అక్షర

‘దేవల’ అద్వైత సారాంశము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ దేవల వేదాంత సారామృతము
-చల్లా రామారావు
పేజీలు: 150
ధర: అమూల్యం
ప్రతులకు: రచయిత, శివాలయం వద్ద, రావూరిపేట గ్రామం,
వేటపాలెం పోస్ట్, ప్రకాశం జిల్లా. 9866532586

*** **

శ్రీ స్కాంద పురాణంలోని ఉత్తర ఖండము నందలి సనత్కుమార సంహిత యందు ‘రజతాచల ఖండం’ అనే ఒక ప్రాచీన గ్రంథానికి ఇది మూలం. దానిని శ్రీ రుద్రముని స్వామి వెలుగులోనికి తెచ్చి, సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించి మొదట 1924-25లో ప్రచురించారు. ఆ భాష కొంత జటిలంగా ఉన్నందున చల్లా రామారావు దానిని సరళమైన తెలుగులో తాత్పర్యం వ్రాశారు. మామూలు స్కాంద పురాణాలలో ఈ భాగము కనబడుట లేదు.
వేదాంత జిజ్ఞాసువులకు ద్వైత, అద్వైత, విశిష్టాద్వైతమని మూడు సిద్ధాంత మార్గములు కలవు. ఈ గ్రంథం చదివిన తరువాత పాఠకులకు అద్వైత సిద్ధాంతము పట్ల గురుత్వము ఏర్పడగలదని రచయిత చెప్పారు. ఎవరికైనా అద్వైత సిద్ధాంతమే అనుసరణీయము కదా.
ఈ దేవలుడు ఎవరు అని ప్రశ్నించుకుంటే దానికి సమాధానం దొరకడం లేదు. మహాభారతంలోను, మహాభాగవతంలోను, కంకంటి పాపరాజు రామాయణంలోను దేవలుడనే వాని ప్రసక్తి ఉంది. చాలామంది దేవలుడనే నామంతో వ్యవహరింపబడ్డారు. కాని ఈ దేవల ఉపనిషత్తు ప్రసక్తి లేదు.
అయినా గ్రంథస్థ విషయాలు చాలా బాగా ఉన్నాయి. పేజీ 38లో దేవలుడు నిర్గుణ, నిరంజన రూపుడు. దేవలుని వలన దివ్యకాంతి లేక అగ్నిమామనువు అందురు. అలాగే పే.151లో ‘నేను అద్వయుడను, కేవలానంద మాత్రుడను, పే.171లో జనన మరణములు ఆత్మకు లేవు, పే.176లో ఏడంతస్థుల మేడ యున్నను, మంచమే నిత్య మనును. పే.177లో అగ్నిమామనువు అకార జ్ఞానరూపుడు, ఉ-కారమను రూపుడు, మకార మహీరూపుడు అంటూ ఓంకారాన్ని చెప్పారు.
పే.175లో చెప్పిన విషయము అద్భుతంగా ఉన్నది. ఎవరు ఎవరిని జయించారో చెప్పారు.
పరశురాముని - రాముడు; రాముని (విష్ణువు) అవతారమైన బలరాముని, శ్రీకృష్ణుని జరాసంధుడు; జరాసంధుని - భీముడు; భీముని - పవన పుత్రుడైన ఆంజనేయుడు; ఆంజనేయుని సూర్యుడు, సూర్యుడు మేఘములు (ఆచ్ఛాదింపబడును), మేఘాలను వాయువు, వాయువును పర్వతములు, పర్వతములు అగ్ని చేతను, అగ్ని జలము చేతను, జలములు సూర్యుని తాపముతోను, ఆ తాపము ఉదకములచే శమించును. ఇలా ఒక్కొక్క దానియందు ఒక్కొక్కటి లయమందగా లోకేశులును, దేవతలును బ్రహ్మకల్పమున నశింతురు.
ఈ దేవల ఉపనిషత్తు సామవేదములోని 317వ శాఖకు చెందినది. దేవాంగ పురాణములోని కొంత భాగము అనుబంధంగా రచయిత ఈ గ్రంథంలో ఇచ్చారు. ఇది ముఖ్యంగా దేవాంగ శాఖీయులు (మామూలుగా పద్మశాల కులస్థులుగా చెపుతాము) అనుసరించే గ్రంథము. ఎన్నో అద్వైత వేదాంత విషయాలు సులభంగా చెప్పినందుకు రచయిత అభినందనీయుడు. రచయిత అనేకన్నా అనువాదకుడు అంటే బాగుండేది.

-నోరి సుబ్రహ్మణ్యశాస్ర్తీ