అక్షరాలోచన

దినచర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతవరకు తన మీద తనే విధించుకున్న
హింసకు
ప్రభాతమన్న సాంకేతికాన్ని ప్రయోగించుకొని
బాధాగ్నుల్లో దూకి
కొత్త బంగారంగా బైటికొచ్చి
పరుగిడుతున్న వనజ్వాల మీద
వాజసని
వర్ణాలేరుకుంటూ
ఒక అవ్యక్త రస కల్లోలం చిందించిన
శచల చారిమను బ్రతుకు ముఖానికద్దాడు...
ఇప్పుడు
పాట గొంతుకన్నా
పక్షి భాష సంకీర్ణమైంది
పుప్పొడి దుమారంకన్న
పూల భాష వ్యాకీర్ణమైంది
ఊహను పదార్థంగా మార్చి
ఉనికి కల్పించిన క్షణాన్ని పోగేసుకుంటున్నాను
తామర కొలను మొగ్గ విచ్చుకోవటంలో
కిరణప్రభ కిలకిల్లాడటమూ చూశాను
గతిమార్మిక శోభకు గమన శీలాన్నద్ది బాష్ప
బిందువునయ్యాను...
దృశ్యంగా వున్న తోటకు
పార్థివమైనా పక్షిపాచే అర్థం చెబుతున్నప్పుడో
ఒక అందమైన మాటను జీవితానికి జోడిస్తే
అది పద్యపికమై పక్షాలాడిస్తూ పైకెగురుతున్నప్పుడో
లక్షలాది మంది నడిచే నడిబజార్లోనే
ఒంటరితనం నగ్నంగా కనిపించినప్పుడో
దృష్టి సంచార దీవులు దాటిన సరిహద్దు వ్యాపకాల్లో
జనన మరణాలు జాగృత సత్యాలైనప్పుడో
జన్మకిన్ని అధ్యాయాలా అని
జన్మంతా అనుకుంటాను....

ప్రొద్దుటెండ వెలుగులు నన్ను పరిరంభించి
పరామర్శిస్తునే ఉంటాయి
కళ్లను నిమిరి కాంచన ద్యుతిని కనుకలికి
కానుకగా దయ చేస్తునే వుంటాయి
పూల ప్రపంచపు ఆశల్ని పెదవుల మీద
కుశల ప్రశ్నలుగా కుట్మలిస్తునే ఉంటాయి
సమానత్వం సామాజిక ఇతిహాసపు సముచ్చయంగా
మానవత్వపు మీటుల్ని ముఖరిస్తునే ఉంటాయి
ఇప్పుడు నేను సంతోష సరిత్శబ్దాత్మనై
కాలం ఎత్తిన గొంతుతో - గొంతు కలుపుతాను...!

-సాంధ్యశ్రీ 810689 7404