జాతీయ వార్తలు

జార్ఖండ్‌లో అల్‌ఖైదా శిక్షణా శిబిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/రాంచీ, మార్చి 14: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా జార్ఖండ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో శిక్షణా శిబిరాన్ని నడుపుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. గత వారం ఢిల్లీలోని కోర్టుకు దాఖలు చేసుకున్న దరఖాస్తులో పోలీసులు ఈ విషయాన్ని తెలియజేశారని ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. జార్ఖండ్‌కు చెందిన అబూ సూఫియాన్ అనే వ్యక్తి కోసం తాము గాలింపు జరుపుతున్నట్లు వారు న్యాయస్థానానికి తెలియజేశారు. భారత ఉపఖండంలో లష్కరే తోయిబా, అల్‌ఖైదా నిర్వహిస్తున్న తీవ్రవాద శిబిరాల్లో (ఎక్యుఐఎస్) శిక్షణ పొందేందుకు అబూ సూఫియాన్ పాకిస్తాన్‌కు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన అరెస్టయిన అల్‌ఖైదా కార్యకర్త మొహమ్మద్ ఆసిఫ్‌పై చార్జిషీట్ దాఖలు చేసేందుకు మరింత గడువు ఇవ్వాలని కోరుతూ చేసుకున్న దరఖాస్తులో పోలీసులు ఈ విషయాన్ని తెలియజేయడంతో గడువును పొడిగించేందుకు న్యాయస్థానం అందుకు అనుమతించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, నక్సలైట్ల సమస్యతో తీవ్రంగా సతమతమవుతున్న జార్ఖండ్‌లో ఇప్పుడు అల్‌ఖైదా కూడా శిక్షణా శిబిరాన్ని నడుపుతోందని ఢిల్లీ పోలీసులు వెల్లడించడంతో ఆ రాష్ట్ర భద్రతా విభాగానికి కొత్త తలనొప్పి మొదలైంది.