తెలంగాణ

భద్రతపై ముందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్జికల్ దాడులకూ కేంద్రం సిద్ధం మచ్చలేకుండా మోదీ మూడేళ్ల పాలన
ఒకే దేశం ఒకే ఎన్నికపై చర్చ జరగాలి మత రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం
స్పష్టం చేసిన బిజెపి అధ్యక్షుడు అమిత్ షా

హైదరాబాద్, మే 23: దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదని భారతీయ జనత పార్టీ అధ్యక్షుడు అమిత్ షా స్పష్టం చేశారు. పొరుగు దేశం ఆగడాలను తిప్పికొట్టేందుకు సర్జికల్ దాడులతో భారత్ సమాధానమిస్తోందన్నారు. సర్జికల్ దాడులతో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, సైన్యంలో ఆత్మ విశ్వాశం నింపుతోందన్నారు. నల్లగొండలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ మూడేళ్లలో ప్రధాని మోదీ మచ్చలేని పాలన అందించారన్నారు. ఒకే దేశం, ఒకే ఎన్నికపై మరింత చర్చ జరగాలన్నారు. మత రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని షా అన్నారు. నల్లగొండ పర్యటన ఉద్దేశాలను వివరించిన అమిత్ షా, యూపీఏ ఎన్డీయే పాలనమధ్య వ్యత్యాసం, ఎన్డీయే సాధించిన అభివృద్ధి, తెలంగాణకు కేంద్రం చేస్తోన్న సాయాన్ని వివరించారు. విస్తారక్ యోజనలో భాగంగా తాను నల్లగొండ పర్యటనకు వచ్చానని, మూడు రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాల్లో పర్యటించి ప్రజాభిప్రాయం తెలుసుకుంటానన్నారు. ఇప్పటికే రెండు రోజుల పర్యటన ముగించామని, బుధవారంతో పర్యటన ముగుస్తుందన్నారు. నాలుగు లక్షల మంది బిజెపి కార్యకర్తలు విస్తారక్ యోజనలో పాల్గొంటున్నట్టు ప్రకటిస్తూ, ఇంత పెద్దఎత్తున పార్టీ ప్రచారం చేపట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమమన్నారు. 2014లో దేశ ప్రజలు చారిత్రక తీర్పు ద్వారా మోదీ ప్రభుత్వాన్ని గెలిపించారని గుర్తు చేశారు. 2004 నుంచి పదేళ్ల పాటు కాంగ్రెస్ అవినీతికి పాల్పడిందని, దీంతో అన్ని వ్యవస్థలకూ పక్షవాతం వచ్చిందన్నారు. 12 లక్షల కోట్లమేర పలు కుంభకోణాలు కాంగ్రెస్ హయంలో జరిగాయని, చివరికి ప్రణాళికలు అమల్లోనూ చతికిలపడ్డాయన్నారు. దేశ భద్రత విషయంలో రాజీపడాల్సి వచ్చిందని, మహిళలు అభద్రతా భావానికి లోనయ్యారన్నారు. యువత అసంతృప్తికి లోనైందని, దేశ పరువు గంగలో కలిసిందన్నారు. తర్వాత దేశ ప్రజలు ఎన్డీయేకు మద్దతిచ్చారని, అభివృద్ధిని నరేంద్రమోదీ ప్రభుత్వం ఉరకలెత్తించిందన్నారు. 28 కోట్ల మేర జన్‌ధన్ అకౌంట్లు తెరిచారని, ఉజ్వల పథకం కింద రెండు కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మరో మూడు కోట్ల మందికి ఈ పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తామన్నారు. ముద్ర యోజన కింద 7.6 కోట్లమంది ప్రజలు రుణాలను పొందారని, ప్రభుత్వం ఒబిసి కమిషన్‌ను నియమించిందని, సరిహద్దులను కాపాడుకునేందుకు సర్జికల్ స్ట్రైక్స్‌కు అనుమతి ఇచ్చిందన్నారు. 107 ఉపగ్రహాలను ఒకేమారు ప్రయోగించి ప్రపంచంలో భారత్ తలెత్తుకుందన్నారు. రాజకీయ అవినీతిని నిర్మూలించేందుకు 2వేల రూపాయిలు దాటితే చెక్ ద్వారా తీసుకునేలా నిబంధనలు తెచ్చామన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి దేశంలో ఆర్ధిక స్థితికి దిశను ఇచ్చిందన్నారు. ఒకే హోదా ఒకే పెన్షన్ పథకాన్ని సైనికులకు అమలుచేశామని, అలాగే 17వేల గ్రామాలకు నేటికీ విద్యుత్ సదుపాయం లేకపోవడంతో 13వేల గ్రామాలకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. బినామీ ఆస్తులను రద్దు చేశామని, బీమ్ అప్లికేషన్ ద్వారా నగదు బదిలీకి అవకాశం కల్పించామన్నారు. జనరిక్ మందులనే అమ్మేలా చర్యలు చేపట్టామని, రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అమలు చేశామని, దేశవ్యాప్తంగా 60 శాతం భూభాగంలో బిజెపి విస్తరించిందన్నారు. బిజెపి చేరికలను ప్రోత్సహిస్తుందా? అన్న ప్రశ్నకు, అది చేరిన వారి ఒకొక్కరినీ పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.
chitram...
నిరుపేద ఇంట ఆనందంగా టీ సేవిస్తున్న అమిత్ షా