్ నెల్లుట నపాయము గదా
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా!!
పిచ్చి కుక్క జోలికి, మాటకు మాట ఎదిరించే ఇల్లాలి జోలికి, చేతిలో రాయి పట్టి ఉన్న పిచ్చివాడి జోలికి వెళ్లిన అపాయము సుమా..!
ఇది సుమతీ శతక పద్యాలను గుర్తు చేస్తున్నది. కవి భావనలో ఒక హెచ్చరిక ఒక విన్నపం కనపడుతుంది.
మరొక నక్షత్ర జల్లు-
గుణము నేని బలమ్! అన్విక్ష నేని గార్యము
తర్ఫీదు నేని మనోనిశ్చయము! కూర్మి నేని బంధమ్
నుండనేల! నుండినా! నిరర్థకము గదే
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా!
బుద్ధిలేని బలము, ఆలోచన లేకుండా చేసే పని, సాధన లేని సంకల్పం, ఉండినా నిరుపయోగం కదా. నిజమే కదా. ఇందులో కవి అంతరంగంలో నిక్షిప్తమైన దృఢ సంకల్పము, స్థిరత్వం మనకు గోచరవౌతున్నది.
కవి ఈ నక్షత్ర జల్లులలో తన ప్రేయసి నుద్దేశిస్తూ కురిపించిన పన్నీటి జల్లు-
ఖజాకములు ఇరేండైన రేచకము నొక్కటైనుండున్ సుమీ
అంతరింద్రియము దొందైన హృధ్వని ఏకమే అఖిలనేత్రి
భాషికల కిలకిలల సుప్రభాతముతో ఉల్లము నిండియున్నది
నన్ పుట్టించినమ్మకు నర్పితమ్ సుమా!!
దేహాలు రెండు అయినా... ఊపిరి ఒక్కటే. మనసులు రెండు అయినా, గుండె చప్పుడు ఒక్కటే. నీ ప్రియ పలుకులతో నా మనసు నిండి ఉన్నది. ప్రతి క్షణం ఎదురుచూస్తున్న నీ కోసమే ఓ అఖిలాశ.. అంటూ కవి భావోద్వేగాన్ని అద్భుతమైన భావజాలంతో ఉదహరించాడు.
ఆద్యంతము కవి అంతరంగం, భావోద్వేగం, పదాల పొందిక, భావజాలం మనల్ని అబ్బురపరుస్తాయి.

-హంసగీతి