జాతీయ వార్తలు

మహాకూటమి నాయకుడు ఎవరో చెప్పాలి:అమిత్‌షా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్: మహాకూటమి ఏర్పాటుచేస్తున్న నాయకులు అంతా రాష్టస్థ్రాయి నాయకులేనని, ఆ కూటమికి నాయకుడు ఎవరో చెప్పాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. ఆయన మంగళవారంనాడు ‘మెగా పరివార్-బీజేపీ పరివార్’ పేరుతో ఏర్పాటుచేసిన ప్రతి ఇంటిపై బీజేపీ జెండా కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగటానికి 2019 ఎన్నికలు ఎంతో ముఖ్యమని, తాను దేశమంతా తిరిగానని అందరి కళ్లల్లోనూ మోదీ ప్రధాని కావాలనే ఆకాంక్ష బలంగా ఉందని అన్నారు. మహాకూటమిలోని నేతలంతా రాష్టస్థ్రాయి నేతలేనని, వారంతా ఎక్కడ ప్రచారం చేసినా ప్రభావం ఉండదని అన్నారు. వారి నాయకుడు ఎవరో వారికే తెలియదని అన్నారు. ఎన్డీయే ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ అని మనకు తెలుసునని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ప్రతిపక్షాల గురించి పట్టించుకోకుండా ప్రజల వద్దకు పార్టీని తీసుకువెళ్లాలని అన్నారు.