అంతర్జాతీయం

మానవాభివృద్ధిలో భారత్ అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 22: ఆసియా ఖండంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా వున్న భారత్ మానవాభివృద్ధిలో మాత్రం అధ్వాన్న స్థాయిలో వుంది. మొత్తం 188 దేశాల్లో జరిగిన సర్వేలో భారత్‌కు 131వ స్థానం దక్కింది. దీని పొరుగున వున్న పాకిస్తాన్, భూటాన్, నేపాల్‌లతో సమానమైన స్థాయికి మానవాభివృద్ధిలో భారత్ దిగజారినట్లు ఐక్యరాజ్య సమితి తాజాగా రూపొందించిన ఈ సర్వే నివేదికలో స్పష్టమవుతోంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్, చైనాలు సమాన స్థాయిలోనే అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని ఈ నివేదిక పేర్కొంది. అయితే మానవాభివృద్ధిలో మాత్రం గత ఏడాదికంటే కూడా భారత్‌లో పరిస్థితి ఏమాత్రం మెరుగు కాలేదని స్పష్టం చేసింది. 2014 సంవత్సరంలో కూడా మానవాభివృద్ధి సూచి విషయంలో భారత్‌కు 131వ స్థానమే ఉంది. తాజా నివేదికలోనూ అదే స్థాయి కొనసాగడం గమనార్హం. అయితే 23శాతం మంది భారతీయులు మాత్రం తమ జీవన ప్రమాణం సంతృప్తికరంగానే ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. మానవాభివృద్ధిలో అత్యంత వౌలికమైన ఆయుఃప్రమాణం భారత్‌లో 0.580 నుంచి 0.624కు పెరిగినట్లు స్పష్టం చేసింది. అలాగే ఈ ఆయుః ప్రమాణం 2015లో 68.3 సంవత్సరాలుగా ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. అలాగే తలసరి ఆదాయం కూడా 5,663 డాలర్ల మేర ఉన్నట్లుగా తెలిపింది. ఈ సర్వేలో భాగంగా అడిగిన అనేక ప్రశ్నలకు భిన్నమైన సమాధానాలే వచ్చాయి. ముఖ్యంగా భద్రతకు సంబంధించి 69 శాతంమంది సానుకూలతను వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ విషయంలో 72 శాతంమంది మహిళలు సానుకూలంగానే స్పందించారు. ఇలాంటి వారిలో పురుషుల సంఖ్య 78 శాతంగా ఉంది. 69 శాతంమంది కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరో 74 శాతంమంది న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పట్ల పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తమైంది.