అక్షర

యువతకు దిశానిర్దేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్మభూమి;
రచన: ఐతా చంద్రయ్య;
వెల: రూ.140/-
ప్రతులకు- రచయిత; ఇం.నెం.4-4-11,
షేర్‌పురా, సిద్దిపేట మరియు,
నవచేతన బుక్‌హౌజ్
బ్యాంకు స్ట్రీటు, హైదరాబాదు

అనాదినుండీ భారతదేశం ‘కర్మభూమి’గా నమ్మబడుతోంది. వేద వ్యాసుడి కాలంనుండే నిన్నమొన్నటి అబ్దుల్‌కలాం వరకు ఎందరో పుణ్యమూర్తులు ఈ గడ్డపై అవతరించి, తమ మొక్కవోని అకుంఠిత దీక్షతో దేశాన్ని, ముఖ్యంగా యువతను ముందుకు నడిపించారు.
నిధులు, నిక్షేపాలు, నదీనదాలు, కేదారాలు దేశ సంపద అని ఒకనాడు భావించబడేది. ఈ ‘్భప్రపంచమే’ కుగ్రామంగా మారిన నేటి దేశ కాల పరిస్థితుల్లో ‘దేశ సంపద’యొక్క ‘డెఫినెషన్’మారింది. వీటన్నింటినీ సాధించగలిగే ‘యువతే’ దేశ సంపదగా నేడు భావించబడుతోంది. అయితే, ఈనాటి మన దేశ సంపద. కులం, మతం, జాతి, నిరుద్యోగం లాంటి అనారోగ్యాలతో కునారిల్లుతోంది.
సంస్కరణ భావాలు మెండుగా కలిగిన ఐతా చంద్రయ్య దేశానికి, ముఖ్యంగా దేశంలోని యువతకు దిశానిర్దేశం చేయాలనుకున్నారు. ‘కులం కత్తిని చేతబట్టుకుంటే తరం ముందుకుపోదు’అని, చదువు పూర్తిచేసిన యువత ప్రభుత్వోద్యోగాలకే వెంపరలాడరాదనీ, అలా ప్రభుత్వోద్యోగులకై ఎదిరిచూస్తూ విలువైన కాలాన్ని వృధాచేయకూడదని అంటూ ‘ఉద్యోగం దొరికేదాకానైనా, తను పుట్టిపెరిగిన ఊరుకు సేవ చేయాల’ని ఉద్భోదించే నవల ఇది.
ఎమ్మే పరీక్షలు రాసిన చక్రధర్ అనే బ్రాహ్మణ యువకుడు స్వంత ఊరికి వచ్చి, తనలాంటి పది మంది వివిధ కులాల యువకుల్ని ఆసరాగా తీసుకుని, ఆ పల్లెకు రోడ్డు, విద్యుద్దీపాలు, ఆస్పత్రి పాఠశాల, బస్సు మరియు బ్యాంకు సౌకర్యాలు కల్పించటం.. కుల నిర్మూలన, మద్యపాన నిషేధం, తక్కువ జాతివారికి దేవాలయ ప్రవేశం, హరిజనుడైనా, వేద పఠనానికి, పౌరోహిత్యానికి అర్హుడేనని చూపటం, వర్ణాంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ, మనుషులందరూ ఒక్కటేనని చెప్పటం.. ఈ నవలలోని ముఖ్య ఉద్దేశం.
తెలంగాణా యాస భాషతో సాగే ఈ నవలలో చంద్రయ్యగారు తెలంగాణా, పల్లె ప్రజలు తమ నిత్యకృత్యాలలో వాడే సామెతలు, పడికట్టు పదాలు, అమాయక జనంలో ఉండే కట్టుకథలు (కల్లు పురాణం. పేజీ 13)లాంటి వాటిని ఎన్నింటినో సందర్భం కలిపించి చెప్పే ప్రయత్నం చేసారు.
చక్రధర్, మందాకిని అనే హరిజన యువతిని పెళ్ళాడటం, అతనికి సబ్ కలెక్టర్ ఉద్యోగం రావటం, పల్లె సర్వతోముఖంగా అభివృద్ధి చెందటంతో నవల ముగుస్తుంది.

-కూర చిదంబరం