రాష్ట్రీయం

24లోగా దర్యాప్తు నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షయ గోల్డ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, మార్చి 11: అక్షయ గోల్డ్ కేసులో తాజా పరిశోధన నివేదికను సమర్పించాలని హైకోర్టు తెలంగాణ, ఎపి సిఐడి అధికారులను ఆదేశించింది. ఎపి అక్షయ గోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అగ్రిగోల్డ్ కంపెనీ మాదిరిగా అక్షయ గోల్డ్ మోసాలపై హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తితో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలు చేసిన పిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు సిఐడి అధికారులను వివరణ కోరింది. బోర్డులో డైరక్టర్లు ఎంత మంది మారారు, ఆ సమయంలో బోర్డు సభ్యుల దుర్వినియోగం, వారి పాత్ర ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేసి, ముగ్గురు డైరక్టర్లను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇంకా ఆస్తుల గురించి విచారణను దర్యాప్తు అధికారులు గుర్తించే పనిలో ఉన్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. ఎపి ప్రభుత్వం తరఫున న్యాయవాది కృష్ణప్రకాశ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేశామని, నాలుగు సార్లు కంపెనీ చేతులు మారిందని కోర్టు దృష్టికి తెచ్చారు.
అక్షయ తరఫు కౌన్సిల్ మాట్లాడుతూ అవసరమైన చెల్లింపులు చెల్లించినా, కొందరు భూమి యజమానులు భూమిని కంపెనీ పేరున బదిలీ చేయలేదని తెలిపారు. ముగ్గురి వాదనలు విన్న కోర్టు మార్చి 24లోగా విచారణ నివేదికను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అంతేకాకుండా అక్షయ గోల్డ్ కంపెనీ ఎండి ప్రతి కోర్టు విచారణకు తప్పకుండా హాజరు కావాలని కూడా హైకోర్టు ఆదేశించింది.