అక్షరాలోచన

హేమంత పువ్వు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగెడుతున్న కాలం నుండి
హేమంత ఋతువు భూమిపై రాలిపడి
శీతల పవనాల విత్తులు చిగురించాయి
కోట్ల కాంతుల ఖిలలు విరజిమ్ముతూ..
అంబరమణి మకరంలోకి దూకి
గగన పసిడి ద్వారాలను తెరిచాడు!

చలి రాకాసి శరీరాన్ని కొరుకుతుంటే...
అగ్ని నోట్లో మా గతాన్ని పోసి వెలిగిస్తే...
ఆ వెలుగులు మా కష్టాల గొంతులు నులిమి
అంధకార బందీఖానా నుండి విముక్తులను చేసి
భోగి పూలవర్షాన్ని కురిపించాయి!

ముంగిళ్లు రంగవల్లులు అద్దుకుంటే...
డోలు సన్నాయిలు స్వరాలు అందిస్తే...
హరిదాసు గళం రాగాలాలపిస్తే..
డూడూలు నృత్యాలతో దండాలు చేస్తే..
పిండి వంటలు మా నాలుకలకు రుచులద్దితే..
మా పల్లె శోభను చూడటానికి
పట్టణమంతా వలసొచ్చింది!

ఆదర్శాల తీగలతో ఆశయాల పతంగులను
మేఘాల అంచుకు చేరుస్తాము!
సూర్య రేచ్ఛస్సుతో రేగుపండ్లు చేసి
చిన్నారుల దేహాలను అభిషేకిస్తాము!
సంప్రదాయాలను నిలువెల్లా నింపుకొని
మంచు పువ్వులను సాగనంపుతాము!!

-విరాజిత 9700747280