క్రీడాభూమి

అమీర్‌కు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిక్షణాశిబిరానికి హాజరైన హఫీజ్, అజర్ అలీ

కరాచీ, డిసెంబర్ 26: పాకిస్తాన్ క్రికెట్‌లో పెను తుపాను సృష్టిస్తుందనుకున్న వివాదం చాలా తొందరగానే ముగిసింది. ఫిక్సింగ్‌కు పాల్పడి, జైలు శిక్షను, ఐదేళ్ల సస్పెన్షన్ వేటును ఎదుర్కొన్న ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్‌ను మళ్లీ జాతీయ జట్టులో స్థానం కల్పించేందుకు వీలుగా ప్రాబబుల్స్‌కు ఎంపిక చేయడంతో టి-20 మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్, ప్రస్తుత వనే్డ జట్టు కెప్టెన్ అజర్ అలీ శిక్షణాశిబిరాన్ని బాయ్‌కాట్ చేశారు. జట్టులో కీలకంగా వ్యవహరిస్తున్న వీరిద్దరూ శిబిరానికి వచ్చేది లేదని భీష్మించుకోవడంతో సమస్య తలెత్తింది. కళంకితుడైన అమీర్ పాల్గొంటున్న శిబిరానికి హాజరయ్యేది లేదని వీరు స్పష్టం చేయడం పాకిస్తాన్ క్రికెట్‌ను గందరగోళ పరిస్థితుల్లోకి నెట్టింది. అయితే, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధికారులు జోక్యం చేసుకొని నచ్చచెప్పడంతో వీరిద్దరూ శనివారం శిక్షణాశిబిరానికి హాజరయ్యారు. అమీర్‌కు తుది జట్టులో స్థానం లభిస్తే, ఎలాంటి షరతులు లేకుండా అతనికి సహాయసహకారాలు అందిస్తామని వారు విలేఖరులతో మాట్లాడుతూ ప్రకటించారు. అమీర్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. తమ అనుమానాలు నివృత్తికావడంతో శిక్షణకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇలావుంటే, సీనియర్లు శిక్షణాశిబిరాన్ని బాయ్‌కాట్ చేయడంతో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న అమీర్ ఊపిరి పీల్చుకున్నాడు. సహచరులతో కలిసి ముమ్మర ప్రాక్టీస్ చేశాడు. కాగా, న్యూజిలాండ్ టూర్‌కు వెళ్లనున్న పాక్ జట్టులో అమీర్‌కు స్థానం దక్కే అవకాశాలున్నాయి.