అక్షర

వైదేశిక కథతో చారిత్రక నవల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర స్వప్నం (చారిత్రక నవల)
మూల రచన: రాహుల్ సాంకృత్యయన్
తెలుగు అనువాదం: ఆలూరి భుజంగరావు
వెల: రూ.210
ప్రతులకు: విశాలాంధ్ర బుక్‌హౌస్

***********************

రాహుల్ సాంకృత్యయన్‌కు త్రిపిటకాచార్య అనే బిరుదు ఉంది. అంటే ఈయన బౌద్ధ దీక్ష తీసుకున్నాడు.
దానికి తోడు మార్క్సిస్టు గతి తర్క సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. జయఔధేయ, సింహ - సేనాపతి వేదకాలము నాటి ఆర్యులు వంటి రచనలు చేశాడు. ఇది ఆయా భారతీయ భాషలలోనికి అనువదింపబడ్డాయి. ఇప్పుడు మధుర స్వప్నం అనే చారిత్రక నవలను భుజంగరావుగారు అనువాదం చేయగా పునర్ముద్రించారు. త్వరలో రాహుల్‌జీ సాహిత్యమంతా పరంపరగా ఇవ్వాలని
నిశ్చయించినట్లు ప్రచురణకర్తలు చెప్పారు.

తెలుగులోకి కన్నడ, హిందీ, బెంగాలీ వంటి భాషల నుండి చాలా రచనలు వచ్చాయి. అలాగే ఇంగ్లీషు నుండి కూడా ఛార్లెస్ డికెన్స్, అలగ్జాండరు డ్యూమాస్, మార్క్‌ట్విన్ వంటి వారి రచనలు కూడా లోగడ వచ్చాయి. ఐతే విదేశీ ఇతివృత్తాలు తీసుకొని భారతీయులు వ్రాసిన నవలలు కొన్ని ఉన్నాయి. తెనే్నటి సూరి ‘్ఛంగిస్‌ఖాన్’ వంటివి ఈ కోవలోకి చేరుతాయి. హిందీ రచయిత రాహుల్ సాంకృత్యయన్ ఇరాన్ దేశానికి సంబంధించిన ఇతివృత్తంతో ఓ నవల వ్రాశారు. దానిని ఆలూరి భుజంగరావు ‘మధుర స్వప్నం’ పేరుతో అనువదించారు. మూల రచనా కాలం 1950. 2017లోని తెలుగు ప్రచురణ ఐదవ ముద్రణ.
రాహుల్ సాంకృత్యయన్‌కు త్రిపిటకాచార్య అనే బిరుదు ఉంది. అంటే ఈయన బౌద్ధ దీక్ష తీసుకున్నాడు. దానికి తోడు మార్క్సిస్టు గతి తర్క సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. జయఔధేయ, సింహ - సేనాపతి వేదకాలము నాటి ఆర్యులు వంటి రచనలు చేశాడు. ఇది ఆయా భారతీయ భాషలలోనికి అనువదింపబడ్డాయి. ఇప్పుడు మధుర స్వప్నం అనే చారిత్రక నవలను భుజంగరావుగారు అనువాదం చేయగా పునర్ముద్రించారు. త్వరలో రాహుల్‌జీ సాహిత్యమంతా పరంపరగా ఇవ్వాలని నిశ్చయించినట్లు ప్రచురణకర్తలు చెప్పారు.
ఇందలి కథ క్రీ.శ.492 నాటిది. తిగ్రా నదీ తీరస్థ రాజ వంశ గాథ. 1945 ప్రాంతంలో మూల రచయిత టెహరాన్‌లో ఉన్న కారణంగా అక్కడి చరిత్రను సేకరించి తన కోరికను నెరవేర్చుకున్నారు. మనకు జర్మన్ పండితుడు నోల్డ్, డెన్మార్క్ పండితుడు క్రిస్టియన్ సన్, జాకోబీ, తిబ్రీ, పారశీక పండితులు ఇంకా జీన్ మలాలా, దియో ఫానిస్, అగాధియస్ వంటి ఎందరో చరిత్రకారుల రచనలను రాహుల్‌జీ సంప్రదించాడు. ఐతే ఈ చరిత్రకారులందరూ ఇరాన్ చరిత్ర విషయంలో ఏకాభిప్రాయాన్ని ప్రదర్శించలేదు. ఐతే రాహుల్ తన శైలిలో కథా నిర్మాణం చేసుకున్నారు. సఅలవి (11వ శతాబ్ది) అనే చరిత్రకారుడు కవాత్ ధర్మాత్ముడని, మజ్దక్ పరమ దుర్మార్గుడని చెప్పాడు. ప్రజలలో వ్యభిచారాన్ని, అరాచకత్వాన్ని మజ్దక్ ప్రోత్సహించాడు. కవాత్ చిన్నవాడు కావటం వలన సోభా సర్వాధికారాలు చెలాయించాడని ఒక చరిత్రకారుడు వ్రాశాడు. కవాత్ చనిపోయాక ఖుస్రో అధికారానికి వచ్చినట్లు మరో కథనం. మజ్దక్ ప్రజల నుండి దోచుకున్న ధనాన్ని స్ర్తిలను తిరిగి పంచి పెట్టాడు. ఈ కథలో ఎవరి చారిత్రక ప్రామాణ్యం వారిదే. దీనిని రాహుల్ తీసుకోవటంలో ఆంతర్యం ఏమిటి? ధనమూ భూమి స్ర్తిలు ఏ ఒక్కరి సొత్తు కాదు. అందరికీ వీటన్నింటి మీద