అమృత వర్షిణి

దుర్గతి పరిహారిణే.. దుర్గే.. నమస్తే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అష్ట దిగ్గజాలను ప్రస్తావిస్తే, శ్రీకృష్ణ దేవరాయల్ని వెంటనే తలుచుకుంటాం. ఈ అష్టదిగ్గజాలెవరన్న విషయంలో అభిప్రాయ భేదాలున్నా, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయగారి మల్లన్న, అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజ భూషణుడు (్భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు, తెలుగు సాహిత్య పాఠకుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కవులుగా, అష్టదిగ్గజాలు గానే ప్రఖ్యాతి పొందారు. సంగీత విషయం తీసుకుంటే తంజావూరు ప్రభువులను తలుచుకుంటే స్ఫురణకు వచ్చేది వారి ఆస్థానంలో, ప్రసిద్ధులైన దిగ్గజాల్లాంటి సంగీత విద్వాంసులను తలుచుకోవాలి. 1740-1833 సంవత్సరాల మధ్య తంజావూరును ఏలిన రాజుల కాలంలో ఎందరో వాగ్గేయకారులు, మహా సంగీత విద్వాంసులున్నారు. అప్పటికి త్యాగరాజు ఇంకా పుట్టనే లేదు. సంప్రదాయ సంగీతమంటే ఏమిటో కాసె్తైనా తెలిసిన వారికి సంగీతాభ్యాసంలో వర్ణాలుంటాయని గ్రహించగలరు. వర్ణాల ప్రాశస్త్యం విద్యార్థుల కంటె విద్వాంసులకే బాగా తెలుసు. అందులో విరిబోణి అనే ‘అటతాళ వర్ణ’మొకటుంది. సంగీతం డిప్లొమా వారికి ఇది పాఠ్యాంశం. భైరవి రాగంలో ఎంతో ప్రసిద్ధమైన ఈ అటతాళ వర్ణానికి సాటైన వర్ణం మరోటి లేదంటారు. ఈ వర్ణాన్ని తంజావూరు ప్రభువుల ఆస్థానంలోని ‘పచ్చిమిరియం ఆది అప్పయ్య’ అనే ప్రసిద్ధ సంగీతజ్ఞుడు రచించాడు. ఈనాటికీ ఈ ‘్భరవి’ రాగ వర్ణం ఎప్పుడూ నిత్య నూతనంగానే ఉంది. ఆది అప్పయ్య సమకాలీనుడైన శొంఠి వెంకట సుబ్బయ్య ఆయనకంటె చిన్నవాడు. ఆంధ్ర భాషా సాహిత్యంలోనూ, సంగీతంలోనూ ఎంతో ప్రజ్ఞ గల విద్వాంసుడు. పరాయి పాలన ఉన్నా ప్రభువులకున్న సంగీత సాహిత్యాభిమానం ఎంత గొప్పదో చూడండి. ఈయన కుమారుడే వెంకట రమణయ్య. శొంఠి వెంకటరమణయ్య దగ్గర త్యాగయ్య సంగీత విద్యాభ్యాసం చేసే రోజుల్లో ‘పచ్చిమిరియం’ వారి దగ్గర సంగీతంలో సందేహ నివృత్తి కోసం వస్తూ వెళ్తూండేవాడు. అప్పటికి అప్పయ్య వయో వృద్ధుడు. శొంఠి వెంకట సుబ్బయ్య మన గుంటూరు జిల్లా కాజ గ్రామానికి చెందిన నారాయణతీర్థుల వారి శిష్యుడు. అంటే త్యాగరాజుకు పరమేష్టి గురువన్నమాట.
ఎక్కడెక్కడి వ్యక్తులు (్భక్తులు) ఎలా కలుస్తారో తలుచుకుంటే ఆశ్చర్యమే. ఒకటే కారణం. సంగీత సాహిత్యాలు. ఈ రెండూ ఎటువంటి వారినైనా కలిపేస్తాయి.
