అక్షర

వినుడు వినుడు రామకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాల్మీకి వ్యాసులు
తీర్చిన రామకథ
రచన: డా. తుమ్మలపల్లి వాణీకుమారి
వెల: రూ.150లు
ప్రతులకు: రచయత్రి
003, సానాటా అపార్ట్‌మెంట్స్
విద్యానగర్, హైదరాబాద్
500044
9849362876

రామాయణం గూర్చి రాముని గూర్చి తెలియనివారు మొత్తం ప్రపంచంలో ఎవరూ ఉండరు అన్నదానిలో అతిశయోక్తి ఉండదు. ఆదికావ్యమైన రామాయణం భారతీయ సంస్కృతిని అద్దం పట్టేది. రామాయణంలోని ప్రతిఅంశమూ ముఖ్యంగా తెలుగునాట పండినదే. త్రేతాయుగంలోని రాముడే అయినా నిన్నమొన్న ఇక్కడ నడయాడిన వాడన్నట్టుగా జనులు భావిస్తారు. ప్రతి చెట్టూపుట్టా ప్రతి రాయి రప్పా కూడా రామానామోచ్ఛారణతో లీనమై ఉంటుంది. ఋషి వ్యవస్థ ప్రాతిపదికగా ఉన్న ఈ భారతీయ సంస్కృతి నవనవోనే్మషానికి కొంగ్రొత్త పరిణామాలను ఆహ్వానించే వ్యవస్థగానే ఎదుగుతోంది. కాని ఈ నవోనే్మషణమంతా పూర్వం నుంచి వచ్చినదే అని తెలిసి ఆశ్చర్యానందాలకు ఆధునికులు గురి అవుతుంటారు. అట్లాంటి నేపథ్యంలో అటు పురాణాలు, ఇటు కావ్యాలు, ఇతిహాసాలు, ప్రబంధాలే కాదు జానపదాల్లోను వౌఖికసాహిత్యమూ రాముని అయనాన్ని విపులంగా వివరించేవి సాహిత్యం ఈ తెలుగునాట కోకొల్లలుగా ఉంది.
ఎంత సాహిత్యమున్నా ఎంతమంది రచయితలు రాముని గూర్చి పుంఖాను పుంఖాలుగా రచనలు వెలువరించినా ఇంకా ఇంకా రామాయణాన్ని తరిచి తరిచి చూస్తూ మణులుమాణిక్యాలను అనే్వషకులు తీస్తునే ఉన్నారు.
అట్లాగే తుమ్మలపల్లి వాణీకుమారిగారు వ్యాసవాల్మీకులు రాముని తీర్చిదిద్దిన వైనాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపడానికి ఓ చిరుపొత్తాన్ని ‘‘వాల్మీకి వ్యాసులు తీర్చిన రామకథ’ గా తీసుకొచ్చారు.
రామో విగ్రహాన్ ధర్మః అన్నట్టు పోతపోసిన ధర్మమే రామునిగా ప్రతి కవి తీర్చిదిద్దితే సీతమ్మ మాయమ్మ అనే జన మనోభిప్రాయాన్ని సుస్థిరం చేయడానికి సీతమ్మను తమ తమ ఇండ్లల్లోని స్ర్తివలె కవులు చిత్రించారు. వాల్మీకి సైతం సీత అతిసహజమైన మానవమాత్రురాలిగా చూపడానికాఅన్నట్లు సీత తన మాటను నెగ్గించుకోవడానికో లేక తన చిత్తం వచ్చినట్లు నడవడానికో కాని అటు రాముణ్ణి , లక్ష్మణుణ్ణి ఒక్కమాట అన్నా రావణుని బుద్ధి గరపడానికి ఎన్ని ప్రలోభాలు పెట్టినా సీతమ్మ సీతమ్మలాగే నిలబడేలా రచన సాగించాడు. ధర్మమే నా రూపు అన్న రాముడు కూడా సీతమ్మ రావణ చెరను తప్పించుకొని రాముని సన్నిధికి వస్తే నీకోసం నేను ఈ యుద్ధాన్ని చేయలేదు. సూర్యవంశానికి మచ్చరాకుండడానికే ఈ రావణుని మట్టు పెట్టాను. ఇన్నాళ్లు ఈ దుష్టుని చెరలో ఉన్న నీవు నీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్లవచ్చు అన్నరాముని పలుకు విన్న ఆ సీతమ్మ ఎంతగా నొచ్చుకుందో ఎంత వేదననుభవించిందో మాటరాని రాయే అయ్యిందో తల్చుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే సీతారాముల గూర్చి తుమ్మలపల్లి వాణీకుమారిగారు పురాణాల్లో, ఇతిహాసాల్లో, భేదసాదృశ్యాలను వివరిస్తూ నాటి సాంఘిక వ్యవస్థను ,అందులోని రమ్యమైన వర్ణనలు చిత్రిస్తూ నాటి రామకథను కళ్లకు కట్టారు.
అన్ని సాహిత్యప్రక్రియల్లో కుదురుకున్న రామకథను ఋషులు తీర్చిదిద్దిన వైనాన్ని పరిశోధనాత్మకంగా చెప్పడం ఈ పుస్తకంలోని విశేషం. నేడు సైతం రామరాజ్యాన్ని వాంఛించడంలోని అంతరార్థాన్ని ఈ పుస్తకంద్వారా వ్యక్తం చేశారనే అభిప్రాయాన్ని పాఠకులకు కలిగించడంలో కృతకృత్యులయ్యారనే చెప్పొచ్చు. ఇందులో మరో ప్రత్యేకత వారి తండ్రిగారు విద్యుద్దీపాలు, క్యాలిక్యులేటర్స్ లాంటి ఆధునిక ఉపకరణాలు సైతం లేని ఆ కాలంలో గణిత శాస్త్రం పట్ల అపారమైన అభిమానంతో 200 సంవత్సరాల క్యాలెండరును తయారు చేసిన దానిని ప్రచురించడం. తల్లిదండ్రుల నుంచి పిల్లలు సంపాదించుకునే విజ్ఞానమే నా రుూ రామకథలోని మాధుర్యమని చెప్పే వాణీకుమారిలోని సౌకుమార్యత, సహృదయతలే పుస్తకంలోని వస్తువుకు వనె్న తెచ్చాయనే అభిప్రాయాన్ని పాఠకుల్లో కలిగిస్తాయ. సరళసుందరమైన శైలీతో ఒప్పారే ఈ రచన ఏకబిగిన పాఠకుణ్ణి ఆసాంతం చదివించే నేర్పును కలిగిఉంది. ప్రతివారు చదివి తెలుసుకోవాల్సిన పొత్తమే వాల్మీకి వ్యాసులు తీర్చిన రామకథ.

-రాయసం లక్ష్మి