అక్షర

భావాకాశంలో స్వేచ్ఛగా విహరించే రెక్కల గుర్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనెక్కిన రెక్కల గుర్రం
కవిత్వం
-వి.యస్.పి.తెనే్నటి
ప్రతులకు: అన్ని
ప్రముఖ పుస్తక
కేంద్రాలలో

పరిపూర్ణమైన జీవితం కావాలని కోరుకోవడమే ఎంతో గొప్ప ఆదర్శం. ఈ ఆదర్శంకోసం ప్రయత్నం చేయడమే విజ్ఞుల పని. అందులో కవితాత్మగల మనిషి కవియై, మనుషులకోసమే కవిత్వం వ్రాస్తే ఇక అసంపూర్ణమెట్లా అవుతుంది. కాదు. కవి మనస్సు అంతర పేటికలో మానవత్వమనే భావన ఉంటే అది తప్పకుండా క్రియారూపంలో ఎక్కడో ఓ దగ్గర బహిర్గతవౌతూనే ఉంటుంది. వి.యస్.పి.తెనే్నటిగారి హృదయ పేటికనిండా అనేక భావాలుగల మాటల మూటలు ఒక క్రమపద్ధతిలో పేర్చబడినట్టు ఆయన వ్రాసిన ‘నేనెక్కిన రెక్కలగుర్రం’ కవిత్వ సంపుటిని చదివితే తెలుస్తుంది. కుప్పలుతెప్పలుగా పదాలు చుక్కల్లా మెరుస్తూనే, కవిత్వ భావం చంద్రజ్యోత్న్సలా వెలుగునిస్తుంది. ఒకటారెండాని యాభై ఏడు కవితల్లో తమ కళ్ళకు కనిపించిన అన్యాయాల్ని ఎడాపెడా కడిగేయడమే పనిగా వ్రాసి పాఠకులను ఆలోచనల్లో పడేస్తారు. ఇదేకదా కవి చేయాల్సింది! పురాణ ప్రతీకలైతేనేమి, పౌరాణిక గాథల నెత్తుకోవడమైతేనేమి, నేటి అత్యంత ఆధునిక విషయాల స్పర్శ ఐతేనేమి! ఒక్కటేమిటి, అన్నీ గుండెకు సూటిగా తగిలేలా వ్రాశారు. ‘రాదారి’ అనే కవితలో
‘అన్నిటికన్నా సులభం ఆశపడటం
అన్నిటికన్నా కఠినం ఆశయ సాధనం
అపజయానికి దారులు శతకోటి
విజయ శిఖరానికి రాదారి ఒక్కటే!’ అని తమ అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పగలిగిన ఈ కవి ఎత్తుకోని అంశం లేదు. ఈ కవి కవిత్వాన్ని 1) స్ర్తి సమాజ శ్రేయోభిలాషిగా 2) సాంఘిక దురాచారాలను ఖండించే కవిగా 3) ఆధునికత ముసుగులో ఉన్న అన్యాయాల్ని ఎదిరించే సాహస కవిగా 4) రాజకీయ అరాచకత్వాన్ని నిరసించే కవిగా 5) తెలుగు భాషాభిమానిగా వింగడించవచ్చు. బంధాలు, అనుబంధాలు, బాల్య అనుభవాలు, సున్నిత విషయాలు, వన పవనాల అన్నీ వ్రాశారు.
