అక్షర

నాన్నా! నాకు మరణం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాన్నా! నాకు మరణం లేదు
(అవయవ దానంపై కవితా సంకలనం)
సంపాదకవర్గం: ద్వానా.శాస్ర్తీ
వోలేటి పార్వతీశం
మద్దాళి రఘురామ్
వెల: రూ.60/-
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక
విక్రయ కేంద్రాలలో

భారతీయుల జీవితంలో పరోపకారాన్ని మించిన ఆనందం ఇంకొకటి లేదు. దానధర్మాలు, సేవానిరతి, భూతదయ మనకు తృప్తికరమైన అనుభవాలు. ధన్యజీవులమని భావించడానికి సోపానాలు. అందులో ‘జీవనదానం’ ‘ఆయుర్దానం’ అన్నింటికంటే ఉత్తమమైనవి. ఎందరో మహానుభావులు తమ బాధను ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఇతరులకు తోడ్పడటం మన ఇతిహాస పురాణాలలో పెద్దలు మనకు తెలియజేశారు. గత కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పరిశోధనల వల్ల మానవమాత్రులు కూడా రక్తదానం, అవయవదానం చేసేందుకు సాధ్యం అవుతున్నది. వీటిపై అవగాహన పెరగడంతోనూ, ప్రసార మాధ్యమాలలో సంపర్కం సులభతరం అవడంతోనూ దానం చేయడానికి ఎందరో ముందుకు వస్తున్నారు. ఆ నేపథ్యంలో అవయవ దానంపై ఓ కవితా సంకలనం ‘నాన్నా! నాకు మరణం లేదు’ వెలువడింది. ఈ కవితల్లో అవయవదాన విశిష్టతను, దానం యొక్క విలువను, పురాణాల్లోని దానగుణ కథలను, సామాజిక స్పృహతో నవ్యభావాలు వెదజల్లుతూ కవిత్వీకరించారు.