తూర్పుగోదావరి

అమ్మోనియా గ్యాస్ లీకై 14 మందికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావులపాలెం, డిసెంబర్ 8: రావులపాలెం మండలం ఈతకోట సమీపంలో ఉన్న ఒక సీఫుడ్ ఫ్యాక్టరీ పైప్‌లైన్ నుండి మంగళవారం సాయంత్రం అమ్మోనియా గ్యాస్ లీకవడంతో సమీపంలోని కాలనీకి చెందిన 14 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలావున్నాయి. గ్రామ శివారు 16వ నంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సీఫుడ్ ఫ్యాక్టరీ వెనుక నెక్కంటి కాలనీ ఉంది. మంగళవారం సాయంత్రం కాలనీ వైపు ఫ్యాక్టరీ గోడకు ఉన్న పైప్‌లైన్ నుండి ప్రమాదవశాత్తూ అమ్మోనియా గ్యాస్ లీకైంది. ఈ అమ్మోనియా గ్యాస్‌ను ఫ్యాక్టరీలో రొయ్యలు నిల్వ చేసేందుకు అవసరమయ్యే కూలింగ్ కోసం వినియోగిస్తుంటారు. గ్యాస్ లీకవడంతో సమీపంలోని ఇళ్లల్లో ఉన్న వారు దీనిని పీల్చడంతో అస్వస్థతకు గురయ్యారు. పలువురు వాంతులు, శ్వాస సంబంధిత సమస్యలకు గురికావడంతో సమాచారం అందుకున్న సిఐ పివి రమణ, ఎస్‌ఐ పివి త్రినాథ్‌లు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తొలుత అస్వస్థతకు గురైన ఏడుగురిని మండలంలోని ఊబలంక పిహెచ్‌సికి తరలించగా ప్రాథమిక చికిత్స అందజేశారు. అనంతరం రావులపాలెంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రికి అస్వస్థతకు గురై ఆసుపత్రిలోకి చేరిన వారి సంఖ్య 14కు చేరిందని ఎస్‌ఐ త్రినాథ్ తెలిపారు. అయితే వీరిలో ఆరుగురు శ్వాస తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో వారిని రాజమండ్రిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో దూనబోయిన వెంకటరమణ, షేక్ అబ్దుల్ రజాక్, షేక్ మెహర్ మున్సీసా, షేక్ మస్తాన్ బిబి, మున్నీసా, మట్టపర్తి నాగలక్ష్మి, రేవుశెట్టి అలివేరు మంగతాయారు, అప్పారి సత్యవతి, తోటకూర మణెమ్మ, రాచమళ్ల సత్యవతి, వి వెంకటలక్ష్మి, సంగిశెట్టి దుర్గాదేవి, షేక్ గులాబి, షేక్ కుమారి బిబి, నెల బాలుడు తదితరులు ఉన్నట్టు ఎస్‌ఐ తెలిపారు. బాధితులను ఎంపిపి కోట చెల్లయ్య, జడ్పీటీసీ సాకా ప్రసన్నకుమార్ తదితరులు పరామర్శించారు.