భాగవతం దశమ స్కంధం ఆధారంగా రచింపబడ్డ తీర్థుల వారి తరంగాలెంత ప్రసిద్ధమో మీకు తెలుసు.
తీర్థుల వారు నరసింహస్వామి ఉపాసకుడు జగ్గయ్యపేట సమీపంలో నెలకొన్న వేదాద్రి శిఖరంపై నరసింహుణ్ణి కొలిచి, కృష్ణానది దాటి వారి అత్తవారి ఊరు వెళ్లిన సందర్భంలో ఆయన రచించిన
వేదాద్రి శిఖర నరసింహమా కలయామి
విమల విద్యు జ్వలిత జిహ్వం
వేదాంత వేద్య విమలా నంద విజ్ఞాన
విదళిత దురంత భవమోహం త్వాం నౌమి॥
అనే తరంగం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమయ్యే భక్తిరంజని కోసం, కొనే్నళ్ల క్రితం వోలేటి గారు స్వరపరిచారు. వీటితోబాటు మరో ఆరు తరంగాలు రికార్డు చేశాం. నేనూ పాడాను. ఇప్పటికీ ఇవి ప్రసారవౌతున్నాయి. నారాయణ తీర్థుల వారు ఆంధ్ర ప్రాంతం నుండి తంజావూర్ వెళ్లేలోగా ఇక్కడ ఒంగోలు, అద్దంకి, గుంటూరు ప్రాంతాల్లోని వందలాది భక్తులకు ఈ తరంగాలు స్వయంగా నేర్పారు. తరంగాలు పాడే వారింకా ఉన్నారు. ఆయన తంజావూర్ వెళ్లిన, కొంతకాలానికి శిష్యులంతా భజన కూటములుగా ఏర్పడి ఈ తరంగాలను సుప్రసిద్ధం చేసి ఆబాలగోపాలం పరవశిస్తూ పాడుకునేలా చేశారు. నిజానికి తరంగాలు ఆ రోజుల్లో కమ్మగా అలవోకగా సంగీత జ్ఞానంతో నిమిత్తం లేకుండా పాడగలిగేవారు. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై వెలసిన కనకదుర్గపై నారాయణ తీర్థుల వారు రెండు తరంగాలు రాశారు.
జయజయ వైష్ణవి దుర్గే జయజయ కల్పిత సర్గే
జయజయ తోషితభర్గే జయజయ కుచజిత దుర్గే॥
అనే తరంగం.
జయ జయ దుర్గే జితవైరి వర్గే
వియదనిలాది విచిత్ర సర్గే॥
అనే తరంగం మరోటి. ఈ తరంగాన్ని నేను కంపోజ్ చేసి, పాడి ప్రచారం చేయటానికి ఒక నేపథ్యముంది.
‘సంగీత కళానిధి’ డా.శ్రీపాద పినాకపాణి గారు శతాధిక వృద్ధుడైనా ఆయన సంగీతాన్ని వదల్లేదు. సంగీతం కూడా ఆయన్ని వదలలేదు. కర్నూలులో ఉంటూ, సంగీత వాతావరణాన్ని సృష్టించుకుని, లేవలేని స్థితిలో కూడా ఓపిక తెచ్చుకుని పాడుకున్న నాదయోగి. జీవితంలో అటువంటి సంగీత ఋషితో నాకు సాన్నిహిత్యం దొరకటమే కష్టంగా భావించిన రోజుల్లో జరిగిన సంఘటనానుభవం మీతో పంచుకోవాలని ఆశ.