తమ చుట్టూఉన్న సమాజాన్ని ప్రతిబింబించడం కవి ఉద్దేశ్యం ఉన్నప్పుడు ఘఇఒఆ్ఘషఆ ఔళషళఔఆజ్యశ తో వ్రాస్తున్నప్పుడు కవి ఔషధ ప్రాయమైన కవిత్వాన్ని వ్రాస్తాడు. జబ్బులు నయంగావడానికి కషాయం వాడినట్లు, తియ్యని మందులు రోగాల్ని పోగినట్లు వైరుధ్యాన్ని ప్రదర్శిస్తూ స్థూల సత్యానే్న తర్కబద్ధంగా పాఠకులకు అందిస్తాడు. ఈ పుస్తకంలో తెనే్నటిగారు అదే చేశారు. సాధారణంగా ఉద్రేకం, ఆవేశం ఉన్న కవిత్వం లయత్మాక పద కవిత్వంకోసం వేచి చూడదు. ‘-్యళఆక జఒ శ్యఆ ఘ దజదళూ రీజశజూ యఛి ళ్ఘఒ్యశ, జఆ జఒ ఆ్దళ చిజూఒఆ ఘూజూళ యఛి పళూఇ్ఘజచీళజూ ళనఔళూజళశషళ ఔజ్యూ ఆ్య యజష, ఔజ్యూ ఆ్య య్ఘూౄజఆక’’ అని కవిత్వతత్వ విఛారణలో కట్టమంచి వారిచ్చిన ఉదాహరణను ఇక్కడ అన్వయిస్తే, కళ్ళముందు జరుగుతున్న అన్యాయాల్ని, మానవ వికారతత్వాన్ని చూస్తూ నిజమైన కవి ఎట్లా ఊరుకుంటాడు? రామణీయతకోసమో, శిల్పచాతుర్యంకోసం చూడడు. తన కలాన్ని కత్తిగాచేస్తాడు ఆ ముక్కలకు కొలతలు, వైశాల్యాలు చూడడు. ఆవేశం, ఆర్తి, బాధ, కోపం, కసి అనేవి తప్పుల్ని కప్పిచెప్పడానికి వాడడు. సమాజ లోపాలను బట్టబయలుచేస్తాడు. తెనే్నటిగారు ‘అమ్మతోడు’అనే కవితలో-
‘‘అద్దె డబ్బులు ఇచ్చి రమ్మని అమ్మ మేడమీదికి పంపినప్పుడు
పడక కుర్చీలో రెక్కలు టపటపలాడించిన రాబందు
శెట్టికొట్లో అర కిలో చింతపండు కొంటున్నప్పుడు
జబ్బనొక్కి ఉబ్బితబ్బిబ్బైన వృద్ధ జంబూకం’’ అని వ్రాసి, ఒక్కసారిగా ఒళ్ళు జలదరింపజేస్తారు. అమ్మో అమ్మాయిలపై కనబడకుండా జరిగే అత్యాచారాలు ఇట్లాకూడానా అని ఆశ్చర్యంలో పడేస్తారు. రాబందు, వృద్ధజంబూకం వంటి ఉపమానాలు అద్దె డబ్బు అర కిలో చింతపండు వంటి స్థాయి భేదాలను, చూపడం గొప్పగా ఉంది. భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు చెప్తూ ఒక కాషన్ ఇస్తూ ‘‘పురుషజాతి యావత్తూ దీనంగా యాచిస్తూ/ అమ్మా నీ దయ తల్లీ కరుణించమని శోకిస్తూ విలవిలలాడే రోజొకటి వస్తుంది’’ అనీ అంటారు. అట్లా స్ర్తిలను హింసించే పురుష జాతిని ‘‘సంహార దేవతనేనై, సర్వంతర్యామినినేనై/ బడబానలమై జ్వలిస్తూ, తపిస్తా, తరిస్తా/ హోళికనై కాళికనై అణువణువున జనిస్తా’’ అంటూ అపర కాళికలా మనుషుల్లోని జుగుప్సాకర మానవ నైచ్యాన్ని ఖండించాలని చెప్తారు. పురుషాధిక్యాన్ని అస్సలు ప్రోత్సహించక, సమన్యాయం ఆశిస్తూ వైవాహిక జీవితంలో స్ర్తిలుపడే వేదనలను అర్ధంచేయిస్తూ వ్రాశారు. అసభ్యమైన కామప్రవృత్తిని కాదనడం, ప్రేమ పేరుతో చేసే మోసాలను ఎత్తిచూపడం వీరి కవితల్లో గమనిస్తాం.
