క్రీడాభూమి

ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో ముగిసిన భారత్ పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, మార్చి 11: ఆల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ పోరు ముగిసింది. భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ సహా బి.సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్, సమీర్ వర్మ శుక్రవారం ఇక్కడ తమతమ ప్రత్యర్థుల చేతిలో పరాజయాలను ఎదుర్కొని ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్ మ్యాచ్‌లో మలేసియాకు చెందిన ప్రపంచ మాజీ నెంబర్ వన్ ఆటగాడు, ఒలింపిక్ రజత పతక విజేత లీ చోంగ్ వెయ్‌ని మట్టికరిపించి సంచలన విజయం సాధించిన ప్రణీత్ రెండో రౌండ్‌లో డెన్మార్క్‌కు చెందిన హాన్స్-క్రిస్టిన్ విట్టింగస్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. ఆరంభంలో బాగానే ఆడి 21-12 తేడాతో తొలి గేమ్‌ను కైవసం చేసుకున్న ప్రణీత్‌పై ఆ తర్వాత ప్రత్యర్థి పవర్‌ఫుల్ షాట్లతో విజృంభించాడు. ఫలితంగా 11-21, 16-21 తేడాతో వరుసగా రెండు గేమ్‌లను చేజార్చుకున్న ప్రణీత్‌కు ఓటమి తప్పలేదు. కాగా, ఈ టోర్నీలో భారత్ తరఫున టాప్ ర్యాంకు ఆటగాడిగా బరిలోకి దిగిన కిదాంబి శ్రీకాంత్ జపాన్‌కు చెందిన నాలుగో సీడ్ కెంటో మొమోటాతో జరిగిన రెండో రౌండ్ పోరులో ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీకాంత్ 10-21, 13-21 గేముల తేడాతో చేతులెత్తేయగా, పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో భారత క్వాలిఫయర్ సమీర్ వర్మ చక్కటి పోరాట పటిమను ప్రదర్శించినప్పటికీ విజయం సాధించడంలో విఫలమయ్యాడు. చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ ఆటగాడు తియాన్ హువెయితో జరిగిన ఈ పోరులో సమీర్ వర్మ 21-10, 12-21, 19-21 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. కాగా, డబుల్స్‌లో భారత ఆటగాళ్లు మను అత్రి, బి.సుమిత్ రెడ్డి తొలి రౌండ్‌లోనే నిష్క్రమించడంతో పురుషుల విభాగంలో భారత్ పోరు ముగిసింది.
అదేవిధంగా మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో పివి.సింధు, డబుల్స్ తొలి రౌండ్‌లో జ్వాలా గుత్త, అశ్వనీ పొన్నప్ప ఇప్పటికే ఓటమి పాలవగా, తాజాగా క్వార్టర్ ఫైనల్‌లో స్టార్ షట్లర్ సైనా కూడా చేతులెత్తేసింది. తైవాన్‌కు చెందిన తై జు ఇంగ్‌తో జరిగిన ఈ పోరులో సైనా 15-21, 16-21 గేముల తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. (చిత్రం) క్వార్టర్ ఫైనల్‌లో ఓటమిపాలైన సైనా నెహ్వాల్