క్రీడాభూమి

పాక్ క్రికెట్ జట్టు సారథి అలీ ‘రాజీ’నామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ శిబిరంలో అమీర్ చేరికపై నిరసన
సర్ది చెప్పిన పిసిబి చీఫ్ షహర్యార్ ఖాన్
కెప్టెన్‌గా కొనసాగేందుకు అంగీకారం

లాహోర్, డిసెంబర్ 29: స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి అపఖ్యాని మూటగట్టుకున్న కళంకిత యువ పేస్ బౌలర్ మొహమ్మద్ అమీర్‌కు జాతీయ శిక్షణా శిబిరంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించడాన్ని నిరసిస్తూ పాకిస్తాన్ క్రికెట్ జట్టు సారథి అజర్ అలీ మంగళవారం కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అయితే పాక్ క్రికెట్ బోర్డు (పిసిబి) చైర్మన్ షహర్యార్ ఖాన్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో అతను కెప్టెన్‌గా కొనసాగేందుకు అంగీకరించాడు. 2010లో జరిగిన స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలిన అమీర్‌కు మళ్లీ అవకాశం కల్పించడంపై ప్రస్తుతం పాక్ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. జాతీయ శిబిరంలో కొద్ది రోజుల క్రితం అమీర్‌తో కలసి శిక్షణలో పాల్గొనేందుకు అజర్ అలీ, మొహమ్మద్ హఫీజ్‌లతో పాటు పాక్ జట్టులోని మరికొంత మంది ఇతర ఆటగాళ్లు కూడా నిరాకరించారు. ఈ నేపథ్యంలో అజర్ అలీ మంగళవారం షహర్యార్ ఖాన్‌ను కలసి జట్టు సారథ్య బాధ్యతల నుంచి తనను తొలగించాలని విజ్ఞప్తి చేశాడు. అయితే షహర్యార్ సర్ది చెప్పడంతో అతను కెప్టెన్‌గా కొనసాగేందుకు అంగీకరించాడని పిసిబి వెల్లడించింది. అజర్ అలీ మంగళవారం షహర్యార్‌ను కలసి రాజీనామా సమర్పించాడని, అయితే షహర్యార్ ఆ రాజీనామాను అంగీకరించకపోవడంతో జాతీయ జట్టు సారథిగా కొనసాగేందుకు అజర్ అలీ అంగీకరించాడని పిసిబి ఒక ప్రకటనలో వివరించింది. స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి ఐదేళ్ల పాటు నిషేధాన్ని అనుభవించిన అమీర్ పాకిస్తాన్ ప్రీ-సీజన్ కండిషనింగ్ క్యాంప్‌కు ఎంపికైన 26 మంది ప్రాబబుల్స్‌లో ఒకడు. అయితే ఈ నిషేధం పూర్తయిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) అమీర్‌ను దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు అనుమతించింది. ఈ నేపథ్యంలో అమీర్ గతంలో తాను చేసిన తప్పులను మన్నించాలని అజర్ అలీ, హఫీజ్‌లకు క్షమాపణ చెప్పాడు. అంతేకాకుండా మళ్లీ పాక్ తరఫున ఆడేందుకు తాను అర్హుడిని కాదని అలీ, హఫీజ్ భావిస్తున్నట్లయితే ఆట నుంచి నిష్క్రమిస్తానని అతను స్పష్టం చేశాడు. దీంతో అలీ, హఫీజ్‌లకు పిసిబి చైర్మన్ సర్దిచెప్పి శిక్షణా శిబిరంలో పాల్గొనేందుకు వారిని ఒప్పించాడు. ‘అలీ, హఫీజ్ వ్యక్తం చేసిన ఆందోళనలను నేను గౌరవిస్తున్నా. కానీ వీటిలో కొన్ని ఆమోదయోగ్యంగా లేవు. ఈ విషయాన్ని వారు అర్థం చేసుకుని మాతో కలసి పయనిస్తామని ధ్రువీకరించారు’ అని షహర్యార్ ఖాన్ పేర్కొన్నాడు.

ఐసిసి ‘టాప్-10’లో అఫ్గాన్
దుబాయ్, డిసెంబర్ 29: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తాజాగా ప్రకటించిన వనే్డ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్థాన్ జట్టు మొట్టమొదటిసారి ‘టాప్-10’లో స్థానం సంపాదించింది. ఇటీవల జింబాబ్వేపై విజయం సాధించడంతో ఈ జట్టు రెండు స్థానాలను మెరుగు పరచుకొని, పదో స్థానానికి చేరింది. ఇటీవల కాలంలో అద్భుత ప్రతిభ కనబరుస్తున్న అఫ్గానిస్థాన్ జట్టు ఈ ఏడాది ఐసిసి వరల్డ్ కప్‌లో పాల్గొనే అర్హతను సంపాదించింది. ఆ మెగా టోర్నీలో దాదాపు అన్ని జట్లకూ గట్టిపోటీనిచ్చి అభిమానులను ఆకట్టుకుంది. అక్టోబర్‌లో జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను ఆడి 3-2 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో పదో స్థానాన్ని చేరడం ద్వారా తనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని నిరూపించుకుంది.

ఆసీస్ కోచ్‌గా లాంగర్
సిడ్నీ, డిసెంబర్ 29: వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జరిగే ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో పాల్గొనే ఆస్ట్రేలియా జట్టుకు మాజీ బ్యాట్స్‌మన్ జస్టిన్ లాంగర్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. ప్రస్తుత కోచ్ డారెన్ లీమన్‌పై కొంతకాలంగా క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అసంతృప్తితో ఉంది. లాంగర్‌ను కోచ్‌గా నియమించడం ద్వారా లీమన్‌కు త్వరలోనే ఉద్వాసన చెప్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.