అంతర్జాతీయం

అమెరికాలో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్:అమెరికా అధ్యక్షుడు ప్రసంగించాల్సిన ఓ సభకు కొద్దిసేపు ముందు పైప్‌బాంబ్ పేలిన సంఘటన సంచలనం రేపింది. ఇది జరిగిన కొద్దిసేపటికే మరో ప్రాంతంలోనూ బాంబు పేలుళ్లు సంభవించడం విశేషం. శనివారం సాయంత్రం న్యూజెర్సీలో ఓ ఛారిటీ రేస్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరై సభలో ప్రసంగించాల్సి ఉంది. మరికొద్దిసేపటిలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందనగా బాంబు పేలుడు సంభవించింది. ఇది జరిగిన కొద్ది గంటల తరువాత న్యూయార్క్ నగరంలో డంప్‌యార్డ్‌లో వరుసగా రెండు బాంబు పేలుడు సంఘటనలు జరిగాయి. మొత్తంమీద ఈ సంఘనటలలో 29మంది గాయపడ్డారు. ఈ దాడి స్థానిక దుండగుల పనా, లేక ఉగ్రదవాదుల పనా అన్నది తేలాల్సి ఉంది.