అక్షరాలోచన

అమ్మతో.. నేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మ నాన్నల
సృష్టి కార్య కలయికలో...
అమ్మ మాతృమూర్తియై
నేనో జీవంలా రూపాంతరమై
దినదినాభివృద్ధితో...
నను కంటికి రెప్పలా...
తన కడుపుకు తానే కాపరై
నే.. రంగు రావాలని
కుంకుమ పువ్వు
కోరి ఏరి తెచ్చి ఆరగించి
నే.. బాలభీముడులా అవ్వాలని
శ్రీమంతం పేరిట
తీపి తాను తింటూ...
నన్ను బలవంతుణ్ని చేస్తూ...
తన హృదయంతో...
నా.. హృదయానికి
రక్తబంధాన్ని జోడిస్తూ...
నవమాసాలకు
నన్ను నవరంధ్రాలతో...
నవగ్రహాల సాక్షిగా
అమ్మతో - నేను
ఈ... లోకంలో కనులు తెరిచా!!

-కుంచె చింతాలక్ష్మీనారాయణ 9908830477