అక్షర

మనే్నమాతరం (కవిత్వం)( పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-యాములపల్లి నరసిరెడ్డి
వెల: రూ.100
ప్రతులకు: కె.చంద్రకళ
7/144, చాకర్లపల్లి -515 122 సోమందేపల్లి మండలం అనంతపూర్. 9603759059

*** ******** **************

భావోద్వేగాలు బలంగా ఉప్పొంగే ప్రాంతమే అయినప్పటికీ రాయలసీమ మంచి కథా సాహిత్యం వచ్చినంతగా కవిత్వం రావటంలేదు. గాఢమైన జీవితానుభవాలకేమీ కొదవలేదు. స్థానీయమైన ప్రత్యేక సమస్యలకు, మానసిక సంఘర్షణలకు ఏం తక్కువ లేదు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, దేశమంతటా విస్తరిస్తున్న రకరకాల భావనలు, మానవ సంబంధాల్లో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యాల్లో తలెత్తుతున్న ఆలోచనలు అన్నీ ఒక ప్రాంతంగా రాయలసీమ ఎదుర్కొంటున్నది. రాయలసీమ సామాన్యుడు వీటన్నిటి నడుమ, తన ప్రత్యేక చారిత్రక, సామాజిక పరిస్థితుల నడుమ నిత్యం సతమతమవుతూనే ఉన్నాడు. స్థానిక కవిత్వం ఇంకా బలంగా ఇక్కడి వివిధాను భవాలను ప్రతిబింబించవలసి ఉన్నది. రాయలసీమ అనగానే కథ గుర్తొచ్చినంత విశేషంగా కవిత్వం రూపొందించవలసిన అవసరమున్నది. గతంలో తెలుగు కవిత్వాన్ని సుసంపన్నం చేసిన రాయలసీమ గొంతులు వినిపించిన కవుల మాదిరిగానే వర్తమానం వికసించవలసి ఉన్నది. ఇప్పటి ఒక చారిత్రక సందర్భంలో గొంతు విప్పుతున్న కవి యాములపల్లి నరసిరెడ్డి. తన తొలి కవితా సంపుటి ‘మనే్న మాతరం’. అది రాయలసీమ విప్పిన కంఠస్వరం.