అక్షర

జీవన కావ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవన కావ్యానికి
వ్యాకరణ సూత్రాలు వర్తించవు
ఆరంభం అంతం ఏవీ
మన చేతుల్లో ఒదగవు!

అనుదినమూ అనుక్షణమూ
తీవ్ర ఉత్కంఠే
మలుపేమిటో ఎట్లా వుంటదో
ఊహకందదు!

సందర్భాలూ సంభాషణలూ
అలిఖితాలు
పాత్రలూ అభినయాలూ
వర్ణనాతీతాలు!

కదలని నాగుపాము
ఔటర్ రింగు రోడ్
పగ ఎందుకు పడుతుందో
కాటెప్పుడేస్తుందో ఎవరికి తెలియదు!

తాడు తెగందీ
బొంగరం ఆగందీ
నూటా ఎనిమిదికి కబురందదు
సైరన్ వినిపించనిదే ఎవరి దృష్టి అటు మల్లదు!

సప్తపదుల
అడుగుల్లో అడుగేసిన మనిషి
పొదుపు ఖాతాపై కనే్నసే వారసులు
వచ్చేది అందాకే..!

కాలాన్ని గమనించకపోతే మిత్రమా
నీ జీవన కావ్యం ముద్రణకు నోచుకోదు!!

- కోట్ల వెంకటేశ్వరరెడ్డి