అక్షర

హాస్యం వ్యంగ్యం వెటకారాల పూలసజ్జ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికట్టు కథలూ - కమామీషులూ
-వంగూరి చిట్టెన్ రాజు
ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

** ****

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా - సాహిత్య సాంస్కృతిక, సేవా కార్యక్రమాలతో, 70 పుస్తకాల ప్రచురణతో, ధార్మిక కార్యక్రమాల నిర్వహణతో - అచిరకాలంలోనే ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఆ సంస్థ వ్యవస్థాపకులు వంగూరి చిట్టెన్ రాజుగారు కార్యశీలి, కార్యదక్షులు. స్వయంగా రచయిత. వారు గత పదేళ్లలో ఎనిమిది కథా సంపుటాలు వెలువరించారు. ఈ ‘అమెరికట్టు కథలూ - కమామీషులూ’ - చిట్టెన్ రాజుగారి తొమ్మిదవ పుస్తకం. ‘ఈ పుస్తకంలో జరిగినది కొంతా.. సొంత పైత్యం మరికొంతా.. కలిపితే మామూలు వ్యాసం కూడా కథ... అనగా కల్పితం అయిపోతుందిగా!’ అని తన రచనా విధానాన్ని తానుగానే చెప్పుకున్నారు రచయిత.
సంపుటిలో 22 కల్పనాత్మక, వాస్తవిక సంఘటనాత్మక కథా కథనాలు ఉన్నాయి. ‘అమెరి’కాకినాడావమానం’ కథనంతో మొదలై, ‘సింగపూర్ సదస్సూ - భలే చమత్కారాలు’ కథనంతో ముగిసింది పుస్తకం. మొదటి కథనంలో - రచయితలు తమ రచనలు చదివే ఏ ఒక్క పాఠకుణ్ణి అయినా చూసి ఆనందించాలనే తహతహ, తపన, ప్రత్యక్ష పరోక్ష ప్రయత్నాలూ.. ఆహ్లాదకరంగా, హాస్య వ్యంగ్యభరితంగా కదులుతాయి. చివరికి అలాంటి ఏ ఒక్క పాఠకుడు తటస్థపడ్డాడనుకున్నా - అతనికి ఆ రచన పట్ల గల స్పందన ఎలా ఉంటుందో, ఆ అనుభవాన్ని జీర్ణించుకోలేని రచయిత ప్రతిస్పందనకి చికిత్స ఏమిటో - మంచి ఆత్మవీక్షణంగా అందించారు చిట్టెన్‌రాజుగారు.
ఇలాగే - ‘అమెరిపబ్లికన్ దినం - తద్దినం’ ‘అమెరికావతి మోసం బాబోయ్’ ‘పొలిటికల్ పుష్కరాలూ - పిండ ప్రదానాలూ’ ‘అమరభ్రమరావతి కథ... ఏమో’ ‘అమెరిపబ్లికన్ ఏనుగూ - డెమొక్రాట్ గాడిదా’ ‘పడక్కుర్చీ ప్రకంపనలు’ వంటి కథనాలన్నీ సమయోచిత, సంఘటనాత్మక వ్యంగ్య చిత్రణలు. కాగా, ‘గోతిలో పడ్డ వరల్డ్ ఫేమస్ ఎన్నారై’ అన్నది - జనమబూమి కార్యక్రమంలో - ఇంటి గోడ పొడవునా తవ్విన గొయ్యి (నాలుగడుగుల లోతు, రెండడుగుల వెడల్పూ) - రచయిత గారికి కల్పించిన తిప్పలూ, వాటిని తప్పించుకోవటానికి మీడియా ఆశ్రయం, దాని ఫలితం -అద్భుతమైన శైలితో సాగిపోయింది. ఇంతకింత హాస్యాన్ని మేళవించుకున్న మరో కథనం - అందునా అచ్చమైన వాస్తవ సంభవం - ‘్భరణీ, బ్రహ్మానందం మధ్యలో బభ్రాజమానం’ అన్నది! ఇందులో బ్రహ్మానందం చేసిన సాహిత్య ప్రసంగం వివరాలు దొరుకుతాయి. ‘నా కథలు ఆయన చాలా చదివారు అని తెలిసి శునకానందం కూడా వేసింది’! వంటి చిట్టెన్ రాజు వాక్య విన్యాసమూ అలరిస్తుంది. భరణి వీరింట్లో ‘అడుగు పెట్టిన మరుక్షణం వంటిల్లు స్వాధీనం చేసుకుని రెచ్చిపోయిన’ వైనాన్నీ ఆహ్లాదకరంగా ఆస్వాదిస్తాం. ఆ వంటిల్లు భౌతిక స్థితినీ కనువిందుగ మనోఫలకం మీద ముద్రించుకుంటాం!
హాస్యం, వ్యంగ్యం పండాలంటే - ఒకటి రచనలో దృశ్యచిత్రణ. రెండవ విధానం - వాక్యాల్ని విరుపులతో, మెరుపులతో, కొండొకచో చరుపులతో దట్టించటం. ఈ రెండు విధానాల్లోనూ ‘చేయితిరిగిన తనం’ సొంతం చేసుకోవటం వలన చిట్టెన్ రాజుగారి కథాకథనాలు పాఠకుల కళ్లకు వెలుగునీ, మనసుకు తెలివినీ పంచుతూ మనోజ్ఞంగా ఉన్నాయి.

-విహారి 9848025600