అక్షర

జి.ఎస్.హాస్యకథలు(పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-జి.ఎస్.లక్ష్మి
వెల: రూ.100
ప్రతులకు: రచయిత్రి 2-2-23/7/1, బాగ్‌అంబర్‌పేట హైదరాబాద్- 500 013
990 864 8068

*** *** **************

హాస్యం ఎవరూ రాయడం లేదు అని పాపం చాలామంది బాధపడిపోతూ ఉంటారు. అవార్డులూ గట్రా ఇవ్వటానికి పనికిరాక పోయినా అలా సరదాగా చదువుకునేందుకు హాస్యం కావాలి అందరికీనూ. ఎవరూ సభ పెట్టి సన్మానం చెయ్యకపోయినా, మెచ్చి మేకతోలు కప్పకపోయినా, పాఠకులు ఆదరిస్తున్నారు అదే పదివేలు అని ఓపిగ్గా హాస్యం రాస్తూనే ఉన్నారు. జి.ఎస్.లక్ష్మిగారు కూడా పాపం అదే పని చేస్తున్నారు. ఆవిడ కథల్లో హాస్యం ఇప్పుడొస్తున్న సినిమాల్లో కామెడీ ట్రాక్‌లాగా విడిగా ఉండదు. కథలో కలిసిపోయే ఉంటుంది. కాబట్టి నవ్వు తెచ్చుకోనవసరం లేకుండా దానంతట అదే వచ్చేస్తుంది.
కథల్లోని పాత్రలన్నీ మనకు చుట్టూ వున్నవే. కాబట్టి ఇలాంటి వాళ్లను మనమూ చూసాం అనిపిస్తుంది. ఉదాహరణకు తాపీగా వంటచేసే మరదలూ, మొబైల్ యుగంలో పెళ్లి చేయించే పురోహితుల సమయస్ఫూర్తి హాయిగా నవ్విస్తాయి. ఇలాంటి చెణుకులూ చమత్కారాలు చాలా వున్నాయి మరి. కాబట్టి అలవోకగా చదివేసుకోవచ్చు. జి.ఎస్.లక్ష్మిగారి కథలు సమాజంలోని కుళ్లునూ కుత్సితాన్నీ ఎత్తిచూపవు. ఈవిడకి తన కథల ద్వారా సమాజాన్ని బాగు చేసేయాలన్న ఆవేశమూ లేదు. వీరి కథలకు మొదలుపెడితే చివరి దాకా చదివించే గుణం ఉంది. కాలక్షేపం కోసం కాసేపు నవ్వుకుంటూ కథలు చదవాలనుకునే వారిని ఏ మాత్రం నిరాశపరచవు.