‘‘నేనెక్కిన రెక్కల గుర్రం’’ అనే పతాక శీర్షిక కవితలో ‘‘జనన మరణాల మధ్య దూరాలను కొలిచే ఆసక్తిలేదు/ పాప పుణ్యాల వ్యత్యాసాల్ని గ్రహించే విచక్షణా లేదు/ అనడమైనా, ‘‘దశ దిశలకు వ్యాపించు’’ కవితలో నీరసిస్తే అవరోహణం, సాహసిస్తే ఆరోహణం/జీవితం కర్మాపకర్మల ధర్మకారణం’’ అనడంలోనైనా ఆధునిక ముసుగులో ఉన్న అన్యాయాల్ని ఖండించే కవిత్వంగా చెప్పవచ్చు.
ఈ పుస్తకానికి ముందుమాట వ్రాస్తూ సి.నా.రెగారు ‘‘సంపుటి పేరులోనే కవితాత్మకత ఉంది అనడమైనా, మాడుగుల నాగఫణిశర్మగారు ‘‘తెనే్నటి వంశ శశికవి/ఎక్కడ- నీవెక్క గుర్రమిదియని- అని- లేవనె్నల కవితలతలతో అన్న కవితా అంటూ ఆధునిక సమాజాన్ని బూళుకితం చేస్తున్నందుకు అభినందిస్తూన్నాననడమైన ఈ పుస్తకానికి సరిపోయింది.
తెనే్నటిగారి కవితావాహిని కొన్నిచోట్ల పీఠభూమి నాక్రమించినట్లు వచనంలా సాగడంతో కవిత్వ శిల్పానికి దూరవౌవుతూ ఉన్నా, భావాంబుధిలో కలవబోయేముందు తరంగాల వంటి పంక్తులతో కొండలనూ ఢీకొన్నది. తెలుగు భాషపై ఉన్న మక్కువతో కవిగా తనకుతాను నిరూపిస్తూ వ్రాసిన పద విన్యాసాలైతేనేమి, పద ప్రయోగాలైతేనేమి అద్భుతంగా ఉన్నది. కొత్త కవులకు గంభీరమైన ఆ పదాల అర్ధాలను వెతికి వెతికి నేర్చుకోవాలని ఆసక్తిని కలిగించే వ్రాశారు. చకాసిత చక్రాంకిత, చరమాద్ర, చక్రదంష్ట్ర జంభనం, చటకారి, చైత్యాలయ ఉపబృంహితమవడం, ప్రత్యాసన్నం, ప్రోహణించి, క్రీణించి, అగజాత, అగ్రయము, శశ్వాదానుడు, మిహిరనుయ్ను, పింగళ పారవశ్య ం, వాసక సజ్జిక, సురజ్యేష్టుడు, పిండీకృతం, కుసంభరాగం, నిణీర్ణత, ప్రలేచి వేణువువంటి పదప్రయోగాలు కొత్త పరిచయంగా చేశారు.
శాసిస్తే జనించదు చైతన్యం/ ఆక్రోశిస్తే వరించదు విజయం’ అని చెప్పిన తెనే్నటిగారు స్వయంకృషి, కృషించేతత్వం, నేర్చుకోవాలన్న ఆరాటం, పై కెదగాలన్న తపన ఉండాలి గాని ఆయాచితంగా అన్నీ రావాలనుకోవద్దు భావితరం అన్నది నిజం. కీట్స్‌నూ స్పృశిస్తూ, కాళిదాసును గుర్తుచేస్తూ నేటి మీడియావరకూ, ఆపరేషన్ స్ప్రింగ్స్, ఆబ్లిగేషన్స్ అన్నీ కవిత్వంలో తడిమారు కాబట్టి అందరూ చదవాల్సిన పుస్తకం.

-కొండపల్లి నీహారిణి