అక్షర

సమస్యకు పరిష్కారం చెప్పిన ‘జీవన మాధుర్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవన మాధుర్యం
- కథా సంపుటి-
కొట్టి రామారావు
వెల: రూ.100;
పుటలు: 88;
ప్రతులకు: రచయిత 9908789405
***
రచయిత సృజనాత్మకతను పాఠకులతో పంచుకోడానికి అనేక మార్గాలను ఎంచుకొనవచ్చు. కవితలు, నానీలు, నవలలు, వ్యాసాలు, నాటకాలు తదితర ప్రక్రియలన్నింటిలోనూ పాఠకాదరణ పొందిన రచయిత కొట్టి రామారావు. ఆయన రచించిన ‘జీవన మాధుర్యం’ కథా సంపుటిలో పనె్నండు కథలున్నాయి. సాహితీ కిరణం, ముంబాయి ఒన్ పక్షపత్రిక, చిత్ర మాస పత్రికలలో కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ కథలలో కేవలం సమస్యని ప్రస్తావించడం కాకుండా పరిష్కార మార్గాలను చూపించడం పాఠకులనాకట్టుకుంటుంది.
భర్త అంటే ఎవరు? భరించువాడా? హరించువాడా అన్న అంశం చుట్టూ అల్లబడిన కథ ‘‘్భర్తంటే’. భర్తకు వ్ఘ్యాపారం చేయాలన్న కోరిక వస్తుంది. మరి పెట్టుబడి ఎలా? అన్న ప్రశ్నకు సులువైన సమాధానం భార్య ఆస్తి అమ్మేయడం. అది జరిగిందా లేదా అన్నది కథ చివరిదాకా చదివితేకాని తెలియదు.
భార్య అనారోగ్యానికి లోనయితే, భర్త ఆవిడ చేసే పనులన్నీ చేయడం వారి మధ్య అనురాగానికి ప్రతీక. ఈ జన్మలో మీరు చేసిన సేవల ఋణం వచ్చే జన్మలో తీర్చుకుంటాను అనడం పాఠకులను విస్మయానికి లోనుచేస్తుంది. ఆశ్చర్యపోయిన భర్తకి దొరికిన సమాధానం ‘మీ ఋణం తీర్తుకుంటానండి... వచ్చే జన్మలో మీరు...గా... పుట్టి’ కథలో తెలుస్తుంది.
మనిషి జీవితంలో అనేక రకాల పరీక్షలని సమర్ధవంతంగా ఎదుర్కొంటేనే, జీవనయానం సాఫీగా జరుగుతుంది. భర్తను కోల్పోయిన భార్య పునర్వివాహం చేసుకోవాలనుకున్నపుడు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. వరుడు తన అందాన్ని ధనాన్ని కోరుకుంటున్నాడా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? కథానాయిక పెట్టిన పరీక్షలో ఎవరునెగ్గారు అన్నది తెలుసుకోడానికి ‘పరీక్ష’కథ చదవాలి.
అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నాడొక సినీ కవి. మాటల అర్థం గ్రహించిన భర్త వైవాహిక జీవితం ఆనందమయమవుతుంది. ఈ నేర్పులేని భర్త పడ్డ పాట్లను వివరించే కథ ‘కాదంటే...’
‘శాంతలక్ష్మికి కోపం వచ్చింది’ శీర్షిక చదవగానే ఇది మానవ సంబంధాలకి సంబంధించిన కథ అనుకోవచ్చు. ‘శాంతలక్ష్మి మా గేదె పేరు’అన్న మొదటి వాక్యం చదవగానే కథానాయిక ఎవరో తెలిసిపోతుంది. శాంతలక్ష్మిని దొంగిలించిన కోటి పాలుపిండుకోడానికి ప్రయత్నించినపుడు శాంతలక్ష్మి తన్నడంతో కోటి ఆ గేదెను కట్టివేసి కొట్టడం మొదలుపెడతాడు. కట్టు తాడు తెంపుకుని కొమ్ములతో కుళ్లబొడుస్తుంది. ‘శివతాండవం’ కథానాయకుడు ‘శివ’అనే ఎద్దు. యజమానిని కరవడానికి ప్రయత్నించిన కోడెనాగుతో పోరాడి గెలుస్తుంది. కాని పాము కాటుకు బలైపోతుంది. ఈ రెండు కథలూ కూడా జరిగిన సంఘటనల చుట్టూ అల్లబడినవనిపిస్తుంది.
ప్రేమించి పెళ్లిచేసుకున్న దంపతుల సంసారం సవ్యంగా సాగకపోడానికి గల కారణాలలో ముఖ్యమైనది ‘అనుమానం’. అశ్వనిని ప్రమాదంనించి కాపాడిన శివ, ఆమెని పెళ్లిచేసుకుంటాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగరీత్యా రాత్రి దాకా పనిచేయాల్సిన అశ్వని శీలాన్ని శంకించడం మొదలుపెడతాడు. అనుమానం పెనుభూతమైన తర్వాత ఏం జరిగిందో కనుగొనడానికి ‘మానని గాయం’ కథ చదవాలి.
దానం పుచ్చుకోడంవల్ల కలిగే ఇబ్బందులు ఇతివృత్తంగా రాయబడిన కథ ‘ఆ ఒక్క నిముషం ఏడిస్తే పోలా?’ గో దానం పుచ్చుకున్నపుడే గోవుని ఎలా చూసుకోవాలో తెలుసుకున్న వెంకటశాస్ర్తీ మొదటిరోజు పాలు పిండుకోగలుగుతాడు. రెండోరోజు ఆవుని బీడుకు తోలుకెళ్లలేక పోతే, సాయంత్రం పాలుపిండుకోనివ్వదు గోవు. రోజంతా ఆవుతో తిప్పలుపడేకన్నా ‘ఆ ఒక్క నిమిషం మజ్జిగ లేదని ఏడిస్తే పోలా’అని శాస్ర్తీ అనుకోడంతో కథ ముగుస్తుంది.
మిగిలిన కథలు వితంతు పునర్వివాహం, భార్య చేసిన తప్పిదాన్ని భర్త క్షమించడం, ప్రేమించినవాడు ప్రేయసిని అమ్మేయడం, తదితర అంశాల చుట్టూ అల్లబడినవి. పుస్తకం చదివినవారికి కథలు యదార్థ జీవితగాథలు అనిపించడం రచయిత నైపుణ్యానికి నిదర్శనం.

-పాలంకి సత్యనారాయణ