జాతీయ వార్తలు

సుప్రీం పర్యవేక్షణలో ఎన్‌ఆర్‌సీ ప్రక్రియ:అమిత్ షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు పర్యవేక్షణలోనే దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సి ప్రక్రియ జరుగుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆయన రాజ్యసభలో కశ్మీర్ అంశంపై మాట్లాడుతూ అసోంలో ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేనివారు ట్రిబ్యునల్ కోర్టును ఆశ్రయించవచ్చని, ఆ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కాగా ఎన్‌ఆర్‌సీ (జాతీయ పౌర జాబిత) దేశవ్యాప్తంగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. ఇది ఏ ఒక్క మతాన్నో లక్ష్యంగా చేసుకుని వారిని తొలగించటానికి కాదని అన్ని మతాలవారికి ఆశ్రయం కల్పిస్తామని, సిక్కులు, బౌద్ధులు, జైనులు, క్రిస్టియన్లు, పార్సీ శరణార్థులు తదితరులందరూ పౌరసత్వం పొందుతారని అన్నారు.