అక్షర

ఒక్కొక్కడు.. ఒక్కో నరహంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవుల్లో దానవులు (ఆధునిక యుగంలో మానవ మృగాలు)
సంకలనం: డా.ప్రయాగ మురళీమోహనకృష్ణ
వెల: రూ.200 పేజీలు: 205
ప్రతులకు: అక్షర ప్రభ కొత్తరేగువానిపాలెం విశాఖపట్నం - 13.

*****

డా.ప్రయాగ మురళీకృష్ణ గారు లండన్‌లోనూ, ఇతర దేశాలలోనూ వైద్యునిగా పనిచేసే రోజుల్లో, వలస వచ్చిన అనేక దేశాల కాందిశీకులను, వారి కష్టాలను బాధలను చూసి చలించిపోయారు. కాందిశీకులు చెప్పిన విషయాలు, వాటి చరిత్రను తెలుసుకొని ఈ పుస్తకాన్ని రూపొందించారు.
ఇందులో మూకుమ్మడి నరహంతకుల గురించి మొదటి భాగంలో పరిచయం చేశారు. జర్మనీకి చెందిన హిట్లర్, హిట్లర్ అనుయాయులు చేసిన జాత్యహంకార మారణకాండ గురించి వివరించారు. యుగాండా నియంత ఇదీ అమీన్, చిలీ నియంత పినోఛె, శ్రీలంక దేశాధ్యక్షులు రాజపక్సే, జింబాబ్వే అధ్యక్షుడు డాక్టర్ ముగాబె (ఇది రాస్తున్న కాలానికి సైన్యం ఆయనను తొలగించి నిర్బంధంలో ఉంచింది) ఇరాక్‌పై దాడి చేసిన జార్జిబుష్, ఇథియోపియా నియంత మెంజిస్టు, సుడాన్ ప్రెసిడెంట్ ఒమార్ అల్ బషీర్ మొదలైన వారు చేసిన దారుణాలు, ప్రజా మారణకాండ గురించి వివరించారు.
మత యుద్ధాల వల్ల టర్కీ మొదలు ఇరాక్, ఇరాన్, సిరియా, లెబనాన్, యెమన్, లిబియా, ఈజిప్టు తదితర అరబ్ దేశాలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాయి. గతంలోనే కాదు, వర్తమానంలో కూడా ఆయా దేశాల నాయకుల వల్ల ప్రజలు నిరంతరం యుద్ధ భయంతోనే కాలం గడుపుతున్నారు. ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్, లిబియా నియంత గదాఫీ, టర్కీ వజీర్ తలత్ పాషా, ఆఫ్గన్ స్థావరంగా ఏర్పరచుకున్న ఒసామా బిన్ లాడెన్, ఐయస్‌ఐయస్ నాయకుడైన అబుబకర్ అల్ బాగ్దాదీ మొదలైన కరడు గట్టిన నియంతలను, వారి రాజ్యకాంక్షను, ప్రజా పీడనను, జాత్యహంకార మారణకాండ గురించి తెలియజేశారు. వీరితోపాటు జపాన్ చక్రవర్తి హిరొహిటో, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఇల్‌సుంగ్, ఇతని కుమారుడు ప్రస్తుత ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ ఉంగ్ జన్ తండ్రిని మించిన నియంతగా, క్రూరుడిగా పేరు తెచ్చుకున్నాడు. వీరి నియంతృత్వ ధోరణులను, ప్రజా పీడనను, యుద్ధ పిపాసను వివరించారు.
మతం పేరిట జరిగే మారణహోమం అటు యూరప్‌లో, ఇటు ఆసియాలో సర్వసాధారణమై పోయింది. బోస్నియా ముస్లింలకు, సెర్బ్ క్రిస్టియన్లకు జరిగిన మారణకాండలో లక్షలాది మంది చనిపోవడం, యుగోస్లావియా విడిపోవడం జరిగింది. రువాండా అనే ఆఫ్రికా దేశంలో హుటు మరియు టుట్సు అనే రెండు తెగల మధ్య జరిగిన అంతర్యుద్ధం అతి భయంకరమైనది. ఇవేకాక కమ్యూనిజాన్ని అమలు చేయడానికి జోసెఫ్ స్టాలిన్, కిమ్ ఇల్‌సుంగ్, మావ్ సేడుంగ్, పాల్‌పాలొ లాంటి వారు సిద్ధాంతం పేరిట చేసిన అత్యాచారాలు ఘోరాతి ఘోరమైనవి. ఇంకొక దారుణమైన వికృతమేమిటంటే - కేపిటలిస్టుల సామ్రాజ్యవాదం. అమెరికన్లు ఎంతోమంది డిక్టేటర్లను, మత ఛాందసులను పెంచి పోషించి, మద్దతునిచ్చి ఆయుధాలనిచ్చి ఆయా దేశాల్లో మారణకాండను ప్రోత్సహించారు. ప్రపంచమంతటా మతం పేరిట, మతోద్ధరణ పేరిట మారణహోమం జరగడం మామూలై పోయింది. తెగల మధ్య అంతర్యుద్ధాలు సరేసరి.
మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ లావాదేవీలు, విదేశీ బ్యాంకులలో అక్రమ నిల్వలు, కులం పేరిట - మతం పేరిట పుట్టుకొస్తున్న సంస్థలు, ధనబలంతోనూ, అధికార బలంతోనూ పలు ప్రాంతాలలో జరుగుతున్న హత్యలు, దోపిడీలు, రాజకీయాలలో రాణిస్తున్న రౌడీషీటర్ల ఆగడాలు, కట్నపు చావులు, ఆడబిడ్డపై ఆంక్షలు - అత్యాచారాలు, యాసిడ్ దాడులు, చైన్ స్నాచింగ్‌లు, ధనార్జనే ధ్యేయంగా ముందుకు పోతూ మానవ సంబంధాలను నిర్లక్ష్యం చేస్తున్న పిల్లలు - ఇలా ఎన్నో అంశాలు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ మానవ జాతిని తిరిగి ఆటవిక యుగంలోకి తీసుకుపోతున్నాయని బాధపడుతూ ఈ రచయిత పలు అంశాలను క్లుప్తంగా తెలియజేసిన తీరు ప్రశంసనీయం.

-కె.పి.అశోక్‌కుమార్