అక్షర

ఇంట్లో యజ్ఞం ఒంట్లో ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞచికిత్స
రచన: గౌడ జనార్ధన్,
వెల: రూ.130/-;
ప్రతులకు: జి.జనార్ధన్, 13-6-433-131, నేతాజీ
నగర్, ఇన్నర్ రింగ్‌రోడ్ పోస్టు- గోల్కొండ,
హైదరాబాదు- 500 008.(తెలంగాణా)
***

డాక్టర్ దుంపల గోపాలకృష్ణ ఆర్య ఆంగ్లంలో యజ్ఞచికిత్స అనే గ్రంథం రచించారు. దానిని తెలుగులోకి డాక్టర్ గౌడ జనార్ధన్‌గారు అనువదించారు. వీరు నేత్ర వైద్యులు. ఈ మొత్తం కార్యక్రమానికి సంపాదక బాధ్యతను వేద విజ్ఞానవేత్త మర్రి కృష్ణారెడ్డిగారు నిర్వహించారు. యజ్ఞము ప్రాచీన కాలములో ప్రతి గృహములోను జరుగుతూ ఉండేది. దీనివలన ఇహపర సుఖము లభ్యమయ్యేవి. ఋషి ఋణము, దేవఋణము పిత్రూణములు యజ్ఞమువలన నెరవేరేవి. యజ్ఞములో ఉపయోగించే వివిధ ద్రవ్యములవలన పర్యావరణ పారిశుద్ధ్యము సాధింపవచ్చు. రష్యాలో ఒక ప్రయోగముచేశారు. అణుబాంబులవలన వెలువడే ప్రమాదపూరితమైన రేడియోయాక్టివిటీ ఆవుపేడతో చేసిన పిడకలలో యజ్ఞముచేసిన ప్రాంతములో నశించిపోయింది. ఇంతటి మహత్తర శక్తిగల యజ్ఞమువలన అత్యాధునిక రోగములు కూడా ఎలా నయము చేయవచ్చునో ఈ గ్రంథములో సప్రమాణంగా రచయిత నిరూపించారు. సామాన్య జ్వరాదులేకాక క్షయ, ఎయిడ్స్, కాన్సర్ వంటి వ్యాధులు కూడా నిత్యాగ్నిహోత్రులందరిని చేరవు అని వారు స్పష్టంగా చెప్పారు.
అన్ని వేదములలోను యజ్ఞవైశిష్ట్యము వర్ణింపబడినా అధర్వణ వేదములో ముఖ్యంగా రోగ నిదానములు ఓషధీ విజ్ఞానము అధికంగా ఉంది. శారీరిక మానసిక సమస్త రుగ్మతలకు హోమా థిరపీ గొప్పదని పాశ్చాత్య దేశాలవారు ఇప్పుడు ప్రకటించారు. ఇట్టి యజ్ఞము కాలక్రమేణ క్షీణించడమో మిధ్యాభ్రమలకు లోనుకావటమో జరిగింది. ఈ దశలో మహర్షి దయానంద సరస్వతి ఆర్యసమాజము ద్వారా వేదమును యజ్ఞమును విశ్వవ్యాప్తిగావించారు.
ఈ గ్రంథములో ఏయే రోగములకు ఏయే వైదిక సూక్తములు ఔషధములో ఇవ్వబడ్డాయి. అలాగే వాడవలసిన ఓషధుల జాబితాలు కూడా ఇచ్చారు. ఇది మొత్తం ఆరు అధ్యాయముల గ్రంథం. మొదటి అధ్యాయములలో యజ్ఞవైశిష్ట్యం వివరించి ఐదవ అధ్యాయంలో యజ్ఞము ద్వారా వ్యాధి నివారణ ఆరవ అధ్యాయములో షోడశ సంస్కారములు అతి సంగ్రహంగా వివరించారు. భారతదేశము ఒకప్పుడు ఎందుకు జగద్గురువుగా రత్నగర్భగా ఉండేది అంటే యజ్ఞమువలననే యజ్ఞక్షీణతే జాతిక్షీణత అని తెలియజేశారు రచయిత.
‘‘ఆయుర్ యజ్ఞేన కల్పతాం’’అని యజుర్వేదంలో చెప్పబడింది. మహాబల సంపన్నులైన వాయుదేవుని పుత్రులే హనుమంతుడు భీమసేనుడు. అంటే వాయువును శుద్ధిచేసే రహస్యం యజ్ఞంద్వారానే సాధ్యం. భౌతిక శరీరం ఈధర్, ఆస్ట్రో, కాస్మిక్ అనే చతుర్ధ్భావములకు యజ్ఞశుద్ధి అనుసంధాన హేతువు. ఇదొక ప్రామాణిక నిరూపణము.
భారతీయులు దురదృష్టవంతులు విదేశీ దండయాత్రలకన్నా తీవ్రంగా స్వదేశీయ అజ్ఞానుల అవహేళనకు యజ్ఞప్రక్రియ గురిఅయింది. అలాంటి వారికి సమాధానం చెప్పేందుకు ఈ చిన్న గ్రంథం కరదీపికగా ఉపయోగపడుతుంది.
శతపథ బ్రాహ్మణములో రాష్ట్రం వైశిశ్వం అని ఉంది. ఇది తెలియక మిథ్యాత్మక హింసాయజ్ఞములు మొదలైనాయి. మర్రివారు తమ సంపాదకత్వంలో సకాలంలో ప్రజలకు ఒక విజ్ఞాన భాండారాన్ని అందించారు.

-ముదిగొండ శివప్రసాద్