అక్షరాలోచన

అక్షర లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షర లక్ష్యం కూడా
అభ్యుదయానే్న కాంక్షిస్తుంది
అణువణువునా తన
తనువును తాకట్టు పెట్టి
అభివృద్ధి కోసం నిరీక్షిస్తుంది!
అడుగడుగునా తన
మాటల బాటల్లో సుందర
భవిష్యత్తును వేడుకగా వెతుక్కుంటుంది!
అక్షరం - తనో ఆయుధం కావాలి - అని
అరాచక శక్తుల్ని అణచివేయాలని
అన్యాక్రాంతమై - విధినేల్తున్న అన్యాయాల్ని
బెదిరించి, ఎదిరించి, అదిలించి
బేజారై పోతున్న సగటు జీవులను
బేషరతుగా ఆదుకుందామని-
నిరంతరం పరితపిస్తుంది
విరామమెరుగక పరిశ్రమిస్తుంది!
కవి హృదయ సామ్రాజ్యాన్ని
సుభిక్షంగా - సుక్షేత్రంగా మార్చి
ఏమారిపోతున్న - మానవ విలువల్ని
ఎలాగైనా- పరిరక్షిద్దామని-
అక్షరం పడే తపన - తపస్సుగా మారి
తమస్సును తరిమేస్తుంది
ఉషస్సును ఉదయిస్తుంది!

-మరువాడ భానుమూర్తి 8008567895