అమృత వర్షిణి

బహుదూరపు బాటసారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థవంతమైన మాటలు, సారవంతమైన సంగీతంతో కలిస్తేనే నిజమైన సార్థకత.
పాటకు సంబంధించినంత వ రకూ ప్రతి పాటకూ ‘ఆత్మ’ వుం టుంది. ఈ వేళ నేర్చుకున్న బాణీని నేర్చినట్లుగానే చిలక పలుకుల్లా అప్పజెప్పే గాయకులు పెరిగిపోయారు. కానీ భావాన్ని గుండెల్లో నింపుకుని హృదయపు లోతుల్లోంచి పాడగలిగే గాయకుల అవసరం తగ్గిపోయింది. సుస్వరంతో మధురాతి మధురంగా చెవికిసోకే ధ్వని విశేషమే నాదం. ఉరుములు, మెరుపులతోనూ మబ్బులతోనూ నిండిపోయి, ఒక చుక్కా వాన పడకపోతే ఎలాగో, రంగు, రుచి, వాసనా రాగ సౌందర్యం లేని పాటలైనా అంతే. అటువంటి పాటలు పాడేవారికీ ఇటు వినేవారికీ ప్రయోజనాన్ని ఇవ్వవు.
సంగీత ప్రధానమైన చలనచిత్రాల శకం ముగిసింది.
అప్పుడు సంగీతం ప్రధానం. ఇప్పుడు సంగీతం ఒక అవసరం. రేడియోను తీసుకోండి.
ఒకప్పుడు రేడియోకు సంగీతమే ప్రధాన ఆకర్షణ. గౌరవమైన సంప్రదాయ సంగీతానికే ప్రాధాన్యతనిచ్చే డైరెక్టర్లుండేవారు. శాస్ర్తియ సంగీత విలువలకు దూరం కా కుండా సుమధురమైన లలిత సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఏకంగా ఒక లలిత సంగీత వాద్య బృందమే ఉండేది. (లైట్ మ్యూజిక్ యూనిట్) లలిత సంగీత శాఖను ఏర్పాటు చేసి రేడియోలో సినిమా సంగీత ప్రభావం ఏమీ లేకుండా లలిత సంగీత గాయకులను ప్రోత్సహించారు. మద్రాసు కేంద్రంగా ఉండే వాద్య బృందానికి డా.బాలాంత్రపు రజనీకాంతరావు కార్యనిర్వాహకుడిగా, లలిత సంగీత శాఖ నిర్వహించే ఆ రోజుల్లో మల్లిక్, ఎ.నారాయణ అయ్యర్, సిహెచ్.గోపాలశర్మ, వీణ కామేశ్వరశర్మ మొదలైన ఉద్దండులైన విద్వాంసులతో ప్రముఖ గాయనీ గాయకులంతా ఒకప్పుడు ఎనె్నన్నో మధుర గీతాలు పాడినవారే!
1970లో నేను ఆకాశవాణిలో ఎనౌన్సర్‌గా అడుగుపెట్టే నాటికి ఆకాశవాణి లలిత గీతాలు విరివిగా ప్రసారవౌతూ శ్రోతలను ఆకర్షించేవి. వాటిలో ‘్ఫక్కున నీవు నవ్విన చాలు’ అనే ఆరుద్ర గీతం (ఘంటసాల, లీల), ఘంటసాల పాడిన ‘జీవితమంతా కలయేనా’ ‘పాడనా ప్రభూ పాడనా’ మరికొన్ని తమిళ లలిత గీతాలు ప్రసారమవుతూండేవి. అలా క్రమంగా ఆకాశవాణి లలిత సంగీతానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పడింది. లలితమైనా, లలిత శాస్ర్తియ సంగీత బాణీలైనా, సంప్రదాయ సంగీతం పాడే విద్వాంసులు సైతం మెచ్చుకునేలా, ఆకాశవాణికి కొన్ని సంగీత ప్రమాణాలుండేవి. వాటికి భిన్నంగా పాడేవారిని పక్కనపెట్టేసేవారు. తేలికపాటి బాణీలకు చోటుండేది కాదు.
