ఐడియా

అందానికి.. అలోవెరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందానికి, ఆరోగ్యానికి అలోవెరా (కలబంద) ఫలితం గణనీయం. అలోవెరాకున్న ప్రాధాన్యతననుసరించే నేడు మార్కెట్‌లో సబ్బులు, జెల్, లోషన్స్.. ఎన్నో రూపాల్లో అలోవెరా ఉత్పత్తులు లభిస్తున్నాయి. శరీరాన్ని ఉత్తేజపరిచి చక్కటి అందాన్ని, ఆరోగ్యాన్ని అందించే బయోలాజికల్ ఏజెంట్స్ దీనిలో పుష్కలంగా వున్నాయి. చర్మంలో తేమ నిలిచి వుండేలా చేయటంలో అవోలెరా సమర్థవంతంగా పనిచేస్తుంది. గాయాల కారణంగా ఏర్పడే మచ్చలు, చర్మంపై వచ్చే చారలు, గీతల్ని తొలగిస్తుంది. కొన్ని రకాల ఎలర్జిక్ రియాక్షన్స్‌లోనూ డాక్టర్లు అలోవెరాను సూచిస్తారు. అలోవెరా ఆకులనుంచి వచ్చే జెల్‌ను జుట్టు కుదుళ్లకు పట్టిస్తే జుట్టు రాలదు.అలోవెరా నుంచి లభ్యమయ్యే మినరల్స్, విటమిన్స్, అమినోయాసిడ్స్ తదితర బయోలాజికల్ ఏజెంట్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వయసు పైబడుతున్న వారిలో కలిగే స్కిన్ మార్పులతో పోరాడి ముడతలు రాకుండా నివారిస్తుంది. అలోవెరాతో కలిసివున్న మాయిశ్చరైజర్ శరీరానికి ఎంతో మేలు. ఇందులోని ఆక్సిజన్ జుట్టు మొదళ్లకు నేరుగా చేరుకుని అంతర్గతంగా వుండే శక్తిని ఉత్తేజపరిచి మంచి ఫలితాన్ని అందిస్తుంది.అలోవెరాతో పాటు కొలేజన్, విటమిన్స్ కలిసిన ఉత్పత్తులు చర్మంలో సాగే గుణాన్ని నియంత్రించటంతోపాటు మృతకణాలను తొలగిస్తాయి. మిలనిన్‌ను నియంత్రించి చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. అలోవెరా ఉత్పత్తులను శరీరంలోకి తీసుకోవటం ద్వారా తరచు ఉత్పన్నమయ్యే మంటలను నివారించవచ్చు. పగుళ్లు, గాయాలు, బొబ్బలు వంటివాటికి అలోవెరాను ఉపయోగించి సత్ఫలితాలను పొందవచ్చు. ఇన్ని మంచి గుణాలున్న అలోవెరా మొక్కలను ప్రతి ఇంటా పెంచవచ్చు. అవకాశం లేనివారు చిన్న చిన్న పూలకుండీలలోను పెంచి అందుబాటులో ఉంచుకోవచ్చు.

-నాగలక్ష్మి