అక్షర

రసభావ కథారసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలచాలనమ్ (కథల సంపుటి)
-బుర్రా లక్ష్మీనారాయణ
వెల: రూ.100 పేజీలు: 176
ప్రతులకు: పాలపిట్ట బుక్స్

*** *** *****

వ్యక్తివాదం, ఆదర్శవాదం, సృజనాత్మక కల్పన, వ్యక్తిగత ప్రకృతి అవలోకన, అనుభూతి ప్రాధాన్యం, ప్రతీక చిత్రాల వాడకం - ఇవన్నీ ‘రొమాంటిసిజమ్’ లక్షణాలు. ఈ లక్షణాలతో వచ్చిన రొమాంటిక్ పొయిట్రీని మొదట తెలుగులో ‘కాల్పనిక కవిత్వం’గా వ్యవహరించినా, తర్వాతి కాలంలో ‘్భవ కవిత్వం’ పేరిట స్థిరపడిపోయింది. కవిత్వంలో తప్పించి, రొమాంటిసిజం లక్షణాలతో వచ్చిన వచన రచనలను వేళ్ల మీద లెక్కపెట్టుకోవాల్సిందే. ఒక్క అడవి బాపిరాజు ఇందుకు మినహాయింపు. మళ్లీ ఇన్నాళ్లకి ఆ లక్షణాలతో వచ్చిన కొత్త కథాసంపుటి బుర్రా లక్ష్మీనారాయణ గారి ‘కలచాలనమ్’.
ప్రణయారాధన, పారవశ్యం, విరహం, వియోగం లాంటి అనుభూతులను ప్రకృతి నేపథ్యంలో వైవిధ్యభరితంగా చిత్రించిన కథలు ఈ సంపుటిలో సగ భాగాన్ని ఆక్రమించుకున్నాయి. అందమైన కళ్లు వున్న అమ్మాయిలంటే కొందరికి చాలా ఇష్టం. బాపులాంటి చిత్రకారుడికి మరీనూ. వెతికి వెతికి పెద్దపెద్ద కళ్లు వున్న అమ్మాయిలను తెచ్చి హీరోయిన్లుగా చేస్తాడు. అందమైన కళ్లను కవులు సొగకళ్లని, పెద్దపెద్ద కళ్లని కవిత్వం రాసుకుంటారు. ‘కుంతల’ కథలో నాయకుడు కూడా అందమైన కళ్లు వున్న అమ్మాయి మోహంలో పడిపోతాడు. అతను రైలు ప్రయాణంలో కలిసిన అమ్మాయి పరిచయం, ఆమె కళ్లను మరచిపోలేక పోతాడు. హీరో చివరకు ఆమె తను ఎంపిక చేసుకోవాల్సిన పెళ్లికూతురని మిత్రుడి పెళ్లిలో తెలుసుకోవడం అంతా విచిత్రంగా, సుఖాంతంగా జరిగిపోతుంది. ఇంకో కథలో పల్లెగానం.. ప్రమదగానం.. ప్రమోదంగా మనసునూ తద్వారా శరీరాన్ని పులకించిపోయేలా, పునీతమయే లాంటి హృద్యమైన భావం రచయితను వివశుడ్ని చేస్తుంది. ఎవరో తెలియని ఒక లంబాడీ యువతి గానానికి పరవశుడైన విధానం ఇందులో కనిపిస్తుంది. ‘పరాగం’ కథలో వేశ్యావాడను సంస్కరించడానికి వచ్చిన సామాజిక సేవా కార్యకర్తలకు తోడుగా రవి అనే ఉద్యోగి కూడా కలుస్తాడు. అతడెంతో అభిమానించే ప్రీతి, వేశ్య కూతురని తెలియడంతో ఉలిక్కిపడి దూరంగా జరుగుతాడు. రవికి ట్రాన్స్‌ఫర్ అయి వెళ్లిపోతుంటే ప్రతి రైల్వేస్టేషన్‌కు వెళ్లడం, దాని వేగానికి ఆమె ప్లాట్‌ఫాం మీద పడిపోవడం కనిపిస్తుంది. అందులో ప్రీతికి తను నివసిస్తున్న పరిసరాల స్పృహ లేకపోవడం, రవికి, ప్రీతికి మధ్య వున్న ప్రేమను పరోక్షంగా చెప్పుకోవడం ఆకట్టుకుంటుంది. ఇది జరిగిన చాలాకాలానికి రవిని వెతుక్కుంటూ వెళ్లిన ఆమెకు, గయలో తనకు పిండ ప్రధానం చేస్తున్న రవిని చూస్తుంది. అంటే రవి దృష్టిలో తాను