ఘంటసాలను ఆకాశవాణిలో ఎంపిక చేసిన వ్యక్తి డా.బాలాంత్రపు రజనీకాంతరావు. తన మధురమైన కంఠస్వరంతో కొన్ని దశాబ్దాలపాటు ఆంధ్రావనిని ఉర్రూతలూగించిన గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు. ‘సంగీతం’ అంటే ఏదో కొందరి కోసం, కొందరిచేత, కొందరి విలాస భరితమైన కళ అని భావించని గాయకుడు ఘంటసాల.
సినీ రంగంలో లబ్ధప్రతిష్టులైన గాయనీ గాయకులు వేలాది పాటలు పాడి వుండచ్చు. కానీ సినిమా పాటలకు సంగీత గౌరవాన్నిస్తూ పాడిన నేపథ్య గాయకులలో ఘంటసాల ప్రథముడు.
2003 సంవత్సరంలో ఓసారి ఘంటసాల సతీమణి సావిత్రి విజయవాడ వచ్చారు. ఆమెతో ముచ్చటించే అవకాశం కలిగింది.
ఆయన పాడిన వేలాది పాటలలో ‘గాలిలో నా బ్రతుకు తేలిపోయినదోయి’ మొట్టమొదటి రికార్డు. ఆ పాట రతన్‌రావు రాశారు. 1945లో ‘స్వర్గసీమ’లో భానుమతితో కలిసి పాడిన ‘లే యెనె్నల చిరునవ్వుల’ పాటలో ఆయన సినీ సంగీత ప్రస్థానం మొదలైంది.
ఒకసారి ఘంటసాల బృందం ఢిల్లీలో పాడినప్పుడు, అప్పటి రాష్టప్రతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ఘంటసాలను రాష్టప్రతి భవన్‌కు ఆహ్వానించారు. దానికి ఘంటసాల ఎంత పులకించిపోయారో? నెహ్రూకి చెప్పి ఘంటసాల గాత్రం వినేందుకు ఆయన్ని కూడా ఆహ్వానించారు.
రాష్టప్రతి ఘంటసాలను ‘కుంతీకుమారి’ పద్యాలు పాడమని అడిగారు. ఒక్కొక్క పద్యం భావంతో కమ్మగా పాడుతోంటే అర్థాన్ని డా.రాధాకృష్ణన్ నెహ్రూకు వివరించారు. అర్థం తెలిసి వింటున్న జవహర్‌లాల్ నెహ్రూ ఆనందంతో ఘంటసాలను అభినందించారు.
మల్లాది: ‘మల్లీశ్వరి’ పాటలు, రాజేశ్వర్రావుకు, భానుమతికీ, ఘంటసాలకూ ఎంతో పేరు తెచ్చాయి కదా! ‘ఔనా నిజమేనా’ అనే పాట ఆయన అంత తక్కువ శృతిలో ఎందుకు పాడవలసి వచ్చిందో మీకు తెలుసా?
సావిత్రి: ఆయనకు సైగల్ పాడిన పాటలు వినటం ఇష్టంగా వుండేది. మల్లీశ్వరిలో ‘ఆ పాటలో’ ‘గుజర్ గయా జమానాకైసా’ అనే సైగల్ పాట మధ్యలో సైగల్ నవ్వినట్లుగా వేదాంత ధోరణి ప్రస్ఫుటమయ్యేలా, నవ్వాలని పదేపదే ఆ రికార్డు వింటూ ప్రాక్టీసు చేస్తూ ‘నవ్వు సరిగా వచ్చిందా?’ అని అడిగేవారు. ఆయన సాధన చేసిన ‘నవ్వు’ ఏదో యాంత్రికంగా ఉండేది కాదు.
