అక్షర

హృదయాహ్లాదం కలిగించే ‘ప్రేమ వసంతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ వసంతం (నవల)
-శ్రీమతి యలమర్తి అనూరాధ
వెల: రూ.150
ప్రతులకు: రచయిత్రి
క్వార్టర్ నెం.13, బ్యాంక్ కాలనీ, తణుకు ప.గో.జిల్లా

** **** ****

రచయిత్రి చెప్పుకున్నట్లు, ఇది చాన్నాళ్లుగా, అర్ధ నిద్రావస్థలో ఉండి ఈ మధ్యే వెలుగు చూసిన నవల. అందువల్ల కావొచ్చు లేదా ఈనాడు వస్తోన్న నవలా శైలికి భిన్నంగా ఉండాలన్న ఆలోచన వల్ల కావొచ్చు ఈ నవల ఒకనాటి కోడూరి,
యద్ధనపూడి లను గుర్తుకు తెస్తుంది. ఈ నవల్లోని నాయికా నాయకులు - వసంత అనురాగ్‌లు, అందం, మంచితనం, మానవత్వం మూర్త్భీవించిన దంపతులు.

గత నలభై సంవత్సరాలుగా వివిధ పత్రికలలో శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన సాహితీ ప్రక్రియల్ని తెలుగు పాఠకులు ఆదరిస్తూనే ఉన్నారు. ‘ప్రేమ వసంతం’ వారి తొలి నవల. ప్రముఖ సాహితీవేత్త పెద్ద్భిట్ల సుబ్బరామయ్య, సోమేపల్లి వెంకట సుబ్బయ్య లాంటి సాహితీ మహామహుల ప్రశంసలు అందుకొన్న నవల. రచయిత్రి చెప్పుకున్నట్లు, ఇది చాన్నాళ్లుగా, అర్ధ నిద్రావస్థలో ఉండి ఈ మధ్యే వెలుగు చూసిన నవల. అందువల్ల కావొచ్చు లేదా ఈనాడు వస్తోన్న నవలా శైలికి భిన్నంగా ఉండాలన్న ఆలోచన వల్ల కావొచ్చు ఈ నవల ఒకనాటి కోడూరి, యద్ధనపూడి లను గుర్తుకు తెస్తుంది. ఈ నవలలోని నాయికా నాయకులు - వసంత అనురాగ్‌లు, అందం, మంచితనం, మానవత్వం మూర్త్భీవించిన దంపతులు. వారి వివాహాత్పూర్వపు పరిచయంతో నవల మొదలయ్యి, వారిద్దరూ ‘ఆదర్శ జంట’గా ఎన్నుకోబడటంతో ముగుస్తుంది. వసంత తలిదండ్రులు గాంధీ, అరుంధతిలు. సంపన్న కుటుంబీకులు. వారి ఏకైక సంతానం వసంత. అందాల బొమ్మ. సుగుణాల రాశి. ధనం కన్నా మంచితనమే ముఖ్యమని వారు వసంతను సామాన్య కుటుంబీకులైన కరుణానిధి, అమృతవల్లి దంపతుల ప్రథమ సంతానం అనురాగ్‌కు ఇచ్చి వివాహం చేస్తారు.
పెళ్లికి ముందే కాబోయే దంపతులు విరివిగా ఉత్తరాలు రాసుకుంటూ తమ ప్రేమను పరస్పరం తెలుపుకుంటారు. పెళ్లయ్యాక, వసంత ఊళ్లోనే అనురాగ్‌కి స్కూలు జాబ్ వస్తుంది. వేరు కాపురం పెట్టి వసంత అనురాగ్‌లు సీతారాముడిలా అనురాగ దాంపత్యం నెరపుతూ తమ ఇరుగు పొరుగుకు; చివరకు పనిమనిషి ‘మామ్మ’కు కూడా ఆత్మీయులవుతారు. అపూర్వ, ఆకాశ్ అను ఇద్దరు కవల పిల్లలతో జీవితం హాయిగా గడుపుతారు.
నవలలో ఊహించని, మలుపులు, దౌష్ట్యం, దౌర్జన్యం, కృత్రిమ విలనిజం (అంతగా) ఉండదు. సన్నజాజులు, కనకాంబరాలు, మరువం కలిపి అల్లిన కదంబ మాలలా, పున్నమి వెనె్నలలా, ప్రశాంత వాతావరణంలో సాగుతున్న నావలా, మనసుకూ, హృదయానికి ఆహ్లాదం కలిగిస్తూ, సాగిపోయే నవల ఇది.

-కె.సిహెచ్.