అక్షర

భక్తిరస గీత మాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమన్నారాయణ సుమధుర గీతమాలిక
-కుమారి రాచూరి శ్రీచందన
ప్రతులకు: రచయిత్రి
ఇం.నెం.401, బ్లాక్ 2సి, ఎస్‌ఎంఆర్ వినయ్ సిటీ
మియాపూర్ క్రాస్‌రోడ్స్ హైదరాబాద్-500 049. 9885111967

** *** *******

12 సంవత్సరాల బాలిక చి.శ్రీచందన. ఇంతటి చిన్న వయసులో భగవంతుని మీద భక్తితో తమ ఇంటి ఇలవేల్పు శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహంతో -తేనెలొలుకు ముద్దుముద్దు తెలుగు పదాలలో చాలా భక్తిగీతాలు వ్రాసింది. వ్రాయడం ఒక అద్భుతమైతే ఆ గీతాలకు తానే స్వయంగా బాణీలు కట్టి కొన్ని రాగాలలో ఆలపించడం ఇంకొక మహాద్భుతం.
17వ పేజీలో 12వ గీతం ‘సన్నాయి గానము వింటే’ అనే దానిలో ఈమె ఒక సత్యాన్ని ఆవిష్కరించింది.
‘శాస్ర్తియ సంగీతం ఆలపిస్తేనేమో/ తీయని సాహిత్యం కమ్మని స్వరములతో/ భక్తితో దేవుని నామస్మరణం/ మధురమైన అనుభూతి చెందదా?’
పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి వెర్రులెత్తుతున్న యువతకు, సినిమా ప్రపంచం తప్ప వేరు ప్రపంచం లేదని తమతమ ఛానళ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారికి ఇదొక మేలుకొలుపు.
అలాగే 4వ గీతంలో గోపాలుడు ఎవరని తానే ప్రశ్నించుకొని మళ్లీ తానే సమాధానం చెప్పిన తీరు చాలా బాగుంది.
37వ గీతంలో విష్ణుమూర్తి తత్త్వాన్ని ఎంతో రమణీయంగా ఆవిష్కరించింది.
ఈ గ్రంథంలో ప్రచురించిన అన్ని గీతాలు చాలా భక్తిబోధకంగాను, మహాసత్యాల ఆవిష్కరణగాను, ఉన్నాయి. గీతాలకు తగ్గ బొమ్మలు ఇవ్వడం కూడా బాగుంది. ఈ చిరంజీవినికి ‘అమ్మ’ కరుణా కటాక్షాలు లేకుంటే ఇంత చిన్నవయసులో అలా రచించడం సాధ్యపడదు.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