గుంటూరు

భక్తులతో పోటెత్తిన అమరారామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 7: పంచారామాల్లో అగ్రగామియైన అమరావతి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆదివారం రాత్రికే అమరేశ్వరాలయానికి చేరుకున్న భక్తులు తెల్లవారు ఝామున పవిత్ర కృష్ణానదిలో, దేవాలయ అధికారులు ఏర్పాటుచేసిన తుంపర్ల స్నానాన్ని ఆచరించి భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. తెల్లవారు ఝామున 4 గంటలకు స్వామివారి పేరట ప్రత్యేక అభిషేకాలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. క్రమక్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో అమరేశ్వరాలయం, అమరావతి ప్రధాన వీధులు భక్తులతో కిటకిటలాడాయి. అమరేశ్వరాలయం శివనామ స్మరణతో మార్మోగింది. ఆదుకో అమరేశ్వర, శంభోశంకర సాంబశివ శివ అంటూ భక్తులు క్యూలైన్లలో వెళ్లి స్వామివార్లను దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా బాలచాముండికా అమ్మవారిని రంగురంగుల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. స్వామివార్లను విఐపిలుగా జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, కుటుంబ సమేతంగా సందర్శించి స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీ్ధర్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, టిడిపి అధికార ప్రతినిధి డొక్కా మాణిక్యవరప్రసాద్, తోట త్రిమూర్తులు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు ఆర్‌డిఒ భాస్కరనాయుడు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు కుటుంబ సమేతంగా స్వామివార్లను దర్శించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా భక్తులు పాల్గొని బాలచాముండికా అమరేశ్వరస్వామివార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. అమరేశ్వరాలయ ప్రాంగణంలో చలపతి విద్యాసంస్థల అధినేత వైవి ఆంజనేయులు పర్యవేక్షణలో శివరాత్రి భక్తులకు, మజ్జిగ, పాలు సరఫరా చేశారు. చందనాబ్రదర్స్ వారు మజ్జిగను భక్తులకు అందించారు. స్వచ్ఛంద సేవాసంస్థలు స్వామివార్లకు ప్రసాదాలు అందజేశారు. శ్రీ అమరలింగేశ్వర సేవాసమితి గుంటూరు వారు స్వామివారి కల్యాణంలో పాల్గొన్న భక్తులకు ప్రసాదంగా అందించాలని 2 వేల లడ్డులను దేవాలయ అధికారులకు అందజేశారు. మహాశివరాత్రి ఉత్సవాలను దేవాదాయశాఖ సహాయ కమిషనర్ శ్రీనివాసరావు, ఆలయ అధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశారు. అవాంచనీయ సంఘటనలు జరగకుండా సత్తెనపల్లి డిఎస్‌పి మధుసూదనరావు ఆధ్వర్యంలో అమరావతి సిఐ హనుమంతరావుతో పాటు సుమారు 300 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం...
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి అమరేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని స్థానాచార్యులు జగర్లపూడి వెంకటేశ్వరశాస్ర్తీ, ప్రధాన అర్చకులు శంకరమంచి మధుసూదనశర్మ పర్యవేక్షణలో వేద పండితులు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా సుమారు 50 వేల మందికి పైగా భక్తులు అమరావతిని సందర్శించి ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.