గుంటూరు

మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: పంచారామాల్లో అగ్రగామియైన అమరావతి దివ్యక్షేత్రాన్ని మహాశివరాత్రి సందర్భంగా సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ముస్తాబు చేశారు. సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు సోమ, మంగళవారాల్లో దర్శించి తరిస్తారనే ఉద్దేశంతో అందుకు తగ్గట్టుగా దేవాదాయశాఖ అధికారులు ఇతరశాఖ అధికారులతో సమన్వయంతో విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారుల సహకారంతో మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు ముందుగా నిర్ణయించిన మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమరేశ్వరాలయంలోని ప్రధాన ఆలయంతో పాటు అన్ని ఆలయాలకు రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరణ చేసినట్లు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు ఎండ తగలకుండా షామియానాలు కూడా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కృష్ణానదిలో నీటిమట్టం లేకపోవడంతో భక్తుల సౌకర్యార్ధం అమరేశ్వర స్నానఘాట్‌లో ఒకసారి 200 మందికి పైగా భక్తులు స్నానం చేసేలా షవర్‌బాత్ సౌకర్యాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు. దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులతో పాటు, అవసరమైన పారిశుద్ధ్య సౌకర్యాలు, తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రత్యేక అభిషేకం, మహారుద్రాభిషేకం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటుచేసి వివిధ బ్యాంకుల వారి సహకారంతో టిక్కెట్లు అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛంద సేవాసంస్థలు, వివిధ వ్యాపార సంస్థల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో పులిహోర, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పెదకూరపాడు ఎమ్మెల్యే డాక్టర్ కొమ్మాలపాటి శ్రీ్ధర్, మహాశివరాత్రి ఉత్సవ కో ఆర్డినేటర్, ఆర్‌డిఒ భాస్కరనాయుడు పర్యవేక్షణలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
350 మందితో పోలీసు బంధోబస్తు...
మహాశివరాత్రి ఉత్సవాలు, స్వామివారి రథోత్సవం సందర్భంగా ఒక డిఎస్‌పి, నలుగురు సిఐలు, 13 మంది ఎస్‌ఐలు, 160 మంది హోంగార్డులు, 130 మంది పోలీసులు, 31 మంది ఎఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుళ్లు, 20 మంది మహిళా పోలీసులతో విస్తృతస్థాయి బంధోబస్తు ఏర్పాటు చేశారు.