‘పాణిగారు అత్యవసర చికిత్సా విభాగం (ఐసియు)లో ఉన్నారని తెలిసి కర్నూలు వెళ్లాను. వారి పిల్లల్ని తప్ప లోపలకు ఎవర్ని అనుమతించటంలేదు. విజయవాడ నుంచి నేనొచ్చినట్లు కబురంపి చెప్పగానే పరమానందంతో, ఒకవైపు చేతికి తగిలించిన ఇంజక్షన్, ముఖానికి ఒక మాస్కు, ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ఇసిజి, ఇసిఓ పరికరాల మధ్య పడుకుని ఏకాగ్రతతో చూస్తున్న పాణిగారు, పక్కనే వున్న వారితో సైగచేసి రమ్మనమన్నారు. లోపలకు వెళ్లగానే పాదాభివందనం చేసి నిలబడితే, నాతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. సంగీత మూర్తిత్రయం వారి ఆ కీర్తనలు వల్లించడానికి ఒక్క జీవితం సరిపోదు సుమా! అవి పాడుకోవడానికైనా మళ్లీ మళ్లీ పుట్టాలనిపిస్తుంది నాకు, అంటూ కాస్సేపాగి,
ఎన్నో రాగాల్లో కీర్తనలు కంపోజ్ చేశాను. కానీ శుద్ధసావేరి రాగంలో ఒక్కటే మరిచిపోయాను.
మీరేదైనా కంపోజింగ్ చేసి వినిపించరాదా? అన్నారు. హాస్పిటల్ చేరిన వాళ్లు సంగీత ప్రసక్తి చేయటం కుదిరేపనేనా? హనుమంతుడి ముందు నా కుప్పిగంతులే అని తెలుసు. ధైర్యం చేసి కూర్చుని ఉదయమే పాట చేసి సాయంత్రం వెళ్లి వినిపించాను. ఆయన శరీర స్థితికి చింత లేదు. మనసంతా సంగీతమే. అపరిమితానందపడి పక్కనే కూర్చున్న పెద్దబ్బాయి కామేశ్వర్రావును చూసి, తృప్తిగా చిన్న చిరునవ్వుతో పలకరించారు. సంగీతమే ప్రాణమనేవారు, ఎలా జీవించాలో చెప్పగలిగిన సంగీత సద్గురువు లెందరుంటారు? ఇదంతా నా గొప్పతనాన్ని ఆవిష్కరించటానికి కాదు. సంగీతమే శ్వాసగా బ్రతుకుతూ అందులోని ఆనందాన్ని క్షణక్షణం అనుభవించిన ఆ సంగీత ఋషిని తలుచుకోవడం కోసమే ఈ ప్రయత్నం. దివ్యమైన సంగీతాన్ని ఉపాసనా మార్గంలో పాడుకునేవారి అంతరంగాలు, జీవితాలెలా ఉంటాయో చెప్పటానికే ఈ ఉదాహరణ. కర్ణాటక సంగీత సంప్రదాయంలోని శుద్ధ సావేరి, హిందుస్థానీలో ‘దుర్గ’ రాగంలో ప్రసిద్ధమైన ఈ తరంగం ఒక్కసారి ఆర్తిగా పాడితే చాలు. మనకూ దేవతలకూ ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచేది ఒక్క పాటే. మాటలు కాదు.
జయ జయ దుర్గే జితవైరి వర్గే
విరిమదనిలాది విచిత్ర సర్గే॥

సుందరతర చరణారవిందే
సుఖపరిపాలిత లోక బృందే
నంద సునందాది యోగి వంద్యే
నారాయణ సోదరి పరానందే॥ జయ

అనుదయ లయ సచ్చిదానంద లతికే
ఆలోల మణిమయ తాటంక ధనికే
నానా రూపాది కార్యసాధనికే
నారాయణ తీర్థ భా విత ఫలకే॥ జయ జయ
పూలు, పళ్లు ఇచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఇవతలకు రావటంలో ఏముంది విశేషం? కొంచెం సంగీత జ్ఞానముండి, కాస్త పాడకలిగిన వారు, విగ్రహం ముందు నిగ్రహంతో శ్రుతిలయ సమన్వితంగా పరవశంతో ఆర్తిగా పాడటం కంటే, ఆర్జిత పూజలు విశేష పూజలూ ఎక్కువ కాదు.
భగవతికీ భక్తులకూ అనుసంధానమైనది, శ్రావ్యమైన గీతమే!

- మల్లాది సూరిబాబు 90527 65490, 9182718656