ఎంతో బరువుగా బాధ, విరక్తి తొంగి చూసినట్లు వుండేది. దేవదాసులో ‘జగమే మాయ’ పాట చివర్లో కూడా అలాగే నవ్వారు.
మల్లాది: ఘంటసాల ఎందరో సంగీత దర్శకుల పాటలు పాడిన గాయకుడు. ఆ రోజుల్లో సంగీత దర్శకులతో ఆయన అనుభవాలు గుర్తున్నాయా?
సావిత్రి: ఆయనకు నాగయ్య గారంటే ఎంతో గౌరవం. ‘లవకుశ’ చిత్రం పూర్తవడానికి ఏడు సంవత్సరాలు పట్టింది. ఆ చిత్రం నిర్మాణంతో నిర్మాత శంకర్రెడ్డిగారు ఆర్థికంగా ఎంతో దెబ్బతిన్నారు. అన్ని పాటలూ ఆయనే్న పాడమన్నారు. నాగయ్యక్కూడా తనే పాడవలసి వచ్చినపుడు మాత్రం మా ఆయన ఎంతో బాధపడ్డారు. ‘నేనేమిటి? నాగయ్యగారికి పాడటమేమిటి? ఇంతకంటే అపచారం మరోటి ఉందా?’ అని నాగయ్య గారింటికి వెళ్లి విషయం చెప్పారు. నాగయ్యగారు ఘంటసాలను అనునయించి ‘చూడు నాయనా! నేను ఇప్పుడు పాడే స్థితిలో లేను. నాకు ఎవరో ఒకరు పాడక తప్పదు. ఆ పాడేది నువ్వే అయితే అంతకు మించిన సంతోషం లేదు’ అన్నారు. ఇతర గాయకులలోని గొప్పతనాన్ని గ్రహించగలిగే సంస్కారి మా ఆయన. అందుకే తాను మాత్రమే పాడవలసినవి కొన్ని పాడి, మరి కొందరికి అవకాశాలిచ్చేవారు. ఆయనకు మహ్మద్ రఫీ, సైగల్, పంకజ్ మల్లిక్ అభిమాన గాయకులు.
సంప్రదాయ సంగీతం పట్ల గౌరవమున్న వారంతా ఆయనకు నచ్చినవారే. హిందీ రంగంలో నౌషాద్, సి.రామచంద్ర, సలీల్ చౌదరి, శంకర్-జైకిషన్ మొ. వారు ఆయనకు అభిమానపాత్రులైన దర్శకులు.
సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల, వేణు లాంటి సంగీత నేపథ్యమున్న వారంటే ఎంతో ఇష్టపడేవారు.
సుబ్బరామన్ గారి దగ్గర అసిస్టెంట్‌గా చేశారు రెండు మూడేళ్లు. ఆ చేస్తున్న రోజుల్లో భరణి సంస్థ లైలా-మజ్నుకి అసిస్టెంట్‌గా చేశారు. ఆ టైమ్‌లోనే స్పిప్నా పిక్చర్స్ వారు ‘కీలుగుర్రం’, ‘మనదేశం’.. ఇవన్నీ అలా ఒకటొకటి వచ్చాయి.
1947 ఆగస్టు నుంచి అవకాశాల కోసం వెళ్లి ప్రయత్నం చేసిన సందర్భం నాకు తెలీదు. ఎవరైనా వచ్చినప్పుడు నాకు ఖాళీ లేదు, రేపు కూర్చుందాం అని చెప్పడమే తప్ప, ఇవాళ ఖాళీగా ఉంది. ఇవాళే కూర్చుందాం అని చెప్పిన రోజులు లేవు. సుబ్బరామన్న గారికి ఈయన గొంతంటే చాలా ఇష్టం. ‘ఒరేయ్ రాజా’ అని పిలిచేవారు. చాలా అభిమానించేవారు. ఆయన చేసిన చాలా పాటల్లో ‘దేవదాసు’ పాటలు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. సుబ్బరామన్ గారికి, నాగేశ్వరరావు గారికి గొప్ప పేరు తెచ్చిపెట్టాయి.
