అక్షర

కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు(పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ప్రొ.ఎస్.సింహాద్రి
వెల: రూ.60/-
ప్రతులకు: ప్రజాశక్తి, నవచేతన బుక్‌హౌస్, విశాలాంధ్ర, నవోదయ బుక్‌హౌస్ అన్ని బ్రాంచీలలో

****

కులం నీడలో అభివృద్ధి రాజకీయాలు అనే ఈ పుస్తకంలో 2008లో తొలిసారి ముద్రించారు. చిన్నచిన్న మార్పులతో రెండో ఎడిషన్‌ను ప్రస్తుతం ముద్రిస్తున్నారు. ముఖ్యంగా అభివృద్ధి వాస్తవాలను పరిశీలిస్తుంటే రాష్ట్రం ఎంత లోతుగా కులతత్వ పాలనతో కూరుకుపోయిందో అర్థమవుతుంది. అధికార నియామకాలు రాజ్యాంగ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా ఉన్నాయి. రాజకీయ పార్టీలు కేవలం రెండు, మూడు కులాల కబ్జాలయిపోయాయి. ప్రజాస్వామిక స్పృహతో ఉండాల్సిన వేదికలు కుల సంఘాలుగా మారిపోయాయి. దీనితో ప్రభుత్వరంగం అత్యధిక కుల చైతన్యంలో భాగంగా ఉంటూ స్వంత అస్థిత్వాన్ని కోల్పోతున్నది. కులమే ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని శాసిస్తున్నాయి. ప్రజాస్వామిక స్పృహతో కుల సంఘాలు సామాజిక న్యాయానికై, సామాజిక మార్పుకై నిరంతరం పోరాడుతున్నాయి. కాని వాటిని గుర్తించక వారి ఆకాంక్షలను గౌరవించక పాలక కుల ప్రయోజనాలకు అనుగుణంగా మలిచే ప్రయత్నం జరుగుతుంది. ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు, మహిళలు ప్రజా సంఘాలలో భాగంగా పాలకవర్గ కుట్రలను పసికట్టడం జరుగుతుంది. సామాజిక ఆకాంక్షల కేంద్రంగా ఉద్యమిస్తేనే లక్ష్యం దగ్గరవుతుంది. అభివృద్ధి, రాజకీయం, నియామకాలు, రిజర్వేషన్లు.. ఇత్యాది అంశాలను ఈ పుస్తకంలో ప్రస్తావించారు. *