అక్షరాలోచన

జీవన గీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాకీ చల్లగాలిలా తాకింది
చర్మవ్యాధులు సమసిపోయేలా
పిల్లనగ్రోవి ఎవరో పిలుస్తున్నట్టు,
ఏ ఊర్థ్వ లోకాల నుంచో, గగన విహారిలా,
ఆహ్వానం పలుకుతున్నట్టు,
గుండె నాళాల్ని పట్టి లాగుతుంది.
తబలా డోలక్ మమేకమై, మెల్లగా
పసిపిల్లాడి నడకలా, జీవన వొడిదుడుకుల్ని గుర్తు చేస్తున్నాయి
మువ్వలు తోడై లయను పరిపుష్టం చేస్తూ, మనిషి మనుగడా,
సాఫీగా సాగే పాట పల్లవికి తీగలల్లింది
పల్లవి తేనెల వూటలా, బ్రతుకు పూల బాటలా పరిమళించింది.
వాయులీనం, వాయువులో విలీనమైన మల్లెల మకరందంలా
పల్లవి పాదాల్ని తాకుతూ తన్మయత్వం కలిగిస్తుంది
చరణాలా శవి కిరణాలా అన్నట్టు
సుతారంగా సితార గమకాలు మార్దవం వొలికిస్తుంటే,
జలతరంగిణి పాటను అలలపై తేలుస్తూ
మనిషి మనుగడను మంత్రముగ్ధం చేస్తుంది
మృదంగం గోదారి వారధిపై ధూమశకట గమనంలా
ధాంధూం అంటూ రంకెలేసింది
రసఝరిలా సాగే గానం, ఒక్కసారిగా లయ తప్పింది
తంబుర తన పని తాను నిర్వర్తిస్తున్నా
గాత్రంలో అపశృతి పలికింది
మనిషి తప్పిదాన్ని ఎత్తిచూపింది
సంగీత దర్శకుడు పాటకు కట్ చెప్పాడు
మళ్లీ పాట మొదలవ్వాలి
ఎన్ని పాటలు పాడినా, ఎన్ని పాట్లు పడినా
బ్రతుక్కు వనె్న తేవాలి
జీవితం మూడు పువ్వులు ఆరుకాయలు కావాలి.

-కనగాల జయకుమార్ 9391385178