మరణించానని తెలుసుకున్న తర్వాత అతనిని కలవకుండా తిరిగి వచ్చేస్తుంది. బహుశా ఇంకెప్పుడూ కలవకపోవచ్చు. ‘రేవులో.. నా’ కథలో లెక్చరర్‌గా పనిచేస్తూ అవివాహితగా మిగిలిపోయిన సువర్చల కాలేజీ రోజుల్లో మూగగా ఆరాధించిన వ్యక్తిని, తన 56వ ఏట కలుసుకుని తన మనసంతా విప్పి చెబుతుంది. వాళ్లిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటి కావడంతో వాళ్లు పెళ్లి చేసుకుంటారు. ఇద్దరూ కలిసి అతడి రెండవ అమ్మాయి దగ్గరకు ప్రయాణమవుతుండగా కథ ముగుస్తుంది. ‘రాగలీల’.. లీల అంటే ప్రవాహం. లీల అంటే మానవత్వం. మనిషితనం కలబోసుకున్న కారుణ్యం, బీద బాలుడైన చందూ పురోగమనానికి దోహదం చేసిన వ్యక్తి. చందూ బాల్య చాపల్యాన్ని సమూలంగా దగ్ధం చేసిన దయామూర్తి. స్ర్తి అంటే తెలిపిన సముద్రం. వేగంగా ప్రవహించడమే కాదు, మంద గమనంతో ఆడుతూ పాడుతూ కనిపించే లీల వౌనంగా తెరమరుగై పోవడం విషాదం. ‘అద్దంలో కలీమనె’ కథలో రచయిత, సింహాచలం కొండ మీద చూసిన గిరిజన పెళ్లికొడుకు - పెళ్లికూతురు వారి ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి ముగ్ధుడై ఫొటో తీసి ఇస్తాడు. వాళ్లిద్దరిలోగల స్వచ్ఛత, వన దేవతల్లా వాళ్లవాళ్ల పరిధుల్లో వెల్లివిరిసిన ఆనందం అతడ్ని ఆకట్టుకున్నాయని మిత్రులతో చెబుతుంటే విన్న నడివయసు వ్యక్తి అది తనేననీ తన భార్యను, అప్పుడు ఇచ్చిన ఫొటోను ఎంత భద్రంగా చూసుకుంటున్నాడో చూపిస్తాడు. కొసమెరుపు ఏమిటంటే వీళ్లను తీసుకువచ్చిన డ్రైవర్ సూర్యుడు ఆ దంపతుల మనవడేనని తెలియడం. ఎనె్నన్ని మలుపులో జీవితంలో.. అసంభవం అనుకున్న విషయాలు అన్నీ మన ముందు ఎవరో ఏర్పాటు చేసినట్టు.. అంతా అద్భుతంగా, ఆశ్చర్యంగా ఉంటుందంటాడు. మనమూ అతనితో ఏకీభవిస్తాం.
వస్తువు లేనిదే కథ ఉండదని మనం అనుకుంటాము. కాని ఒక సంఘటనను, ఒక జ్ఞాపకాన్ని, ఒక ఊహను కవితాత్మకంగా వివరిస్తూ దాన్ని కథను చేసిన విధానం ఆశ్చర్యపరుస్తుంది. బుద్ధికీ మెదడుకన్నా హృదయానికే ప్రాముఖ్యత నివ్వడం ఈ కథలలో కనిపిస్తుంది. ఇవన్నీ రొమాంసిజం లక్షణాలు. ప్రేమ.. ప్రియురాలి కోసం పడే వేదన.. విరహం.. వియోగం అన్నీ కలిసి ప్రియుడి స్వగతంలా అనేకానేక వర్ణనలతో ఉపమానాలతో కొనసాగడం ‘కినె్నర మీటని రాగవీణ’లో చూడవచ్చు. ప్రణయారాధన... విరహం.. ఎదురుచూపులను లేఖాపద్ధతిలో వివరించిన ‘విశ్వమోహన పలికే’ కథ లేఖా పద్ధతిలో వుండి ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథా కథనాలతో రూపొందిన వీటిని చదవడమే గొప్ప అనుభూతి. ఈ కథలన్నింటినీ యధాలాఫంగా చదువుకుంటూ పోతే కథ అంతస్సూత్రాన్ని పట్టుకోలేరు. అందుకని ఈ కథలను జాగ్రత్తగా చదివితే తప్ప మనకు అర్థంకావు.

-కె.పి.అశోక్‌కుమార్