బిజినెస్

లోక్‌సభకు బోనస్ సవరణ బిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం సోమవారం బోనస్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. బోనస్ కోసం ఉద్యోగి వేతన సీలింగ్‌ను ప్రస్తుతమున్న 10,000 రూపాయల నుంచి 21,000 రూపాయలకు పెంచడంతోపాటు నెలసరి బోనస్ గణన సీలింగ్‌ను ప్రస్తుతమున్న 3,500 రూపాయల నుంచి 7,000 రూపాయలకు పెంచాలనే ప్రతిపాదనలతో ఈ బిల్లు లోక్‌సభకు వచ్చింది. 1965 బోనస్ పేమెంట్ చట్టంలో మార్పులు తీసుకువస్తూ ఈ సవరణ బిల్లును కేంద్రంలోని మోదీ సర్కారు తాజాగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. 20 అంతకంటే ఎక్కువగా ఉద్యోగులున్న సంస్థలు, కర్మాగారాలకు ఈ బిల్లు వర్తిస్తుంది.
నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్ సవరణ బిల్లు ఆమోదం
ఎలాంటి చర్చ లేకుండానే సోమవారం రాజ్యసభలో నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్ సవరణ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ ఆగస్టు 6నే ఆమోదించగా, ఇప్పుడు శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చెక్ బౌన్స్ కేసులకు సంబంధించినది. దేశవ్యాప్తంగా 18 లక్షల చెక్ బౌన్సు కేసులున్నాయని అంచనా. ఇందులో ఆయా రాష్ట్రాల్లోని హైకోర్టుల్లోనే దాదాపు 38,000 వరకు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, ఈ బిల్లు ఆమోదం పొందడానికి సహకరించిన ప్రతిపక్ష సభ్యులకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు నఖ్వీ ప్రతిపాదనతో బిల్లును రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ప్రవేశపెట్టారు. దీంతో ఈ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించాలని గతంలో నిర్ణయించుకున్నట్లు సభ్యులకు డిప్యూటి చైర్మన్ పిజె కురియన్ తెలియజేయగా, వెనువెంటనే బిల్లు ఆమోదం పొందింది.