మల్లాది: దేవదాసు పాటల్లో ఆయనకి బాగా నచ్చిన పాట ఏది?
సావిత్రి: జగమే మాయ ఆయనకు నచ్చినది. నాకు నచ్చింది ‘కల ఇదని నిజమిదని’.
మల్లాది: ప్రధాన పాత్ర వహించింది సముద్రాలగారు కదా. ఆయనతో పరిచయం ఎలా ఏర్పడింది.
సావిత్రి: మా పుట్టిన ఊరు పెదపురివెర్లు గ్రామం. సముద్రాల వారిది కూడా ఆ ఊరే. కె.విశ్వనాథ్ గారిది కూడా మా పక్క ఇల్లే. అభిమానంతో అప్పుడప్పుడు ఆచార్లు గారు మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రావడం, క్షేమ సమాచారాలు అడగటం అలవాటు ఉండేది. మా అమ్మగారిని ‘శివకాంత’ అనేవాళ్లు. వచ్చినప్పుడు ‘ఏమే శివకాంతా! చిన్నకూతురికి కూడా పెళ్లి చేసావుట’ అని అడిగారు. ఏరీ ఆయన? అని అడిగారు. మా ఆయన వచ్చినప్పుడు ఆయన వచ్చి ‘ఏరా.. ఏం చేస్తున్నావ్?’ అని అడిగారు. అలా అడిగినప్పుడు నేను సంగీతం నేర్చుకున్నాను, విజయనగరం కాలేజీలో అంటే సాయంత్రం అలా ఇంటికి రారా... కాసేపు పాడు అని అడిగారు. వెళ్లారు. ఆయన అడిగింది కూడా పాడారు. అప్పుడు ‘ఏరా? ఏం చేయదలచుకున్నావ్ నీ గొంతుని’ అని అడిగితే, ‘ఏమీ లేదు. అవకాశాల కోసం చూస్తున్నాను’ అన్నారీయన. (అప్పుడు 22 ఏళ్లు).. రా.. మద్రాస్.. రా అక్కడ సినిమాల్లో ఏమన్నా ఉపయోగపడతావో చూద్దాం అన్నారు. 1943 మేలో ఈయన మద్రాస్ వెళ్లారు. అక్కడ ఆచార్యుల వారి ఇంట్లోనే ఉన్నారు. కొన్ని రోజులు అక్కడ ఉన్నారు. నాగయ్యగారికి ఒక మెస్ ఉండేదిట. అక్కడ రోజుకి 50 మందికి తక్కువ కాకుండా వచ్చి భోంచేస్తూ ఉండేవారుట. నాగయ్యగారికి పరిచయం చేశారు సముద్రాల. ఆయనకు కూడా భోజనం అక్కడ గడిచిపోయేది. త్యాగయ్య సినిమాకి కోరస్‌లు పాడటం, అవసరమైతే వేషాలు వేయటం చేసేవారు. 70 రూపాయల జీతం నెలకి. అక్కడ పనిచేస్తుండగానే బలరామయ్యగారి కంపెనీ, దానికి కూడా ఆచార్యుల గారు రాసేవారు. బాలరాజు పిక్చర్స్, అక్కడ సుబ్బరామన్‌గారికి అసిస్టెంట్. పిక్చర్ రిలీజ్ ముందర ‘చెలియా కనరావా’ పాట నాగేశ్వరరావుగారు పాడితే, అది వెయిట్ అంత లేదు. అప్పటికే లైలా మజ్ను పాటలు అవుతున్నట్టున్నాయి. ‘చెలియా కనరావా’ సినిమాలో ఈయన చేత పాడించారు. పాడించినప్పుడు బాగుంది బాగుంది అని ఆ నోటా ఈ నోటా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి.

చిత్రాలు..శ్రీమతి ఘంటసాల సావిత్రి

- మల్లాది సూరిబాబు 9052765490