అధికారం ఉంటుందని ఈ పెద్దమనిషి భావించినట్లు కన్పడుతున్నది. దీనినే ఆయన సామ్యవాదం అని భ్రమించినట్లున్నాడు. రాహుల్ సాంకృత్యయన్ నిజంగా బౌద్ధుడయితే నిర్వాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి. కాని అలా జరుగలేదు. దోపిడీని ప్రోత్సహించే కవాత్ - మజ్దక్‌ల ఇతివృత్తాన్ని ఏకపత్నీత్వం వంటి ఆదర్శాలు నచ్చినట్లు లేదు రాహుల్‌జీ. ఓల్గా నుండి గంగ వరకు అని లోగడ ఒక నవల వ్రాశాడు. అంటే భారతీయ సంస్కృతి రష్యా నుండి ఇండియాకు వచ్చిందా? చారిత్రక సత్యం ఏమంటే ఇండియా నుండి రష్యాకు పోయింది. ఇందుకు విరుద్ధంగా చరిత్రను వక్రీకరించటం తగునా?
ఆలూరి భుజంగరావు తెలుగు వారికి సుపరిచితుడైన రచయిత. అనువాదం సరళంగా తెలుగుదనం ఉట్టిపడేటట్లు ఉంది. కాకుంటే మూలకథ ఇరాన్ దేశానికి సంబంధించినది కాబట్టి చారిత్రకంగా ఆ దేశపు ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి కలవారు మాత్రమే దీనిని చదవడానికి ఉత్సుకత చూపుతారు.
234వ పుటలో హిందూ ధర్మానికి మజ్దయసీ ధర్మానికీ గల సంబంధాలను రాహల్‌జీ ఒక సన్నివేశంలో కల్పించి వ్రాశాడు. ఈ సంభాషణలు సియాబక్ష - గుల్‌నాజ్‌ల మధ్య జరుగుతుంది. దేవతలను వీరు అసురులని పిలుస్తారట!! (అనువాదకుని వ్యాఖ్యానం)
మజ్దక్ భూతల స్వర్గం సృష్టించేవాడని, అతని మరణం మానవాళికి తీరని లోటు అని రాహుల్ సాంకృత్యయన్ తనదైన శైలిలో భావించాడు. ఇందలి ధర్మాధర్మాలు రాహుల్ రంగు కళ్లద్దాలతో మనం చూడనక్కరలేదు. చారిత్రక నవల రచించేటప్పుడు సత్యానికి ప్రాధాన్యం ఇవ్వాలనేది మూల సూత్రం. అలాకాక ఎవరికి వారు చరిత్రకు వ్యాఖ్యానం చేస్తే పాఠకులను అపమార్గాన పట్టించినట్లవుతుంది.
ప్రతినాయకుణ్ణి నాయకునిగా చిత్రీకరించే ప్రవృత్తి వలన సమాజ సంక్షోభానికి రచయిత దోహదం చేసినట్లవుతుంది. టిమోజిన్ ఎంతటి దుర్మార్గుడో చరిత్రకారులందరూ ఏకాభిప్రాయంతో వెల్లడించారు. ఇతడు మంగోలు జాతీయుడు. అతనిని వీరునిగా చిత్రించి తెనే్నటి సూరి ‘్ఛంగిస్‌ఖాన్’ అనే నవల 50వ దశకంలో వ్రాశాడు. మజ్దక్ గూర్చి క్రీ.శ.1020 ప్రాంతానికి చెందిన ఫారసీ కవి అబ్దుల్ ఖాసి ఫిరదౌసి చాలా వివరంగా కవాత్ - మజ్దక్‌ల చరిత్రను పూసగుచ్చినట్లు వివరించాడు. మజ్దక్ విశృంఖల లైంగిక స్వాతంత్య్రాన్ని వ్యభిచారాన్ని ధర్మపీఠాలు ప్రశ్నించాయి. ‘ఒక స్ర్తిని అనేక మంది రమిస్తే ఆ పుట్టే సంతానానికి తండ్రి ఎవడో ఎలా తెలుస్తుంది? రాజుకు సేవకునికి ఒకే వేతనం ఉంటే ఎవడు రాజో ఎలా తెలుస్తాడు?’ ఈ ప్రశ్నలకు మజ్దక్ నుండి సమాధానాలు రాలేదు. తర్వాత మజ్దక్ అనుయాయులను సజీవ సమాధి చేశారు. ఆ తర్వాత మజ్దక్‌కు ఉరిశిక్ష వేశారు. అలాంటి మజ్దక్ రాహుల్ సాంకృత్యయన్ దృష్టిలో కథానాయకుడు. సమసమాజ నిర్మాత. దీనినిబట్టి రచయిత మనస్థితిని మనం అంచనా వేసుకోవచ్చు.
ధనవంతులను దోచుకోండి. ధాన్యాగారాలను పగలగొట్టి ప్రజలకు పంచండి. ఇదే సామ్యవాదం అని మజ్దక్ ప్రకటించాడు. మజ్దక్ మతం మీద రాహల్‌జీకి విశ్వాసం కుదిరి అతడిని కథానాయకుణ్ణి చేసుకున్నాడు. బెంగాల్‌లో మైకేల్ మధుసూదన దత్తు అనే రచయిత ఇంద్రజిత్తును కథానాయకునిగా చేసుకుని రాముడు, లక్ష్మణుడు ప్రతినాయకులు - అన్నట్లు ‘మేఘనాథ వధ’ కావ్యంలో చిత్రించాడు. ఇదిగో చారిత్రక ఐతిహాసిక వక్రీకరణలు ఈ విధంగా ఉంటాయి.

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్