జాతీయ వార్తలు

లౌకికవాద చాంపియన్ మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ విధానాలు సైద్ధాంతిక వ్యతిరేకం కాదు
ఆర్‌ఎస్‌ఎస్ సదస్సు ముగింపు సభలో అమిత్ షా

నాగౌర్ (రాజస్థాన్), మార్చి 13: జాతీయ వాదానికి ప్రధాని నరేంద్ర మోదీ ఛాంపియన్ అనీ బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. కేంద్రంలోని ఎన్‌డిఏ సర్కార్ బిజెపి వౌలిక సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తోందని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, అలాగే భారతీయ జనతా పార్టీ తీసుకునే ఏ చర్యా కూడా సంఘ్ పరివార్ వౌలిక సిద్ధాంతానికి విరుద్ధంగా ఉండే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన అమిత్ షా, ‘ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి చర్యలు చేపట్టినా అవన్నీ కూడా బిజెపి అనుసరిస్తున్న సిద్ధాంతానికి, విలువలకు అనుగుణంగానే ఉంటాయి’ అని ఉద్ఘాటించారు. గత ఏడాదిన్నర కాలంగా కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి తీసుకున్న నిర్ణయాలను, అమలుచేసిన పథకాలను ఈ సందర్భంగా ఆయన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు వివరించారు. ముఖ్యంగా మోదీ సర్కార్ తీసుకున్న ప్రధాన నిర్ణయాలు, అలాగే సాధించిన విజయాలను కూడా ఈ సందర్భంగా అమిత్ షా వెల్లడించారు. బిజెపి మజ్దూర్ సంఘ్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగానే పిఎఫ్ విత్‌డ్రాయల్స్‌పై పన్ను విధించాలన్న ప్రతిపాదనను విరమించుకోవడం జరిగిందని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగిన ఆర్‌ఎస్‌ఎస్‌లో భాగంగా ఉన్న అఖిల భారతీయ ప్రతినిధుల సభ ముగింపు సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.