అక్షర

ఆనువంశిక రాజకీయ అధ్యయన గ్రంథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను - నా కుటుంబం (తెలుగు రాజకీయాల్లో వారసత్వ పోకడలు)
-మదమంచి సాంబశివరావు
వెల: రూ.499
ప్రతులకు: రచయిత
సౌపాడు గ్రామం వట్టిచెరుకూరు మండలం గుంటూరు జిల్లా.

** *** *******

ప్రపంచ చరిత్రలో రాజరికం ఉన్నప్పుడు తండ్రి తర్వాత కుమారునికి లేదా తమ్మునికి రాజ్యాధికారం లభిస్తూ ఉండేది. సంస్థానాధిపతుల కాలంలో కూడా ఇదే వ్యవస్థ కొనసాగింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎవరైనా ఎం.ఎల్.ఏ. లేదా ఎం.పీ లేదా మంత్రి కావచ్చు. ఐతే కొన్ని రాజకీయ కుటుంబాలు భార్య - భర్త - కుమార్తె - కుమారుడు - తమ్ముడు - అల్లుడు - మేనల్లుడు .. ఇలా అందరూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని ప్రజాసేవ చేసి దేశాన్ని ఉద్ధరించటం కన్పడుతున్నది. ఆ మాటకొస్తే ఢిల్లీ నెహ్రూ, ఇందిర, రాజీవ్‌గాంధీ, సోనియా, రాహుల్, ప్రియాంకల ఆనువంశిక రాజకీయ ప్రస్థానం వారు చేసిన త్యాగాలు అందరికీ తెలిసినవే. ‘డైనాస్టీ ఈజ్ నాస్టీ’ అని యం.వెంకయ్య నాయుడుగారు అన్నప్పటికీ, సింధియా కుటుంబంలో అందరూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొని పదవులు అనుభవించినవారే. ఇలా గమనిస్తే తమిళనాడులో కరుణానిధి కుటుంబం, కర్ణాటకలో దేవగౌడ కుటుంబం, కేరళలో కరుణాకరన్ కుటుంబం, మహారాష్టల్రో బాల్‌థాకరే కుటుంబం ఇలా దేశవ్యాప్తంగా ఆనువంశిక రాజకీయాలు సన్‌స్ట్రోక్‌లు గమనించవచ్చు.
మదమంచి సాంబశివరావు సీనియర్ జర్నలిస్టు. పరిశోధనాత్మక దృష్టి కలవాడు. ఆయన ఇటీవల ఒక గ్రంథం రాశారు. దాని పేరు ‘నేను - నా కుటుంబం’. పేరును బట్టి ఇది రచయిత ఆటోబయోగ్రఫీ అని భ్రమించకండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ కుటుంబాల చరిత్ర ఇది. అందరికీ కెసిఆర్, వైఎస్‌ఆర్, ఎన్‌టిఆర్ కుటుంబాలే కాక దాదాపు నూరు రాజకీయ కుటుంబాలు మనకు ఉన్నాయి. వారందరి పేర్లు, జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా వివరాలు అందించడం అంటే ఒక పరిశోధనయే. ఈ పని చేయటంలో సాంబశివరావు కృతకృత్యుడైనాడు. ఇందులో రచయిత ఏ పార్టీని వ్యక్తిని దూషించడం లేదా భూషించటమో చేయలేదు. నిగ్రహంతో వాక్య నిర్మాణం చేయటం గొప్ప విషయం. భార్యాభర్తలు, అన్నదమ్ములు, బావమరుదులు ఇలా రకరకాల రాజకీయ కుటుంబాల మినీ ఎన్‌సైక్లోపిడియా ఇది. ఇందులో ప్రధానంగా ఆధునిక రాజకీయ చిత్రమూ ఉంది. ఉదాహరణకు ప్రకాశం జిల్లా ఏర్పడక ముందు అది అవిభక్త గుంటూరు జిల్లాలో అంతర్భాగంగా ఉంది. అప్పుడు టంగుటూరి ప్రకాశం పంతులుగారు ఆ తర్వాత వారి కోడలు ఇలా రాజకీయాల్లో పాల్గొన్నారు. అలాగే గుంటూరు జిల్లాలో తొలి తరంలో ఆచార్య గోగినేని రంగనాయకులు, శ్రీమతి భారతీదేవి రంగా వంటి వారున్నారు.
మదమంచి సాంబశివరావు చేసిన ప్రయత్నం రాజకీయ విద్యార్థులకే కాక పాత్రికేయులకు కూడా రిఫరెన్స్ బుక్‌గా ఉపయోగపడుతుంది అనటం సందేహం లేదు. అనుబంధంలో వివిధ రాష్ట్రాలలోని రాజకీయ కుటుంబాల గురించి సంగ్రహంగా ఒక వ్యాసం ఇస్తే బాగుండేది. లేదా వీలువెంట ఒక సమగ్ర గ్రంథమే వ్రాయగల శక్తి సాంబశివరావు గారికి ఉంది.
పారిశ్రామిక రంగంలో ఆనువంశికం ఉన్నప్పుడు రాజకీయ, సినీ రంగంలో ఉంటే తప్పేమిటి? అని కొందరు వాదిస్తున్నారు.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్